తాడిగడప శ్యామల రావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for Sirimalle;తాడిగడప శ్యామల రావు

మాబామ్మగారు చాలా తరచుగా ఉప్పుడు పిండి చేసేస్తూ ఉండేవారు. దానితో ఇదేదో మహాసుభమైన వంటకం అన్ని అభిప్రాయం ఏర్పడింది.

మీ సచిత్ర వ్యాసం చదివాక ఉప్పుడు పిండి సరిగా చేయటం అంత ఆషామాషీ వ్యవహారం కాదని బోధపడింది.

పాకశాసనులైన శర్మ గారికి వందనాలు.


01 October 2024 10:53 PM

ఈమాట;తాడిగడప శ్యామల రావు

తిక్కపుట్టి తాను గడుపుతున్న జీవితం నుండి పారిపోవటం గురించిన కథ.

నిజానికి నిత్యమూ ఎంతో మందికి ఎన్నో కారణాలవలన తాము గడుపుతున్న జీవితాల నుండి పారిపోవాలన్న గాఢమైన సంకల్పం అప్పుడప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఐతే ఆసంకల్పం ఎంత తీవ్రంగా కలిగినా దానిలో చెప్పుకోదగినంత స్థిరత్వం కుదరక వారు పారిపోకుండా అవేజీవితాల్లో పడుంటున్నారు. ఆకోణంలో జరిగితే చదువరుల్లో కొందరైనా ఈచేతకాని వెధవ తమకంటే కొంచెం నయంగానే ప్రవర్తించి చివరకు తెగించి జీవితాన్నుండి పారిపోయాడు భలే అని ముచ్చటపడతారు. అదలా ఉంచితే పారిపోవటం అనేది ఎన్నటికీ నాయకలక్షణం కాదూ కాలేదూ కాబట్టి పారిపోయిన ఇతగాడి మీద చివరకు ఎక్కువమంది జాలిచూపుతారే కాని ఇతగాణ్ణి మాత్రం స్ఫూర్తిగా తీసుకొనే సాహసం చేయరు లెండి.

నిజం చెప్పాలంటే నేను మీరు నిజంగానే మీకథనాయకుడికి హఠాత్తుగా నాయకలక్షణాలు ప్రసాదించి తిరస్కరణలను తిరస్కరించి నిలబడే సమున్నతుణ్ణి చేసిపారేస్తారేమో కథాంతంలో అని దురాశపడ్డాను. అలాచేస్తే మరీ సాదాసీదా కథ ఐపోతుందీ రొటీన్ ముగింపు ఐపోతుందీ అనుకున్నారు కాని ఇలాంటి వాడు హీరో ఐపోవటం రొటీన్ కాదు కదా అని ఆలోచించారు కాదు కదా.

పోనీయండి.
ఒక జీవితం మనం కోరుకున్నట్లు సాగాలని లేదు.
ఒక కథ మనం అనుకున్నట్లు ఉండాలని లేదు.

మీ అసమర్ధుడి జీవితయాత్ర ఇలా ముగిసినందుకు అతగాడికి నాసానుభూతిని తెలియజేయండి మీకు ఎక్కడన్నా ఎప్పుడన్నా తారసపడితే!


28 September 2024 11:30 PM

మీతో చెప్పాలనుకున్నా!!!;తాడిగడప శ్యామల రావు

నా శ్యామలీయం బ్లాగులో‌ కూడా అప్పుడప్పుడు అన్నమయ్య సంకీర్తనలని వివరిస్తూ ఉంటాను . (See ) ఏదో అనామకం బ్లాగు కాబట్టి విజ్ఞులు ఎక్కువ మందికి తెలియకపోవచ్చును.


08 February 2023 11:20 AM

ఆలోచనాస్త్రాలు;తాడిగడప శ్యామల రావు

అమితాబ్ బచ్చన్ చెప్పేది నమ్మశక్యంగా లేదు. ఒక ఉత్పత్తికి ప్రచారం చేసేముందు ఆ ఉత్పత్తి గురించి వివరాలు తెలుసుకోరా ఆయన? అది సమాజంలో ఏఏ తరగతి జనులకోసమో, అది ఏపదార్ధాలతో తయరైనదో ఏవిధంగా ఎవరికీ హానికరంకాదో వంటి సంగతులు నిర్ధారించుకోకుండా ప్రచారం చేయటానికి ఆయన ఒప్పకున్నారనీ అమాయకులనీ మనం నమ్మాలా? ఆయనమీ ఇరవైల్లో పిల్లవాడు కాదే ఎనభైలలోని దీర్ఘప్రపంచానుభవం కల వృధ్ధుడే కాని. నాటకాలు వద్దనండి.


12 October 2021 10:32 AM

తేట తెలుగు - తేనె వంటి తెలుగు;తాడిగడప శ్యామల రావు

‌కి స్పందనగా.

మీరు సంస్కృత భాషా పరిచయం లేకుండానే ఏదేదో మాట్లాడుతున్నారు! ఇలా చర్చ వలన ప్రయోజనం లేదు. మీరు ఎవరైనా సంస్కృత భాషా పండితుల వద్దకు వెళ్ళి అడిగితే వివరిస్తారు. కాదూ, నాకంతా తెలుసును అంటే ఎవరూ ఏమీ చెప్పలేరు.


21 October 2020 5:14 PM

తేట తెలుగు - తేనె వంటి తెలుగు;తాడిగడప శ్యామల రావు

‌కి స్పందనగా.

కృత్రిమ బదులు కృతిమ పొసగదు. ముందటి వ్యాఖ్య లో టైపోకు క్షంతవ్యుణ్ణి.


21 October 2020 8:33 AM

తేట తెలుగు - తేనె వంటి తెలుగు;తాడిగడప శ్యామల రావు

‌కి స్పందనగా.

కృత్రిమ బదులు కృత్రిమ పొసగదండి. కృత అనేది పూర్తిగా వేరే పదం. దాన్ని తేవటం అస్సలు కుదరదు.


21 October 2020 8:31 AM