మురళి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
1. సవిత్ చంద్ర బెజవాడ కుర్రాడండి. సిద్ధార్థ కాలేజీలో చదివాడు. స్క్రిప్ట్ తయారు చేసుకుని ఎల్బీ ని కలిశాడు..రెస్టీజ్ హిస్టరీ.. (ఇతని ఇంటర్యూ వీడియోలు చాలానే వున్నాయి)
2. 'రౌడీ కవి' ఒక వ్యక్తి అని నాకు అనిపించలేదండీ.. విశ్వనాథ విమర్శకులందరినీ ఒక పాత్రగా చేసి (చాలా మందిని చూపించడం అనవసరం, ఖర్చు దండగ అని కావొచ్చు) పద్మనాభం పాత్రని సృష్టించారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే విశ్వనాథ మీద కాలు దువ్విన (దువ్వుతున్న) వారనేకులు కదా.
ఆ ఇల్లు తూగోజీలో ఉన్నదని, కష్టపడి ఇంటి వారిని ఒప్పించి షూటింగ్ జరిపామని చాలా రోజుల క్రితం ఎల్బీ ఒక ఇంటర్యూలో చెప్పగా విన్నట్టు గుర్తండి నాకు ('వ్యూస్' ఛానల్, వైజయంతి (ఉషశ్రీ గారమ్మాయి) తో మాటామంతి ప్రోగ్రాం అని జ్ఞాపకం)
విశ్వనాథని కలిసే అవకాశం రాలేదు కానీ, మాచవరం ఇంటిని చూసే అవకాశం దొరికిందండి నాకు.. వైజయంతి గారు విశ్వనాథ గారమ్మాయి కనకదుర్గ గారిని ఇంటర్యూ చేశారు, వ్యూస్ (యూట్యూబ్) ఛానల్ లోనే వుంది, బాగుంది, చూడండి..
'తెలుగు పదాలు ఇంగ్లీష్ లో రాసే రోజులు...' సినిమాటిక్ లిబర్టీయేమో అనిపించిందండి నాకు, ('నందమూరి తారక రామారావు' లాగా)..
ధన్యవాదాలండీ..
'విస్సన్న' చెప్పిందే వేదం అని జిలేబీ గారికి తెలియదని ఎలా అనుకుంటాం చెప్పండి?
వంశీ సినిమాల కన్నా ఎక్కువగా నాకు 'సీతారామయ్య గారి మనవరాలు' లో కీలక సన్నివేశాలు గుర్తొచ్చాయండి, చెట్టు గురించి చదవగానే.. బతికించే ప్రయత్నాలు చేస్తున్నారట..
నేను స్వయంగా చూసినవి: 1. మా ఊరి ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల (చుట్టుపక్కల ఊళ్లలో కూడా)ని బాగు చేశారు. కొత్త ఫర్నీచర్ వచ్చింది.. పిల్లలకి కొద్దో గొప్పో ఇంగ్లీష్ ముక్కలు వంటబట్టాయి. హై స్కూల్ పిల్లలు ట్యాబుల్లో పాఠాలు చదువుకుంటున్నారు (ప్రయివేటు స్కూల్ పిల్లల్లాగా). 2. గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ అందుబాటులో వుంటున్నారు.. (తప్పని సరి, నిర్బంధ హాజరు పథకం - బయో మెట్రిక్స్) నెలకోసారి పంచాయతీ ఆఫీసు దగ్గర మెడికల్ క్యాంపు జరుగుతోంది. కొత్తగా వస్తున్న మెడికల్ కాలేజీల వల్ల రాబోయే ఏళ్లలో డాక్టర్ల ఉత్పత్తి పెరుగుతుంది. వలసలు పోను, ఏటా కొందరైనా స్థానికంగా ఉంటారని ఆశించవచ్చు. మెడికల్ కాలేజీలు మూతపడకపోవచ్చు కానీ, స్కూళ్ళు ఎలా వుండబోతాయో అనే కుతూహలం ఉందండీ.. చూడాలి మరి.. ధన్యవాదాలు..
అభిమానాలు నటీనటుల వరకేనండీ.. వారి కుటుంబాల వరకూ విస్తరించలేదు..
మోడీకి మెజారిటీ రాకపోడానికి కారణం కోవిడ్ టీకా సర్టిఫికెట్ మీద ఆయన ఫోటో వేసుకోడమే అయి ఉంటుందని అనుకోవచ్చునంటారా అయితే? రెంటినీ వేర్వేరుగా చూడాలా? 'జైలుకి వెళ్లిన వారిని' అనే కండిషన్ తీసేయచ్చు.. బాబు గారు గతంలో ఎన్నడూ మఠ ప్రవేశం చేసిన వారు కారు కదా.. ధన్యవాదాలు..
జిలేబుల గ్రేపు వైనుని తక్కువ చేయడం కాదు కానండీ, బాబు గారు ఖజానా నింపిన దాఖలా ఎక్కడో కొంచం వివరిద్దురూ? ప్రతిసారీ లోటు బడ్జెటు ఇచ్చే కుర్చీ దిగారు కదా?? ధన్యవాదాలు..
ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే అనుకుంటున్నానండి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయాలి అనుకున్నారు తప్ప అవతల ఉన్నది ఎవరు అని చూడకుండా ఓటు వేసేశారనిపించింది.. కొందరు ఇప్పుడు ఈవీఎం టాంపరింగ్ అంటున్నారు కానీ, నేను అలా జరిగి ఉండక పోవచ్చుననే అనుకుంటున్నా.. ధన్యవాదాలు..