వెంకట రాజారావు . లక్కాకుల తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
రేగి రక్కసిపిండు రెక్కలు తెగగొట్టి
కుత్తుకల్ మెలిద్రిప్పి కోయు చుండ
కుడిచేత ఖడ్గంపు కొననుండి కారుచు
నెత్తుటి ధారలు నెగడు చుండ
డాచేత మూకుడు సాచి రౌద్రమ్ముగా
రుధిరమ్ము వట్టి తా గ్రోలుచుండ
ఆపలేక శివుం డడ్డదిడ్డము దూరి
కాళ్ళ క్రిందుగ పడి కనలు చుండ
దుర్నిరీక్ష్య , తేజోమూర్తి , దురితదూర ,
దుర్గయై ,కాళికయయి ప్రాదుర్భవించి
చెడును తెగగోసి బిడ్డల క్షేమ మరసి
మనల కాపాడు చున్న దీ మాతృ మూర్తి .
తడయక ' అమ్మ ' సరాసరి
చెడుపై 'దుర్గాభవాని' చేసిన యుధ్ధమ్ ,
కడుకొని కత్తికి , రక్కసి
యొడలులను బలిచ్చి , రక్తమోడ్చిన దినముల్ .
అంతేగాదయ నారద !
పంతుళ్ళకు బెత్తములకు బహుదూరమయా ,
జంతువు లేమయ పిల్లలు ?
చెంతకు బిలిపించి ప్రేమచే జదివింతున్ .
కత్తికి రెండు వైపులా పదును బెట్టేను సార్ ,
ఒకవైపు విద్వాన్ , పండిత శిక్షణ .....
మరోవైపు MA , Bed ....వగైరా .....
పనస తొనల పైన పట్టు తేనియ జల్లి
చెఱుకు రసము లోన చెలువు జల్లి
తియ్యమావి పైన తీపులు కలజల్లి
తిన్న విథము మీదు తీరు విహిత !
తమ రింఛోళులు దెలియక
చిమ చిమ లాడితిమిగాని , చెమ్మా చెక్కా
రమణీయ మహాంబుధిలో
దుమికి డుబుంగుమన దెచ్చితో ! పదము లహో !
తెలుగున మాష్టరు జదివితి ,
నొలయంగా సంస్కృతాంగ్ల మొప్పారె ధిషన్ ,
విలువ లెరిగి , యొజ్జదనపు
సుళువున , హెడ్మాష్టరునయి శోభలు గంటిన్ .
చిన్న పొరపాటు దొర్లడ మన్నగారు !
ఎన్న నది తప్పుగాదు , వియన్నదీ త
టాకమున , మరాళములలో , తదేక వీక్ష
ణమున , నెక్కడో , నొక ఈక కమిలి యుండ .
వాయసరాజ ని వ్రాసిరి
ధీయుత ! పావురపు రేడ ? తికమక యయ్యెన్
ఈ యర్థము కూడ గలద
వాయస మను పదము నకు , వివరణము కాస్తా 🙏
తెలియదు రింఛోళి యనగ
తెలిసినచో భాస్కరన్న ! తెలుపరె , కాస్తా ,
తెలుపరు తికమక బెట్టక ,
తెలిసిన ఆ సుబ్బరాయ ధీమతి , సరిగాన్ .
పద్మసంభవదేవి బాహుబంధమ్ముల
నలరు శ్రీకృష్ణుని చెలువు వొగిడి ,
సత్యా వసంతుని సరస సల్లాపాల
ప్రణయ గాధల చెలువార తనిసి ,
రాధికా రమణి చేరంగ రాసక్రీడ
సలిపిన మధుర ప్రసంగము విని ,
బృందావన విహార ప్రియసమాగమ
వినుత రస పిపాస విథము దెలిసి ,
విష్ణు సంకీర్తనా చార్య విమల మతులు ,
చేరి , వసుదేవ సుతుని , నోరార , పాడి ,
ఆడుదురు , అట్టి భక్తుల , అమల పాద
రజము దొరికిన చాలును , బ్రతుకు పండు .
చెప్పేది వినడు డాక్టరు ,
తప్పవు ఆ టెస్టులన్ని , తకధిమి తాం తోం ,
నొప్పేమొ తెల్దు , మందుల
కుప్పలు మనతో కొనిచ్చి , కుళ్ళబొడుచుటే .
బిళ్ళేస్కుంటే తగ్గే
వొళ్ళా యిది , వయసుడిగెను , వోపిక తగ్గెన్
వెళ్ళిన దవాఖానకు
కుళ్ళబొడుతు , రంతకంటె ఘోరము కలదే ?
కృష్ణ పరబ్రహ్మ కెరగి ప్రార్థింతు , గాని ,
కనికరించ డదేమిటో కరివరదుడు !
కానివాడిన ? ఇంతగా కఠిన వైఖ
రి గొన , ఔనులే , నేనేమి ప్రియ సఖుడన ?
ముదిమిన్ పలు రోగమ్ములు
చెద పురుగుల వోలె తనువు చేరి చరింపన్
అదె పెద్ద సమస్యగు , ఆ
పద కాయంగ పరమాత్మ పట్టుక పోడే !
అమ్మకు వందనాలు🙏 ముగురమ్మల మూలపుటమ్మ దుర్గకున్ ,
అమ్మకు వందనాలు🙏 ముగురమ్మల మూలపుటమ్మ బ్రాహ్మికిన్ ,
అమ్మకు వందనాలు 🙏ముగురమ్మల మూలపుటమ్మ
లక్ష్మికిన్ ,
అమ్మను గొల్చి అందరకు ఆశిశు లిచ్చు మహాత్మ ! మీకునున్ 🙏 .
నన్ను మరిచి పోయిరి గదే ! అన్నగారు !
మన్నన గలదు మరిమరి , నిన్న మొన్న
కాదుగద ! యేండ్ల తరబడి , కలిసి బ్లాగు
లోకమున తమతోటి పాల్కొంటి విబుధ !
భక్తి రసము మించి , పరవశత్వము లేదు
హరిని మించి , ఆసరా కలుగదు
పరబ్రహ్మ కలడన్న భద్రత కంటెను ,
లోకమందు కడు భరోస లేదు .
కృష్ణ పరమాత్మ , మూర్తిమత్ కీర్తి గాన
మొనరిచి , మహాత్ము లెందరో పుణ్యు లైరి ,
మనసు సుశ్లోకమై , స్వఛ్ఛతను గను , హరి
కొలువు దీరిన , డెందముల్ చెలువు మీరు .