శర్మ దంతుర్తి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఈమాట తెలుగు పత్రిక కదా కనీసం ఇక్కడైనా తెలుగులో చదువుకోవచ్చని ఇక్కడకి వస్తున్నాను. అయినా ఇంగ్లీషులో రాస్తున్నారు కొన్ని వ్యాఖ్యలన్నీ. కొంతమంది స్పానిష్ లోనూ అనుకుంటా. నాలాంటి తెలుగు మాత్రమే వచ్చిన – అనగా స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీషు రాని – వారికి ఏమీ అర్ధం కావడం లేదు ఏమి జరుగుతోందో. కాస్త తెలుగులో తర్జుమా చేయమని మనవి. ఈనాడు లో కూడా ‘వైరల్ అయింది’ ‘ట్రెండ్ అవుతోందీ’ అనే ఇంగ్లీషు రాస్తున్నారు. అదికూడా అర్ధం కాక అష్టకష్టాలు పడుతున్నాను. ఇలా అడుగుతున్నందుకు సంపాదకులు రచయిత/త్రులూ క్షమించాలి. ధన్యవాదాలు.
>> ముళ్ళపూడి వారిని మించాడు…(డా. ఘండికోట గారు)
మోహన్‌గారు రాసిన సమీక్ష సులభంగా, అర్ధమయ్యేలా చాలా బాగుంది కానీ ముళ్ళపూడి రాసిన సమీక్షలు, కధలు, కాకరకాయలు చదివిన ఎవరూ ఈ మాట అనలేరు. అమరావతి కధలకి ముళ్ళపూడి సమీక్ష రాసారు (ముందుమాట కూడా). అది మీరు చదవలేదు అనిపిస్తుంది మీరు ఇక్కడ రాసిన వ్యాఖ్య చూస్తే. ముఖ్యంగా మోహన్ గారంటే మీకు ఎంత అభిమానం ఉన్నా ఇక్కడ అసలు విషయం శ్యామ్‌గారి పుస్తకం. అది మీరు చదివారా? ఆ విషయం చెప్పి ఉంటే బాగుండేది. నేను మీ, మోహన్‌గారి, శ్యామ్‌గారి విద్వత్తుని వెక్కిరించడం లేదని గమనించగలరు. వ్యాఖ్యాత ఒక పుస్తకం గురించి ప్రస్తావిస్తే మీరు ఆ పుస్తకాన్ని వదిలేసి వ్యాఖ్యాత గురించి ప్రస్తావించారు. అదే నేను చెప్పదల్చుకున్నది.
* ఏ. తె. కలుషితము తిరుపతి లడ్డూ
కలుషితములు గోవులు, తిను దధిగ్రాసంబులున్
కలుషితము కలుపు నేయి
కలుషితములు ఏడుకొండలును మహి నీకలిలో
* ఏ. తె. మనయాత్రలు కలుషితములు
కలుషితమగు మనచేతలతో దేవుడి చేతులు
గట్టిగ కట్టిన విడిపించుకుని
వెంకన్న దైవమె జనుల గాపాడవలెన్
*ఏ. తె – “ఏమో తెలియదు” అనే వృత్తం. ఆయన అష్టకం కలుషితం చేసి దశకం చేసినందుకు శ్యామలరావుగారికి క్షమాపణలతో. 🙂