కొడవళ్ళ హనుమంతరావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఉన్నత స్థాయి తెలుగు సాహిత్యాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్న ఆశయంతో మొదలై పాతికేళ్ళు దాటినా, ఈమాట పత్రికలో ఇంతవరకు విరామ చిహ్నాల వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ప్రామాణికత లేకపోవడం ఒక లోపం. ఇప్పటికైనా ఈవ్యాసంలోని నియమాలను క్రోడీకరించి, మరికొన్ని కొత్త అంశాలను వాటికి జతచేసి, రచయితలని పాటించమని ఆదేశిస్తారని ఆశిస్తున్నాను.
న్యూయార్కర్ (The New Yorker) పత్రికలోని రచనల శైలిని ఆధారంగా చేసుకుని, వేమూరి గారి నియమాలకు కొన్ని మార్పులు, చేర్పులు ఇక్కడ సూచిస్తున్నాను:
“అలాగే, 1901 కీ, 1930 కీ మధ్య ఉన్న అడ్డుగీత (hyphen) …,” అన్నారు. కానీ ఆ తర్వాత వివరించినట్లుగా, (1901-1930) లో వాడాల్సింది పొట్టి గీత (en-dash), అడ్డుగీత (hyphen) కాదు.
సంభాషణకి సంబంధించిన కొటేషన్ ముగింపు గుర్తుకు ముందు సాధారణంగా ఒక విరామ చిహ్నం ఉండాలి (ఇక్కడ కామా): “నన్ను గురించి వినేందుకేముంది. మాది సామాన్య బ్రతుకు,” అంది నీరసంగా.
అలాగే కొటేషన్ ప్రారంభ గుర్తుకు ముందు కూడా విరామ చిహ్నం అవసరం: డాక్టరు చాలాసేపు ఆలోచించి, “మద్రాసులో మీకెవరన్నా ఉంటే చెప్పండి. మిమ్మల్ని అక్కడికి చేరుస్తాను,” అన్నది.
సంబోధనలలో ప్రతిసారీ ఆశ్చర్యార్థకం వాడాల్సిన అవసరం లేదు, కామా సరిపోతుంది: “రాధా, కాసిని మంచి నీళ్ళివ్వు.”
మనసులోని మాటలను వ్యక్తపరచడానికి కొటేషన్లు, చుక్కలు (ellipsis) వాడటం చదువరులకు అంత అనువుగా ఉండదు. న్యూయార్కర్ పత్రికలో కొటేషన్ గుర్తులు గానీ, ఏటవాలు అక్షరాలు (italics) గానీ లేకుండా, పాత్రల అంతర్గత ఆలోచనలను కథనంలోనే సహజంగా కలిసిపోయేటట్లు రాస్తారు. తెలుగులో కూడా మనం ఆ శైలినే అనుసరించవచ్చు.
వేమూరి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సందర్భంగా ఆశ్చర్యార్థక చిహ్నాల గురించిన ఒక హాస్య సంఘటనతో ముగిస్తాను.
రాసిన గ్రంథాన్ని చదివి, ఒక ఉత్తరం రాశాడు:
Dear Don:
Please quit using so many exclamation points! I can’t stand it!! I’m going out of my mind!!! (Don’t get alarmed, I’m only kidding!!!!)
Sincerely yours (!!!!!),
Robert W. Floyd
మరికొన్ని నెలలకి, Computer Science Department Chair గా Floyd నియమితుడైనప్పుడు, Knuth రాసిన ఉత్తరం:
Bob,
Congratulations to you and to the Dean for his fine decision. I hope you will accept, since I think you will be able to accomplish important things for our department. Please be our Chairman.
Sincerely,
Don.
P.S. If I were allowed to use exclamation points I would be more emphatic.
Knuth తన పుస్తక ప్రతులను తిరగేసి లెక్కించగా, సగటున ప్రతి పేజీకి రెండు ఆశ్చర్యార్థకాలు ఉన్నట్లు తేలింది. ఆయన ఆ తప్పును సరిదిద్దుకోవడమే కాకుండా, “” అనే కోర్సు ఇచ్చాడు.
కొడవళ్ళ హనుమంతరావు
“కృష్ణ వస్తువు” దుష్ట సమాసం అనడం నా పొరబాటు. వాస్తవానికి “నల్ల వస్తువు” దుష్ట సమాసం అవుతుందనుకుంటా. సరిచేసినందుకు థాంక్స్.
“నల్లని గొయ్యి” అని పరిచయం చేసినా, బహుశా తనకీ అది నచ్చక, నండూరి ఎక్కువ సార్లు “బ్లాక్ హోల్” అనే వాడాడు.
Black hole పేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది: 1967లో Princeton Universityకి చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, John Archibald Wheeler, ఒక ప్రసంగంలో, పదే పదే “gravitationally completely collapsed object” అనలేము, దానికి సరైన క్లుప్త పదం ఉంటే బాగుంటుంది అన్నాడు. అప్పుడు ప్రేక్షకులలో ఒకరు, “How about black hole?” అనడంతో వీలర్ దానిని వాడుకలోకి తెచ్చాడు. ఈ కథనం ఆయన స్వీయ చరిత్రలోనిదే [1].
అయితే, దీని లోగుట్టును పరిశోధించిన ఒకరు—అంతకు కొన్నేళ్ళు ముందరే Wheeler సహోద్యోగి Richard Dicke “బ్లాక్ హోల్” అనే పదాన్ని వాడాడని తేల్చారు. Dicke ఆ పేరు పెట్టడానికి అసలు కారణం:
కొడవళ్ళ హనుమంతరావు
[1] John Archibald Wheeler with Kenneth Ford. Geons, Black holes, and Quantum Foam: A Life in Physics. Norton. 2000.
దంతుర్తి గారికి కృతజ్ఞతలు.
తెలుగు అకడెమిక్ సైన్స్ పుస్తకాలు నాకు అందుబాటులో లేవు కనుక Black Body కి శాస్త్రీయ పారిభాషిక పదమేమిటో తెలియదు. “కృష్ణ వస్తువు” దుష్ట సమాసమని పద్మగారు తప్పుపడతారని భయం :-).
Black Body గురించి నండూరి రాశారేమో తెలియదు కాని Black Hole కి “విశ్వరూపం” లో వాడిన పదం “నల్లని గొయ్యి” (పేజీ 239). ఈమాట సైన్సు వ్యాసాలలో () వేమూరి వాడిన పదాలు: కర్రి బిలం (black hole), కృష్ణ పదార్థం (dark matter), కృష్ణ శక్తి (dark energy), కర్రి కాయ (black body).
కొడవళ్ళ హనుమంతరావు
మెచ్చుకొని ప్రోత్సహిస్తున్నందుకు శ్రీనివాస్, రమేష్, వేమూరి గార్లకి, జర్మన్ పేర్ల స్పెల్లింగ్ లను సరిదిద్దినందుకు పరుచూరి శ్రీనివాస్ గారికి, ఈ వ్యాస పరంపరని ప్రచురించడంలో నాకు తోడుగా శ్రమిస్తున్న సంపాదకురాలు ఇంద్రగంటి పద్మ గారికి కృతజ్ఞతలు.
ఎవరికైనా వివరించగలిగితేనే గాని మనకు అసలు విషయం అర్థమైనట్లు కాదనే నిజం, నాకీ వ్యాసం గురించి ఆలోచించినప్పుడు అనుభవంలోకొచ్చింది. దీని గురించి దాదాపు సంవత్సరం పైగా ఆందోళన పడ్డాను. ప్లాంక్ ప్రఖ్యాత ఫార్ములా తెలిసిందే అయినా, దానిని ఆయన ఎలా కనుక్కున్నాడన్న దానిపై నాకు సరైన అవగాహన లేదు. నా డిగ్రీ రోజుల్లో దీని గురించి చదివానో లేదో కూడా గుర్తు లేదు. ఇంత ముఖ్యమైన విషయం గురించి సైన్స్ లో డిగ్రీలు సంపాదించిన నాకే మిడిమిడి జ్ఞానం మించి లేనందుకు విచారించాను.
నేను Amherst లో చదువుతున్నప్పుడు 1985లో కొన్న Gamow పుస్తకం [1] ఇప్పటికీ భద్రంగా ఉంది. అయితే, చాలా పాపులర్ సైన్స్ పుస్తకాలలో ఉన్నట్లే, దాంట్లోనూ ప్లాంక్ ఎలా కనుక్కున్నాడో వివరాలు లేవు. దీని గురించి నాకన్నా పాతికేళ్ళు చిన్నవాడైన ఓ మరాఠీ స్నేహితుణ్ణి అడిగాను. ఆ డెరివేషన్ తనకూ తెలియదు గాని, Jayant Narlikar ఒక ఉపన్యాసంలో ప్లాంక్ దీనిని accidental గా కనుగొన్నట్లు చెప్పినట్లు గుర్తుందన్నాడు.
Abraham Pais పుస్తకం చదివితే గాని ఆవిష్కరణ వెనుక ఉన్న అసలైన చారిత్రక నేపథ్యం, నాటి ప్రయోగశాల పరిశోధకుల విశిష్టత, ప్లాంక్ “act of desperation” తెలియలేదు. ఆ చారిత్రక కథని ఎలాగైనా పాఠకులతో పంచుకోవాలనే ఆకాంక్షతో శ్రమపడ్డాను. ఫలించినందుకు సంతోషం. నా అజ్ఞానం కొంతయినా తొలగినందుకు తృప్తి.
కొడవళ్ళ హనుమంతరావు
[1] George Gamow. Thirty Years that Shook Physics: The Story of Quantum Theory. Dover Publications. 1966.