మాధవి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Headmasters తో సమావేశమై వారి వార్షిక ప్రణాళికలను పరిశీలిస్తున్నప్పుడు, “ఆ రోజు ప్రధానోపాధ్యాయులందరి ముఖాలూ వింతకాంతితో వెలిగి పోతుండటం గమనించాను” అన్నారు.
Really felt that excitement in the air while reading this, sir. It must have been an exciting and beautiful day !!
మీ కాన్షన్ష్ కీపర్ గా చెప్పిన భూషణం మాష్టారు వ్యవస్థలోని లోపాలను ఆయన ఆగ్రహంతో కాదు, పదునైన వ్యంగ్యంతో చెప్పడం, ఆ వ్యంగ్యం వెనుక ఉన్న అనుభవం, నిర్లిప్తత, బాధ చదివి బాధనిపించింది.
సత్యానందరావు గారు, వారి సతీమణి గారి అంకితభావం చదివాక వారిమీద ఎంతో గౌరవం కలిగింది. అరకొర వసతుల మధ్య కూడా ఒక పాఠశాలను తన బాధ్యతగా, తన కలగా చూసుకోవడం అంటే ఏమిటో వారి ద్వారా చూపించారు. Remarkable people!!
పాఠశాలలని తనిఖీ చేయడానికి కాదు, మన బంధువులను పలకరించడానికి వెళ్లినట్టు పాఠశాలలను సందర్శించాలని మీరు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పది!! అధికారంతో కాదు స్నేహపూర్వకంగా empathy తో ఆ పిల్లలతో ఆ ఉపాధ్యాయులతో మీరు పని చేసిన విధం ఒక పాఠం.
ఆ పాఠశాలలను ‘సంతోషచంద్రశాలలు’ గా మార్చడానికి మీరు చేసిన ప్రయత్నాలు చదువుతుంటే, మార్పు అనేది సౌకర్యాలు ఇవ్వడం వలననే కాదు, “ఆ అడవుల్లో ఆ గిరిజనుల ఒంటరితనాన్ని వాళ్ల నుంచి దూరం” చేసి, వారికి trust and encouragement ఇవ్వడం వలన కూడా వస్తుందని పదవతరగతి ఫలితాల ద్వారా చూపించారు. చాలా సంతోషం అనిపించింది.
Very valuable lessons, Sir. 🙏🏽
What an insightful review, Sir!
I haven’t read Homer’s Odyssey or watched this film yet, but after reading your earlier posts on the Odyssey and now these perspectives you’ve shared on Nolan’s version, I feel I have some meaningful background before experiencing the movie.
Looking forward to watching it with these reflections in mind. 😊
“…సవరలవిద్యావిధానాన్ని చూసి ఎంతో ఆవేదనకు లోనయ్యి గిడుగురామ్మూర్తిగారు మద్రాసు ప్రెసిడెన్సీకి ఒక వినతి సమర్పించారు. ఆ విజ్ఞాపన దాదాపుగా వంద ఏళ్ల తరువాత కూడా ఆ ప్రాంతాల పరిస్థితులకు నిలువుటద్దం పడుతున్నట్టుగా కనిపించడం నన్ను విచిలితుణ్ణి చేసింది.”
“కావడానికి అది విజ్ఞాపనే అయినప్పటికీ ఒక రకంగా అది అగ్రహపత్రం కూడా.
‘ఈ సవర బాలబాలికలకి ఆరునెలలపాటు ఆమూల్య కాలాన్ని వృథా చేసి ఎవరూ కొరగాని ఆరు ఒరియా అక్షరాలు నేర్పేకంటే ఆరు నీతికథలు చెప్పి ఉంటే వారికా విద్య ఎంతో ప్రయోజనదాయకంగానూ, అర్థవంతంగానూ ఉండి ఉండేది.’”
This is just too important sir.
ఇంతకంటే స్పష్టంగా, గట్టిగా ఎవరు చెప్పగలరు?
It is astonishing that we are still debating the same fundamental issues that Gidugu Ramamurthy garu pointed out, and that you encountered the same problems in your experience a hundred years later. ☹️
1988 పదవ తరగతి ఫలితాల విషయంలో మీరు చేసిన analysis, exemplary, sir. హిందీలో పిల్లలు fail అయ్యారంటే ఏ ఒక్కరినో తప్పు పట్టకుండా, వార్షిక పరీక్ష వరకు ఎందుకు గుర్తించలేకపోయాం? అని ప్రశ్నించడం, అక్కడి నుంచి నిరంతర సమగ్ర మూల్యాంకనం లేకపోవడం, పాఠశాల తనకై తానొక వార్షిక సంస్థాగత ప్రణాళికను రూపొందించుకోకపోవడం వంటి మూలకారణాలను గుర్తించి, దాని పరిష్కారాల దిశగా ముందుకు వెళ్లడం చాలా బాగుంది సర్.
Welfare programs అమలు జరుగుతున్నాయా లేదా అని చూడడమే కాదు, వారి పనులు వారే చక్కబెట్టుకునే సామర్థ్యాన్ని build చేయడమే సంక్షేమం అనీ, అందుకు ప్రధానమైన ఆధారం విద్య అనీ, అటువంటి విద్య మీద దృష్టి పెట్టకుండా నిజమైన సంక్షేమాన్ని ఎలా సాధించగలరన్న మీ మెలకువ ఏవో సిద్ధాంతాలు చదివి వచ్చిన insights కాదు.
Ground level లో ప్రజల మధ్య పనిచేస్తూ, ఆయా సమాజాలను, వారి సమస్యలనూ, విధానాలలోనూ, వ్యవస్థ లోనూ వున్న లోటుపాట్లనూ అర్థం చేసుకుంటే వచ్చిన ఈ మెలకువలు ఎంతో విలువైనవి, ప్రతి public servant కి పాఠాలివి !! 🙏🏽
“అనేక అక్షరపూర్వ సమాజాలు,… సాంఘిక జీవులుగా తీర్చిదిద్దడానికి అక్షరాలతో నిమిత్తం లేకుండానే అత్యుత్తమ జీవిత విధానాన్ని రూపొందించుకున్న ఉదాహరణలు…”
అన్న మాటలు, అలాగే మార్గరెట్ మీడ్ చెప్పిన విషయాలు చదువుతుంటే, మీరు గురూజీతో చేసిన సంభాషణలో వారు మన పూర్వీకులు గురించి చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి.
‘హోం లాంగ్వేజి’ నుంచి ‘స్కూల్ లాంగ్వేజి’కి transition ఎలా జరగవలసిన ప్రక్రియ కానీ, reality లో అది ఎలా జరుగుతోందో చదువుతుంటే చాలా బాధ కలుగుతుంది.
ఎవరికోసమైతే ఈ system ని ఏర్పాటు చేశారో, వారి పరిస్థితులను, వారి సంస్కృతిని, వారి భాషను అర్థం చేసుకోకుండా, universalization పేరుతో వారికి ఏ విధంగానూ ఉపయోగపడని uniformity ని రుద్దడం, పైగా ఉన్న వ్యవస్థ కూడా సక్రమంగా పని చేయకపోవడం నిజంగా చాలా బాధాకరం.
చివర్లో మీరు చెప్పిన ఈ మాటలు
“సనాతన వ్యవస్థ నుంచి ప్రతి సమాజమూ ఆధునిక వ్యవస్థకు పయనించవలసిందే. కాని ఆ పరివర్తన వీలయినంత మానవీయంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష.”
ఆ పరివర్తన వీలయినంత మానవీయంగా ఉండాలన్న aspect idealistic aspiration కాదు. This is the minimum requirement and expectation in the process of transitioning from home language to school language. And how painful it is that this basic requirement is missing!!
Sir, as a deep thinker, visionary, and someone who closely lived with the people and understood their needs, geography and way of life, we can clearly see the pain and frustration you felt at the failure of the system.
🙏🏽
ఎన్ని పాఠశాలలున్నా, ఎంత యంత్రాంగం ఉన్నా అవి ఎందుకు సక్రమంగా నడవవో మీ అనుభవం ద్వారా చాలా స్పష్టంగా చెప్పారు, సర్.
అలాగే, the biggest problem with centralized educational policy making ఏమిటో కూడా ఈ ఒక్క వాక్యంలో ఎంతో clear గా చెప్పేశారు.
“పాచిపెంట మండలంలోని మోదుగ పాఠశాల గురించి ఢిల్లీలోని విద్యావేత్తలు ఆలోచన చేసి ప్రణాళిక రూపొందిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో…”
మీరు నిన్నటి post లో చెప్పినట్లే, educational needs are highly contextual.
Every community has its own cultural, social, and geographical context. వాటిని అర్థం చేసుకోకుండా రూపొందించే policy, ఎంత మంచి ఉద్దేశంతో వచ్చినా, fail అవడంలో ఆశ్చర్యం లేదు.
“వ్యవస్థా వైఫల్యం, శిశు వైఫల్యం కాదు”
Apt title for this part, Sir.
🙏🏽
సర్,
ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడానికి అవసరమైన చదువు, training తో ఆగిపోకుండా, ప్రపంచ సాహిత్యాన్ని, అప్పటివరకు వెలువడిన ఆంత్రోపాలజీ పరిశోధనలను లోతుగా అధ్యయనం చేసి, ఆ resources లోని limitations నీ, మీ field level అనుభవాలనూ, వ్యవస్థలోని లోటుపాట్లను అర్థం చేసుకుని, వాటి ద్వారా మీరు పొందిన మెలకువలను ఇంత effective గా పంచుకున్న ఈ రచన ఎంతో అమూల్యమైనది.
“దళితుల విద్యాసందర్భానికీ, ఆదివాసుల విద్యాసందర్భానికీ వారి పేదరికంలో తప్ప మరెక్కడా పోలిక లేదు.”
మన విద్యా విధానానికీ, curriculum makers కీ పాలకులకీ ఇది ఒక గట్టి చెంపపెట్టు లాంటి statement.
Equal opportunity in education does not mean imposing same model on every cultural context without proper understanding of the needs of the diverse communities that make up our nation.
ప్రతి సమాజపు చారిత్రక, సాంస్కృతిక, జీవన వాస్తవాలను అర్థం చేసుకుని, వారి సహజ వికాసాన్ని పెంపొందించే విధంగా విద్యను నిర్మించాలన్నదే ఈ భాగం చెప్పిన అత్యంత విలువైన మెలకువ.
🙏🏽