శ్యామలీయం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
కాదులెండి.
నాలుక పైన వంక పెట్టి మనసునే అనటం.
దాపరికం ఏమీలేదు.
శయనసమయకీర్తన. అందునా అక్షరాక్షరగండంగా టైపుచేసే మొబైల్ కీబోర్డు సహాయంతో తంటాలు. టైపో లు అపుడప్పుడు నడిపోతున్నాయి. ఒకో సారి నిద్ర కళ్ళకు వాటిని పసికట్టటం కష్టం అవుతోంది.
ధన్యవాదాలు సీతారామ్.
ఈ శయనసమయకీర్తన నీకు నచ్చినందుకు చాలా సంతోషం.
చదివి సానుకూలంగా స్పందించి నందుకు మీకు నేనే అనేక ధన్యవాదాలు చెప్పుతున్నానండీ.

ఇతర రామకీర్తనలను కూడా పరిశీలించి మీ ఆమూల్యాభిప్రాయాలను చెప్ప ప్రార్ధన.
ఈటైపో పుణ్యమా అని మౌనపాఠకవరేణ్యులు ఒకముక్క అన్నారు. సంతోషమండీ.
వామపక్షం మరియు ప్రజాతంత్రం అనేవి కలిసి ఉండే భావజాలాలు కానేకావే! వామపక్ష ప్రజాతంత్ర ఏమిటి అసందర్బం. ఇది పచ్చిమోసకారీ మాటే. ఏకమ్యూనిష్టు ప్రభుత్వమైనా ఏదేశంలోనైనా ప్రజాస్వామ్యం పాటించిందా?
ఎంటర్‌టైన్మెంట్ ఒక్కటే పాయింట్. ఈమాట నిజమే. కాని దాని రూపస్వభావాలు కాలానుగుణంగా మారతాయి. నాటకాలు పోయి సినిమా. రేపు సినీమా పోయి మరొకటి రావచ్చును. సినిమాను చిరంజీవి అనుకోవటం పొరపాటు కావచ్చును. ఏఐ కారణంగా సినీమా కొద్దోగొప్పో మారవచ్చును. ఏఐ పోయి మరొకటి వస్తే అది సినీమాపై మరింత ప్రభావం చూపవచ్చును. సినీమాను జనం రిసీవ్ చేసుకొనే విధానం మారుతోంది కాబట్టి సినీమా టేకింగ్ కూడా కాలానుగుణంగా మారకతప్పదు.
ఇకపోతే ఎక్కువ పెట్టుబడి లేదా ఎక్కువ స్క్రీన్స్ మీద రిలీజ్ ఐనంత మాత్రాన పెద్దసినిమా కాలేదు. జనాదరణే కొలబద్ద. కలెక్షన్ డివైడెడ్ బై ఇన్వెష్ట్మెంట్ విలువే నిజమైన సక్సైస్ ఇండెక్స్.
ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మా అన్న పాట సీనియర్ నందమూరి తారకరామారావు హీరోగా వచ్చిన "జగదేకవీరుని కథ" సినిమా లోనిది. పింగళి నాగేంద్రరావు గారి పాటకు పెండ్యాల నాగేశ్వరరావు గారు బాణీ సమకూర్చగా సుశీల, లీల ఆలపించారు. ఈపాటలో నృత్యం చేస్తూ పాడిన నటీమణులు బి.సరోజాదేవి, జయంతి, బాల, ఎల్. విజయలక్మ్మి.
గమనిక: కొద్దిరోజుల తరువాత శ్యామలీయం బ్లాగు పూర్తిగా కనుమరుగు కావచ్చును. నా వెబ్ సైటును శోధినిలో జతపరుస్తానని హామీ యివ్వలేను. కాబట్టి ఆసక్తి కలవారు https://syamalarao.in/ అనే నా కొత్త సైట్ చిరునామాను నోట్ చేసుకోగలరు.
కీర్తన చిన్నదంటే చిన్నదే అనుకోవచ్చును పల్లవి + రెండు చరణాలు మాత్రమే నిడివి కాబట్టి. ఖండగతిలో నడుస్తుంది కాబట్టి సులువుగానే శ్రుతిసుభగంగా పాడుకోవచ్చును. మీరన్నట్లు పూజావసానసమయంలో గీతం శ్రావయామి అనవచ్చును దీనితో.

నేను ఈమధ్య చాలా నెలలపాటు తెలుగుబ్లాగులను వదలిపెట్టి నిజంగా చాలా చాలా హాయిగా ఉన్నాను. ఎక్కువమంది అడుగుతున్నారని నా బ్లాగును మళ్ళా పబ్లిక్ చేసి బ్లాగ్లోకం లోనికి వచ్చాను. అది చాలా పెద్దపొరపాటే అని గ్రహించాను. ఇక్కడ ఈ రాజారావు, జిలేబి అనే ఇద్దరు వ్యాఖ్యావీరులు నిత్యం అదేపనిగా నిరంతరాయంగా నామీద రాళ్ళువేస్తుంటే మిగిలిన అందరు తమతమ ఒళ్ళు కాపాడుకోవాలని దూరంగా కూర్చుని వినోదం చూస్తున్నారు మౌనంగా. ఆ
23 మార్చి, 2026 10:28 PM సమయంలో వ్యాఖ్య చేసిన అనామకు లెవరో తెలిసిపోతూనే ఉంది. అనవసరంగా బోలెడు వివరణ వ్రాసాను.
అర్ధమైన దండీ.
సర్వజ్ఞుల మని భావించుకొనే మీకు పొగడ్తలు తప్ప మరేమీ రుచించవని గ్రహించాను.
ఇక పొరపాటున కూడ తమరిని ఉద్దేశించి మాటలాడను. నిరుపయోగమైన పని చేయటం నాకూ అవసరం కాదు.
మీరూ మీ మిత్రులూ నిత్యం పరస్పరం కీర్తించుకుంటూ హాయిగా ఉండండి.
అదృష్టవంతులు మీరు. అభినందనలు. గురువుకు శిష్యులు బిడ్డలే. సందేహం లేదు. మీఆనందం అర్ధం చేసుకోగలం. పద్యాలు బాగున్నాయి.
మంచివ్యాసం. అభినందనలు.
కావ్యం అనేది విశ్వ(సమాజ)శ్రేయస్సును ఆశించేది కాబట్టి. కావ్యనాయకుల లక్షణాలవివరణ ద్వారా వ్యక్తికి ఉండవలసిన లేదా అలవరచుకోవలసిన సల్లక్షణలను ఇలా పెద్దలు సూచిస్తున్నారు. అలా భావిస్తే ఇది వ్యక్తిత్వవికాసం కోసం అందరూ గ్రహించదగిన పాఠం అన్నమాట. ముఖ్యంగా యువత తెలుసుకోవాలి పాతసాహిత్యంలోని మంచిపాఠాలను. ధన్యవాదాలు.