Kcube తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for Vasanthamegham;Kcube

గోండి భాషను గురించి దానిని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను వివరంగా తెలియచేసినందుకు అభినందనలు. అలాగే ఒడిస్సా ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలోని జాతాపు తెగ మాటాదే భాష కువ్వి, సవర తెగ భాష సవర కూడా అంతరించి పోతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఆ ప్రజలను అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు పేరుతో తెలుగు ఒరియా భాషలలో విద్యాభ్యాసం కల్పించడం ముఖ్యంగా వాళ్ళని వారి నివాస ప్రాంతాల నుండి జీవనోపాధి పేరుతో పల్లపు ప్రాంతాలకు వలస పోవడం వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వాళ్ళు పట్టణాలలో స్థిరపడి వాళ్ళ పిల్లలు ఇక్కడి బడులలో చదువుకోవడం మొత్తం మీద ఏదో ఒక రకమైన విస్తపన వలన వారి భాషా సంస్కృతి అంతరించి పోతున్నాయి. మ్యూజియంలకు వారి బొమ్మలు అర్ధ నగ్నంగా సంస్కృతి పేరుతో నాగరిక సమూహాలు ఫోటోలకు పరిమితమై అంతరించి పోతున్నాయి. మరికొన్నాళ్లకు కార్పొరేట్ వికృత అభివృద్ధి నమూనాలో ఆదివాసీ ప్రాంతాలు సమూహాలు అంతరించి పోతాయి. పల్లపు మేధావులు అధికారులు వాళ్ళని అలా వదిలేసి ఉద్యమాలకు బలిస్తారా అని చెప్పే మాటలకు మౌనమే సమాధానముగా ఆ సమూహాలు అంతరించి పోతున్న పాలస్టీనా గాజా సిరియా లాంటి దేశాలు కార్పొరేట్ అమెరికను టూరిస్టు ప్రాంతాలుగా మనుషులు లేని పచ్చదనం హరించిన ఎడారులుగా మారుతాయి..దీనికి ఉద్యమానిది బాధ్యతే కదా. ఇప్పుడు శ్రద్ధాంజలి ఘటించడమే.


16 August 2026 5:46 AM

Comments for కొలిమి;Kcube

జోహార్ కామ్రేడ్ ఉయకే ✊🏼


17 July 2026 12:28 AM