అనంతం కృష్ణ చైతన్య తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Forever mee abhimanini. Mee rachanalu chadivakane konchem intlo Aadavaallani ardham chesukovali ane thought start ayyindi. Thank you for writing and sharing your thoughts.
Welcome to Korean Baadhitula Sangham :) Maa Aavida ki kuda mee ammayilage Korean Fan. When life gives tangerines chuudamani okate gola. Oka 10 minutes kuda chudalekapoyanu.
Thoba thoba...... 😜 నేను మా ఆవిడ ఈ సినిమా 45 మినిట్స్ చూసి షాక్ అయ్యి షేక్ అయ్యి తర్వాత కట్టేసాము. దాని బదులు ఇద్దరు ఏదో కలిసి వంట చేసుకోవడం ఉత్తమం అనుకున్నాం. అబ్బే..... ఇయ్యన్నీ అయ్యే పనులు లా లేవే.... పైగా ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రెయిన్ అని సునీల్ వాయిస్ లో అనుకుని... Zomato పెట్టుకున్నాం అదీ తగలడి చచ్చింది. బేసిక్ గా ఆ రోజు మాకు అచ్చి రాలేదని ఇద్దరం ఒక నిట్టూర్పు విడిచుకున్నాం. ఏదైనా మీకు thoba thoba మేడం.😜😊 మంచి experience gurtu చేసినందుకు....😀😀😀
మీ అభిమానిని. మీలాగా మనసును తాకేలాగా వ్రాయాలి అని చాలా కోరిక. మీరు ఎప్పుడూ మమ్మల్ని పలకరించాలి. మీ రచనలలో ఇప్పుడు ఒక తెలియని వేదన ఒక తగిలిన గాయం ఒక చెదిరిన మనసు కనిపిస్తున్నాయి. ఒక 10 యేళ్ళు క్రితం ఒక పిల్ల తెమ్మెర, ఒక శీతాకాలపు వేడి, ఒక వర్షాకాలపు మట్టి వాసన, ఒక గోదవరి నది ప్రయాణం లాగా గుబాళించేవి. ఇప్పుడు ఒక అగాధమంత మౌనం, ఒక మంచు పర్వతం అంత నిస్సంగం, ఎదురుగా కనిపించేంత దూరం ఉన్నా అధిరోహించలేని కైలాస పర్వతం లాంటి భావం ఇప్పుడు మీ రచనలలో కనిపిస్తున్నాయి. ఇది కాలం తెచ్చిన మార్పో, అనుభవం తెచ్చిన నేర్పో తెలియదు. కాని ఎప్పుడూ మీ రచనలు మా మేధ కు క్రొత్త ఆలోచనలని ఇస్తున్నారు. మీకు ఎప్పుడూ మా కృతఙ్ఞతలు.
మన్నింపు లేని కాలం.
మనకు మనమే వేసుకున్న పాశం.
తరగని పశ్చాత్తాపం కరగని కన్నీటి కధలు.
కొన్ని వేల మరణాలు కొన్ని వందల జననాలు.
కరిగిపోయిన సమయం తిరిగిరాని బాల్యం.
స్ఫురింపనివ్వని అహం. కాలం లో కలిసిపోతున్న అందమైన పరిచయాలు.
ఒక్కసారి మీ కవిత చదవగానే నాకు ఇవే గుర్తువచ్చింది. చాలా బాగుంది మేడం.
మీ ప్రతి అక్షరం నా మేధస్సుకు పడునుపెడుతుంది. మీ ప్రతి భావం నా దృష్టిని విశదపరిస్తుంది. మీ ప్రతి టపా అమ్మ మాటలు లాగా గురువులాగ గురి కుదురుస్తుంది. మీ బ్లాగ్ చదివిన తర్వాతే నేను ఒక పుస్తక అభిరుచిని ఏర్పరుచుకున్నాను.
నిజం చెప్పాలంటే మీ బ్లాగ్ చదవడం అంటే ఒక చిన్ననాటి స్నేహితుడ్ని కలిసి ఆరోజులు గుర్తు చేసుకోవడం. విదేశాల నుండి వచ్చిన కొడుకు, అమ్మ ఒళ్ళో తల పెట్టుకోవడం వంటిది.
నేను మీ బ్లాగ్స్ చదువుతూ టైమ్ ట్రావల్ చేస్తున్నాను. నా 23వ ఏట ని మళ్ళీ మీ అక్షరాల్లో వెతుక్కుంటున్నాను. మీ వ్రాతలు నా వ్యక్తిత్వం, అలవాట్లు, సాహిత్యం పై గౌరవం అన్నిటి మీదా ప్రభావం చూపించాయి. నేను 2010 నుంచి మీ బ్లాగ్ ను ఫాలో అవుతున్నాను.
he he he.......... blog loni 3rd paragraph jalsa cinema lo pavan kalyan laga baga chepparu andi.....<br />i am big fan of u.......<br />super........ :)