అరుణ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
నాలుగున్నర దశాబ్దాలుగా సాహిత్యాన్ని(అనెక రూపాల్లో ) ప్రేమించిన మా వంటి పాఠకులకు, రెండు విషయాలు ఆశ్చర్యాన్ని, బాధను కలిగిస్తున్నాయి.
- పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన సాహిత్య ముఖపుస్తక సమూహాల్లో అనేకమంది రచయిత(త్రి) లు తాము రాసిందే కథ (?) , తాము రాసిందే నవల(??) అని చెప్పుకుంటూ పోస్ట్ చేయడం ఆ కథ/నవల/ధారావాహిక క్రింద “ఆహా ఓహో అంటూ సమూహ సభ్యులు పొగడ్తల వర్షం కురిపించడం జరుగుతోంది. ఈ కథ/నవల/ధారావాహిక అధమ స్థాయిలో ఉన్నది అని చెప్పబోయిన మా వంటి వారిని “అన్ని లైకులు/కామెంట్లు వస్తే మంచి కథే కదా {????} అని నిలదీయడం జరుగుతోంది!!!!
2. ఇక కథల/నవలల పోటీలు గమనిస్తే ఏ ఒక్కటి కూడా పారదర్శకంగా జరగడం లేదు . పేరొందిన రచయిత(త్రు)లకే బహుమతులు. వారే అన్నిట్లో విజేతలు. పోనీ ఆ విజేతల కథలు నిజంగా అంత బావున్నాయా అంటే ఉహూ !! అసలు వారే రాశారా అని అనుమానం కలిగేలా ఉంటున్నాయి
upcoming రచయిత(త్రు) లను ఎందుకు ప్రోత్సహించరు?
ఈ పోటీల నిర్వాహకులు ప్రసిద్ధ రచయితలకు మాత్రమే ఈ పోటీ అని నోటిఫికేషన్ లో ఒక వాక్యం రాస్తే సరిపోతుంది కదా
అన్నీ pre decided!!
ఈ పోటీల నోటిఫికేషన్ ఒక ఫార్సు అంతే..।
పేర్లు తెలియకుండా జడ్జీలకు పంపాము అనేది పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతోంది అని చెప్పినట్లే
నిజంగా ఒక transperancy ఉంటే ప్రతిసారీ ఒకే పేర్లు రావు అని తెలియనంత మూర్ఖులం అయితే మేము (రీడర్స్) కాదు.
ఎలాగూ ఇప్పుడు offline పత్రికలు లేవు, కనీసం ఆన్లైన్ పత్రికల్లో అయినా కొత్త కలాల పదును చూద్దాం అని ఎదురు చూసే మా వంటి సామాన్య పాఠకులకు నిరాశే మిగులుతోంది.
షరా: మీరు ఏమైనా కథలు రాశారా? పుస్తకాలు publish చేశారా? మా రచయితలను మా పోటీలను విమర్శించే హక్కు మీకెక్కడిది అని మమ్మల్ని ప్రశ్నిస్తే నా సమాధానం ఒక్కటే
“ఒక వ్యక్తి తాను తిన్న వంట రుచిగా ఉందా లేదా అని చెప్పడానికి ఆ వ్యక్తి చేయి తిరిగిన వంటవాడు కానక్కర్లేదు