ఆంధ్రదేశమందు జనించిన వీరుని చరిత్రను రసరమ్య భరితమైన పద్యకావ్యంగా మలచిన గురుదేవులకు అభినందన వందనములు 🙏🙏 ఆనాటి రాయలసీమ (రేనాటి) పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వర్ణించారు, బంధ, గర్భ పద్యాల విన్యాసాలు ఆ సైరా నరసింహ రెడ్డి కత్తి యుద్ధం చాలా చక్కగా ఉన్నాయండి, ఆనాటి స్త్రీల పూజలు, కుందూనది వర్ణన నేటి పరిస్థితుల్లో చెప్పాలంటే త్రీడీ లా ఉంది అండి, నేను గాంధీనగర్ లో ఉప్పు సత్యాగ్రహ చిహ్నం గా కట్టిన దండీ కుటీర్ కు వెళ్లి నప్పుడు ఆ రోజుల్లో నేను వారి మధ్యన ఉన్నట్లు అనుభూతి కలిగింది. మరలా ఈ పద్యాలు చదువుతూ ఉంటే ఆ అనుభవం కలిగింది అండి. దుర్మార్గులు ఆంగ్లేయుల అరచకాలను వర్ణించిన తీరు హృదయానికి హత్తుకునేలా ఉందండి. నవ కవులకు కావ్య రచన ఎలా చేయాలో తెలియ జేయు వైవిధ్యమైన వృత్తాలకు లెక్కలేదు. ఆధునిక సాహిత్య అభిమానుల కొరకు తమరు అందించిన ఈ కావ్యం కలకాలం నిలచి ఉంటుందనడం లో సందేహం లేదండి.
తమరికి ఆ నలువరాణి ఆయురారోగ్యాలు కలుగచేయాలని మరిన్ని కావ్యాలు వ్రాయాలని
కోరుకుంటున్నాను
శిష్య పరమాణువు
కందుల నాగేంద్ర వరప్రసాద్ 🙏🙏🙏 జై శ్రీరామ్
ఆంధ్రామృతం31 August 2026 11:42 AM