కె.కె. రామయ్య తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;కె.కె. రామయ్య

ఓ విస్తృత పరిధి విషయాలు కలిగిన దాన్ని “అది నీవు”గా తెలుగులోకి అనుసృజన చేసిన అవినేని భాస్కర్ గారికి… “అదు నీ” తమిళ మూలం రచయిత లోకేశ్ రఘురామన్ గారికి అభినందనలు, కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు.

మొదలు నుండి తుది వరకూ చదివి, గూగులమ్మ సాయంతో సమగ్ర అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించిన తదుపరి నా సంక్షిప్త తలపోతలు ఇలా:

యూదు, క్రిస్టియన్ మరియు ముస్లిం మూడు ప్రధాన ఏకధర్మ మతాలచే ఒక పవిత్ర నగరంగా గౌరవించబడిన, 5,000 సంవత్సరాల పురాతన నగరం జెరూసలేంకు ఉత్తరాన ఉన్న యూదా ఎడారిలోని సంచార జాతికి చెందిన ఒక ఆదివాసీ గొల్లతెగల ప్రజల మెడపై, చెవితమ్మెకు కింద నుంచి మొదలై మెడ, కుడి భుజమూ కలిసే చోటుదాకా సాగి ఉండే కెలాయిడ్ మచ్చల గురించి పరిశోధన కోసం తన మిత్రుడు జియాద్ మహమూద్ అబ్బాస్ పిలవగా న్యూఢిల్లీ నుండి పాలస్తీనా లోని జెరికోకు వెళ్లిన ఫ్రాంకో ఇగ్నేసీ… “తీవ్రమైన దెబ్బ, లేదా కత్తిగాటు అయితే, గాయం చుట్టూ ఈ రకమైన కణజాలం విస్తరించి కెలాయిడ్ మచ్చలు పుడతాయి. జన్యుపరంగా ఒకతరం నుండి మరో తరానికి కొనసాగుతాయి. ఈ మచ్చలకు కారణమైన జన్యువులు కొనసాగినప్పటికీ, అవి బయటపడటానికి ఏదైనా గాయం ఏర్పడాలి కదా? అవి సరిగ్గా మెడమీదే ఎలా వస్తాయి? అనే విషయ పరిశోధన కోసం జియాద్ న్యూఢిల్లీలో ఉంటున్న తన మిత్రుడు ఫ్రాంకోని పాలస్తీనాలోని జెరికోకు రమ్మని పిలుస్తాడు.

జెరూసలేమ్ నుండి, జెరికోకు భయానకమైన ఎడారి దారిలో ప్రయాణిస్తూ దొంగలముఠా, తోడేళ్ళు బారిన బడి… ఒక యూదు గురువు (సింబాలిక్ ఆఫ్ జీసస్ క్రీస్తు?) వల్ల రక్షించబడిన బాటసారి కధ… బైబిల్‌లో ప్రస్తావించబడిన “ఎ రోడ్ డౌన్ టు జెరికో”ను తలపోస్తాడు ఇగ్నేసీ. జోర్డాన్ నది ఉద్భవించిన హెర్మోన్ అనే మంచుపర్వత శిఖరాన యేసుక్రీస్తు తన మానవ శరీరాన్ని విడిచిపెట్టి, మంచులాంటి స్వచ్ఛమైన తెల్లని కాంతిని పొందే ఆ రూపాంతరం అనే మహత్తరమైన అద్భుతాన్ని చేశాడు. యేసు గలిలీ సమీపంలోని నజరేతులో పెరిగాడు. తన ముప్పయ్యవ యేట బాప్తీస్మము తీసుకున్నాడు. గుడ్డివాడికి చూపును ప్రసాదించే అద్భుతాన్ని చేశాడు.

క్రీస్తు పెరిగి పెద్దయి జీవించి మరణించిన నేల అది. క్రీస్తు మళ్ళీ ప్రాణం పోసుకుని లేచి వచ్చినప్పుడు, ఆదివాసీ గొల్ల తెగకు చెందిన ఒక వృద్ధ మహిళ, స్వర్గపు కాంతినిపొంది తిరిగివచ్చిన ఆతని చేతిలో ఒక గొర్రెపిల్లను, మెడపై ఈ మచ్చను చూసిందట. అటువంటి ఒక యేసు క్రీస్తుని వాళ్ళు తమ దేవుడుగా ప్రార్థించారు, స్వీకరించారు. వాళ్ళు యేసు క్రీస్తు తమ వంశంలోనే జన్మించాడు అని నమ్ముతారు.

కల్వరి కొండ గుట్టపైనున్న చిన్న గొయ్యి పక్కన రోమన్ సైనికులు యేసుక్రీస్తును (‘నజరేయుడైన యేసు. యూదుల రాజు’) తను మోసుకొచ్చిన శిలువమీదే వేస్తారు. అదివరకే అక్కడ ఇద్దరు దొంగలను శిలువ ఎక్కించి కుడి, ఎడమలుగా వాటిని పాతిపెట్టి ఉన్నారు. ఎడమ వైపు శిలువ ఎక్కించబడిన దొంగ పేరు గెస్టాస్. కుడివైపు శిలువ ఎక్కించబడిన మరొక దొంగ పేరు డిస్మాస్. క్రీస్తు జన్మించిన సంగతి తెలుసుకొని హేరోదు రాజు తన దేశంలోని రెండేళ్ళలోపున్న మగ శిశువులందరినీ తన ఖడ్గానికి బలిచ్చాడు! ప్రాణాలు తీయబడిన ఆ వేలాదిమంది పిల్లవాళ్ళలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్న ఏకైక పిల్లవాడు గెస్టాస్.

తోడేళ్ళ గుంపు బారి నుండి ఒక పిల్లలతల్లి తోడేలు కాపాడి తన రొమ్మిచ్చి పాలతో పొట్ట నింపి ఆరేళ్లు కాపాడబడిన గెస్టాస్, ఆ తరవాత ఒక మంత్రగాడు కి దొరికి జనావాసాలు లేని కఠోరమైన ఎడారిలో అతని వద్ద పెరుగుతాడు.
మంత్రగాడు చర్నాకోలతో కొట్టి, హింసించి గెస్టాస్నా చేత తోడేలులాగా అరిపించి ఎడారుల్లో వెళ్ళే బాటసారులను దారి మళ్ళించి ఒంటరులను చేసి వాళ్ళ దగ్గరున్న సొమ్మును దోచుకుంటూ ఉండేవాడు. మంత్రగాడు చనిపోయాక, గెస్టాస్ మృగలక్షణం, క్రూరత్వంతో యూదా ఎడారిలో వెళ్ళే బాటసారులపై దయాదాక్షిణ్యం లేకుండా దాడి చేసి దోచుకోవటం దినచర్యగా జీవించాడు.

ఒక రోమన్ సైనికుడు వీధిలో పైకి విసిరి, కత్తికి బలి చేయాలని ప్రయత్నించిగా ఏర్పడిన గాయపు మచ్చను (కుడివైపు మెడభాగంలో చెవితమ్మె క్రింద మొదలై భుజం వరకు విస్తరించి ఉన్న గాయపు మచ్చను) గెస్టాస్ యేసుకు చూపించి: “మానవరూపంలో భూలోకానికి దిగి వచ్చిన దేవుని కుమారులు… మిమ్మల్ని మీరు విముక్తులను చేసుకున్నా… ప్రపంచ రక్షణ, పాప పరిహారాలు, మోక్షం ఎలా సాధ్యం” అని క్రీస్తుని ప్రశ్నించిన గెస్టాస్‍కు… ఓపికగా అతని కథను విన్న యేసు బదులిస్తూ “నేనుగా గుర్తింపబడే నేను ఇకపై నేను కాను” అని పైకేసి చూపుతున్న ఆయన కుడిచేతి చూపుడు వేలు, అతని వైపుకు చూపించి గెస్టాస్‍కు స్వర్గలోక ప్రాప్తి కలిగిస్తాడు.

జియాద్ తనకు యీ కథ చెప్పడం పూర్తి చెయ్యంగానే ఫ్రాంకో ఇగ్నేసీ కళ్ళనుండి ధారాపాతంగా కన్నీళ్ళు కారతాయి.

ఆ ఆదివాసీ గొల్లవారిని ఇప్పుడే చూసితీరాలి అని సాయంత్రం ఎడారిలో ప్రయాణం చేసి వెళ్లిన వాళ్లు ఒక గొర్రెల మంద, ఇసుక తిన్నెమీద నిలబడి ఉన్న, మెడ మీద ఆ మచ్చ( కెలాయిడ్ ) ఉన్న గొర్రెల కాపరిని చూస్తారు. అతని ముందు పూడుకుపోతున్న ఇసుకలో మోకరిల్లి, ఛాతీపై రెండు చేతులు జోడించి ఫ్రాంకో ప్రార్థించాడు. ఆ గొర్రెలకాపరి ఏమీ తోచనివాడిలా చూస్తూ నిల్చుని ఉన్నాడు, వెనుక మరో ఇసుకతిన్నె కవతల అస్తమిస్తున్న సూర్యుడిని గమనిస్తున్నాడు.

తిరిగి వచ్చిన ఫ్రాంకో రోజంతా ఒంటరిగా, పిచ్చివాడిలాగా, ల్యాబ్‍లో గడిపాడు… జన్యు కాపీలను మళ్ళీ మళ్ళీ తిరగేస్తూ. ఆదివాసీ గొల్లతెగల ప్రజల మెడపై వంశపారంపర్యంగా వస్తున్న కెలాయిడ్ మచ్చలకి కారణం కనుక్కుంటాడు. ఆదివాసీ తెగల జన్యువులు కేవలం బాహ్యజన్యు పరివర్తనకు (ఎపిజెనిటికి మ్యూటేషన్) మాత్రమే గురవ్వలేదు; బాహ్యజన్యు సవరణకు (ఎపిజెనిటిక్ మాడిఫికేషన్) కూడా గురయ్యాయి అనే ఒక కొత్త విషయాన్ని ఫ్రాంకో కనుక్కుంటాడు. ఇటువంటి మార్పులు అంతర్గత కారణాల వల్ల; పర్సనల్ ట్రామా అనబడే బలమైన మానసిక వేదన; వల్ల సంభవిస్తాయి అని కనుగొంటాడు.

పాలస్తీనా లోని జెరికో నుండి తిరిగి వచ్చి, అర్ధరాత్రి దాటాక న్యూఢిల్లీలోని తన అపార్ట్‌మెంట్‌కు చేరుకున్న ఫ్రాంకో కి ఇంట్లో గోడకు వేలాడుతున్న జీసస్ మీద బయటి నుండి వచ్చి పడుతున్న సన్నటి కాంతిలో, పైకి చూపాల్సిన ఆయన కుడి చేతి చూపుడు వేలు తన వైపు చూపుతున్నట్లు అనిపించింది… “ అది నీవు “ అని ‘ you are my disciple ‘ అని చెపుతున్నట్లు అనిపించింది.

John 13:35 “A new command I give you: Love one another. As I have loved you, so you must love one another. By this everyone will know that you are my disciples, if you love one another.”

Matthew 6:15 “ ESV but if you do not forgive others their trespasses, neither will your Father forgive your trespasses. NIV But if you do not forgive others their sins, your Father will not forgive your sins. NASB But if you do not forgive other people, then your Father will not forgive your offenses.

Ephesians 4:32 in Other Translations
“ Be kind to one another, tenderhearted, forgiving one another, as God in Christ forgave you. 32 Instead, be kind to each other, tenderhearted, forgiving one another, just as God through Christ has forgiven you. “


28 November 2024 6:03 PM