చింతా రామ కృష్ణా రావు. తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
మీ అభిమానపూర్వక స్పందనకు ధన్యవాదాలు పార్వతీశం మహోదయా!
మీరు వ్రాసిన శివ శతకము మీ బ్లాగులో చదివాను. ధన్యున్ని.. మాకందరికి ఇలా చదివే భాగ్యం కల్పించినందుకు కృతజ్ఞున్ని.
మీ విధేయుడు
గరికపాటి పవన్ కుమార్. 23 జూన్ 2020
చాలా సంతోషమండి. మీ కలం మరిన్ని చక్కని ప్రబోధాత్మక గ్రంథాలను కూడా ర్ద్భవింపఁజేయాలని కోరుకొంటూ మీకు అభినందనలు తెలియఁజేస్తున్నాను. జైశ్రీరామ్. జై భారత్.
శ్రీ చతుర్వేదుల ప్రభాకరశాస్త్రిగారికి ధన్యవాదములు.
చతుర్వేదుల ప్రభాకర శాస్త్రి ఇలా వ్యాఖ్యానించారు.//.....మీ అద్భుత మైన"శ్రీ వసంత తిలక సూర్య శతకమును పూర్ణంగా పఠించి చాలా ఆనం దించాను.మీకు అభినందన పూర్వక అభివందనాలు.
ఆద్యంత మీ శతకమాత్మకు నింపు గూర్చున్
వేద్యమ్ము భావమయ వీచుల నోలలాడన్
హృద్యమ్ముగా భువి సుహృత్తమ తోషమిచ్చున్
సేద్యమ్ము జేసె కవి చిత్తము పల్లవింపన్!
సీ.చిన్మయ తేజుడౌ శ్రీరవి ప్రార్ధించి
చిత్ప్రభ నెదల రచింపగోరె
జీవులందరిలోన జీవాత్మగా వెల్గు
సూర్యనారాయణు స్తుతి యొనర్చె
ప్రాగ్దిశ కనిపించు భవ్యతేజుండైన
యాదిత్యుడే బ్రహ్మమనుచు చెప్పె
సప్తాశ్వములన సప్తవర్ణములవి
తెలుపులో చేరుట తెలియజేసె
శ్రీ భారతాంబను శ్రీగణేశుని మాత
యనుచును భవ్య భావనము జేసె
దీనుల పేదల దివ్యాంగులను కృప
కనుమటంచును దినకరుని వేడె
తే!! మహిత సామాజిక స్పృహ విహితమైన
ప్రకృతి రక్షణమును దేశభక్తి వంటి
గొప్ప విలువల శతకాన కూర్చి నట్టి
రామకృష్ణ కవికి జేతు ప్రేమ నతులు!
నమస్సులతో,
చతుర్వేదుల ప్రభాకర శాస్త్రి
ఫణి ప్రసన్న కుమార్ గారూ! కవిజనాశ్రయములో ప్రయోగాప్రయోగ వర్ణాలను నిర్దేశించి చూపుతూ శ్రీకారం ప్రారంభంలో ఉంటే దోషాలు పరిహరింపబడతాయన్నాడు. కాన పెద్దల ప్రయోగాలతో నిమిత్తం లేకుండా శాస్త్రాన్ని అనుసరించితే మనకు అనర్థముండదనే నమ్మకంతో అనుసరించడం మనకు శ్రేయస్కరం అని నా విశ్వాసం.
బ్రహ్మశ్రీ చక్రాల లక్ష్మీకాంత రాజారావు మహోదయులు ఇలా వ్యాఖ్యానించారు.
కం. ఆనందించితి తావక
ధీనైజమ్మరసి వినయదీవ్యచ్ఛ్రీభా
వానుగుణాంచత్స్వీకా
రానుక్రమణికనరసి సదాత్మన్ సుకవీ!
చక్రాల.23 - 12 - 2924.
బ్రహ్మశ్రీ డా. దూళిపాళ మహాదేవమణి మహోదయులు ఇలా వ్యాఖ్యానించారు.
కం. చక్రాలవారి పద్యపు
చక్రాల వినిర్మితంబు శకటంబకటా
శ్క్రునికైనను దక్కునె
సక్రమ! చింతాబ్ధి సూర్య! సంతృప్తినిడెన్.