డా.ఆచార్య ఫణీంద్ర తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:f4584a00-f239-4330-b2f5-f3a119e9e0bc
ఇది నా "ఉషోదయ యుగం" గ్రంథం పి.డి.ఎఫ్.
Yes, with mention of my name as author of the poem, you can include in your book.
రాజారావు గారు .. నా పద్యం కన్న మీ పద్యం బాగుంది. మీకు నా అభినందన పూర్వక ధన్యవాదాలు!
జై గొట్టిముక్కల గారు!
నేను ఏ ఒక్కరి కృషిని గూర్చో చెప్పలేదు. "సమష్టిగా అందరూ కలసి, దశాబ్దాలుగా కొనసాగుతున్న అధర్మాన్ని ఎదిరించి ధర్మస్థాపనకై పోరాడి సాధించుకొన్న తెలంగాణ గురించి నాడే ఉద్యమకారులు చెప్పినవన్నీ వాస్తవాలే అని నేడు అందరూ (ముఖ్యంగా నాడు విభజనను వ్యతిరేకించిన వారు కూడా) గుర్తిస్తున్నారు" - అని చెప్పడమే నా ఉద్దేశ్యం.
ఆ స్వప్నం తప్పకుండా సాకారం అవుతుంది "జై గొట్టిముక్కల" గారు. ఈ రోజే హరీశ్ రావు గారు 11 ప్రాజెక్టుల నిర్మాణం కోసం 6700 కోట్ల రూపాయల కేంద్ర నిధులను సాధించుకొని వచ్చారు.
మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు!
నిర్మలమైన స్నేహ పరిమళాన్ని వెదజల్లి హృదయాన్ని ద్రవింపజేసారు. అభినందనలు!
ధన్యవాదాలు రాజారావు గారు!
నా పద్యం కన్న మీ పద్యమే బాగుంది. అభినందనలు!
పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్టునిస్టు; చి
త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
డరయ - తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!
సాధారణ పౌరుడు -
ఆ లూటీ చేసిన వాడు నిజాం కాదు. మిమ్మల్ని అందరినీ మద్రాసు రాష్ట్రంలో పెట్టి బానిసలుగా పాలించిన బ్రిటిష్ వాడు. మీ సంపదలను దోచుకొని లండన్ కు తరలించుకొని వెళ్ళాడు. అందుకని ఇప్పుడు మీరు బ్రిటిష్ వాళ్ళతో... "లండన్ మాది" అని పోట్లాడితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో- తీరస్థాంధ్రులైనా, రాయలసీమ వాళ్ళయినా "హైదరాబాదు మాది" అంటే అంతే హాస్యాస్పదంగా ఉంది. ఈ విషయం సీమాంధ్రులకు తప్ప ప్రపంచంలో అందరికీ అర్థమై నవ్వుకొంటున్నారు.
అయినా అంతో ఇంతో హైదరాబాదుపై మాకు హక్కుంది అని తీరస్థాంధ్రులు అంటే ఆ విషయం కూర్చొని చర్చించవచ్చు. కాని రాయలసీమ ప్రతినిధిగా శైలజానాథ్ కి అసలు హక్కే లేదు. ఎందుకంటే రాయలసీమ 1799 వరకు టిప్పు సుల్తాన్ పాలనలో మైసూర్ రాజ్యంలో ఉంది. టిప్పు సుల్తాన్ ను జయించడంలో బ్రిటిష్ వారికి సహాయపడ్డందుకు వాళ్ళు నిజాంకు రాయలసీమను నజరానాగా 1799లో ఇచ్చారు. మళ్ళీ సైనిక ఒప్పందం మేరకు 1801లో రాయలసీమను వెనుకకు తీసుకొన్నారు. ఆ రకంగా హైదరాబాదుతో రాయలసీమకు ఉన్న అనుబంధం మొత్తం చరిత్రలో రెండేళ్ళు మాత్రమే
This comment has been removed by the author.
పీతాంబర్ గారు!
అతి మధురంగా ఉన్నాయి మీ పద్యాలు.
అభినందనలు!
హైకూలు బాగున్నాయి.
కాని, శర్మ గారు! పండితులు - మీరు "నెప్పులు" అని వ్రాస్తే ఎలాగండి? "నొప్పులు" అని వ్రాయాలి గాని!
సుబ్రహ్మణ్య శర్మ గారు!
మీకు అనేక ధన్యవాదాలు!