తమ్మినేని యదుకుల భూషణ్ . తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;తమ్మినేని యదుకుల భూషణ్ .

వేలూరి గారిని ” అమెరికాలో అర శతాబ్దం ” పేరిట తమ అనుభవాలు -జ్ఞాపకాలు గ్రంధస్తం చేయమని కోరాను . ఈ ఇంటర్వ్యూ చదివాక ఆయన తప్పక ఈ పని చేయగలరని అనిపించింది. అభిరుచి ఉన్నవారు ఆత్మ చరిత్రలు రాసుకోవడం వల్ల ఎన్నో లాభాలు . సంజీవదేవ్ గారి ‘తెగినజ్ఞాపకాలు ‘ చదవక పోతే ఆయన గురించి నాకు తెలిసేదే కాదు. (ఆయన ఆత్మచరిత్ర ద్వారా కలిగిన పరిచయం నాకు ఎంత గానో లాభించింది. తత్వశాస్త్రాలు , అలంకార శాస్త్రాలు , రస శాస్త్రము, మనస్తత్వ శాస్త్రాలు , చిత్రకళా చరిత్ర — ఇలా అనేకము చిన్న వయసులో అధ్యయనం చేయడానికి అవకాశం కలిగింది.). తెలుగు వారికి హైకూలు పరిచయం చేసింది ఆయనే . టర్నర్ రంగుల ప్రపంచం గురించి , Constable చిత్రకళ Turner కన్నా ఏ రకంగా భిన్నం? – ఇవన్నీ ఆయన ద్వారా తెలిసి వచ్చిన విషయాలే. ఒక చిత్రకారుని గురించి లోతులకు పోకుండా తెలుసుకోవడం వేరు – చిత్రకారుని ఆత్మను పట్టుకొని చిత్ర శైలీ పరిణామాన్ని గుర్తెరిగి ఆనందించడం వేరు. ఇవన్నీ , ఎంతో క్రమశిక్షణతో , దక్షతతో చేయవలసిన పనులు .

ఇక తెలుగులో కవిత్వం , అనువాదం – ఈ విషయాలకొస్తే – మనవారిలో పీఠాధిపతులు , వారికి అడుగులకు మడుగులొత్తి పాదసేవలో తరించే భక్త బృందాలు అధికం . కార్యరంగం విజయవాడైనా , విస్కాన్సిన్ ఐనా దృశ్యం మారదు. స్నేహాలు వేరు , విమర్శలు వేరు అన్న స్పృహే లేదు. కవిత్వం, అనువాదాలు , వాటిపై వచ్చే విమర్శను సీరియస్ గా పట్టించుకోవాలి అన్న వివేకం మన వారికి లేదు . మనకు కావలసింది భజన బృందాలు .

కొడవళ్ళ గారు ప్రస్తావించినట్టు ఇంటర్ వ్యూ లో అక్కడక్కడా స్పష్టత లేదు . పాద పీఠికలు ఇవ్వాలి – text without context leads to utter confusion -సందర్భ శుద్ధి లేని వచనం , గందరగోళానికి దారి తీస్తుంది .
నా వంతుగా “నేటి కాలపు కవిత్వం – తీరుతెన్నులు” పుస్తకానికి లింకు ఇస్తున్నాను .

కొడవళ్ళ గారు ప్రస్తావించిన వ్యాసం , దానికి తోడుగా మరొక వ్యాసం :
Hibiscus on the lake ( పుట 108)
అనువాదంలో ‘పద్య సమాధి’ ( పుట 111)

అలాగే , తెలుగు విమర్శలో మైలు రాయి అనదగ్గ అక్కిరాజు ఉమాకాన్తం గారి పుస్తకానికి లింకు ఇక్కడ :
“https://archive.org/details/in.ernet.dli.2015.333044”


07 April 2025 6:38 AM