తరంగిణి-కదంబం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
మహాకవి ఆరుద్ర శతజయంతి సంవత్సరం (1925-2025) సందర్భంగా మేము 'తెలుగురథం' సాహిత్య,సాంస్కృతిక సంస్థ (రి.825/2008) ద్వారా, అంతర్జాల సభలు నిర్వహిస్తున్నాము. మొన్న 31/8/2024 న ప్రారంభ సభ చేసి, చిరు పరిచయం, కొన్ని ఆరుద్ర విరచిత చిత్రగీతాలు పాడించడం జరిగినది. ఈ మహానుభావులు, బహుముఖ ప్రతిభాశీలి - ఆరుద్ర - భాగవతుల సదాశివ శంకర శాస్త్రి గారి శతజయంతి సారస్వత సమాలోచన సభలు (అంతర్జాల మాధ్యమంలో మాత్రమే) నిర్వహించాలని, వీలైతే, వారం వారం, ఒక ఆలోచనతో ప్రారంభయం చేశాం. సాహిత్యరంగంలో ఏ స్థాయిలో ఉన్నాసరే, మా సభల్లో పాల్గొని ప్రసంగం చేసేవారు, స్వచ్ఛంద/స్వతంత్రత/నిరపేక్ష భావాలున్నవారు మమ్మల్ని వెంటనే (Whatsup Message pl) సంప్రదించగలరు. నమస్సులతో/ఆరుద్ర గారి శతజయంతి సందర్భ అభినందనలతో, నమస్సులతో - మీ తెలుగు సారస్వతాభిమాని. కొంపెల్ల శర్మ. అధ్యక్షులు. తెలుగురథం. (+919701731333)