తాడిగడప శ్యామలరావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
> జాతీయ కవి సార్వభౌమ, మా కొద్దీ తెల్ల దొరతనం గేయ కవి. శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారి…..
దురదృష్టవశాత్తూ ఆయన తెలుగువాడైపోయాడు. అయన జాతీయ కవి సార్వభౌమ, మా కొద్దీ తెల్ల దొరతనం గేయ కవి అని మనం చెప్పుకుంటున్నా ఆ జాతీయకవి గురించి భరతజాతిలో తెలుగువాళ్ళలో (అతికొద్దిమందిని) మినహాయించితే జాతీయస్థాయిలో ఎవ్వరికీ తెలియదు కదా!
ఈ తెలుగువాళ్ళు ఎంత బడుధ్ధాయిలూ అంటే చెదురుమదురుగా కొద్దిమంది (పెద్దలు) తప్ప నేటి తెలుగువాళ్ళెవరికీ ఈయన గురించి తెలియనే తెలియదు! ముందుముందు తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే తెలుగుపిల్లలు తెలుగులో మాట్లాడటం మానేసి చాలా కాలమే ఐనది. ఈతరాల్లో పిల్లలకి ఇంగ్లీషు ముఖ్యం అని ప్రభుత్వాలే తెలుగు నేర్పటమూ లేదు, తెలుగువాళ్ళ గురించి చెప్పటమూ లేదు పాఠాల్లో. పాఠాల్లో ఎంతసేపూ జాతీయత వెల్లివిరిసేలా ఉత్తరాహుల గురించి మాత్రమే ఉంటుంది.
Like
In reply to .
అవకాశం రానంతవరకూ అందరూ మంచివాళ్ళలాగే కనిపిస్తారన్న నానుడి ఉన్నమాట నిజమే. ఒక వ్యక్తి చెడ్డవాడిగా తేలాలి అంటే, మొదట అతనికి ఇతరులకు చెడు చేసేందుకు అవకాశం రావాలి, రెండవది ఆవిధంగా మీదకు వస్తున్న చెడును ఆవలి వారు గుర్తించ గలగాలి. అవకాశం కోసం ఎదురుచూస్తున్న వాడి సంగతి ఇతరులకు తెలిసే అవకాశం తక్కువగానే ఉంటుంది. కాబట్టి చెడుని చెడ్డవాడు క్రియారూపంలోనికి తెచ్చేందుకు యత్నించి దొరికిపోయే వరకు సమాజందృష్టిలో మంచివాడే కద. సమర్ధుడైన చెడ్డవాడు దొరికిపోకుండా చెడుచేస్తూ మంచివాడిగానే చెలామణీ అవుతూ ఉంటాడు. అందుకే దొరికేతేనే దొంగ అన్న నానుడీ వచ్చింది. మంచివాడు మంచివాడిలాగా ఉండటానికి ఇబ్బంది పడడు. కాని చెడ్డవాడు మంచివాడిలా నటించటానికి నానాతంటాలూ పడుతూ ఉండాలి. మంచివారిలో సహజంగా ఉండే బలహీనత చుట్టూ ఉన్నవాళ్ళంతా మంచివాళ్ళే అనుకోవటం – తద్వారా చెడ్దవాళ్ళకి ద్వారాలు తెరవటం. చెడ్డవాడి బలం చుట్టూ ఉన్నవాళ్ళల్లో ఎందరో చెడ్డవాళ్ళు ఉన్నారని నమ్మటం – తద్వారా దొరక్కుండా జాగ్రత వహించటం. ఈ జాగ్రత కారణంగా చెడ్డవాళ్ళు దొరక్కుండా ఎక్కువకాలం నెట్టుకొని రాగలుగుతారు. కాని నటన ఎన్నడూ సహజం కాదు కాబట్టి జాగ్రతగా గమనించగలిగితే చెడ్డవాళ్ళు తప్పక తమ నటనలో దొరికితీరుతారు. కేవలం మేథావులు మాత్రం చెడ్డవాళ్ళ నటనలో చిన్నచిన్న తప్పులనూ గమనించటం ద్వారా వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవటమూ వాళ్ళని పట్టుకోవటమే చేయగలరు. అందుకే సరైన అవకాశమూ, సరైన సమయ సందర్భాలూ కుదిరితే కాని చెడ్డవాడు చెడు అమలు చేయక, చేయలేక మంచి నటిస్తూ నెట్టుకొస్తూనే ఉంటాడు.
Like
In reply to .
మంచి ప్రశ్నవేసారు. స్వభావమే కారణం అని నా ఉద్దేశం. మంచివాళ్ళవటానికీ తదన్యంగా ఉండటానికీ కూడా. శ్రీమద్రామాయణంలో,కైకకు చెడ్డమాటలు నూరిపోసి, రాముడి పట్టాభిషేకాన్ని అడ్డుకుంటుంది మంధర. అక్కడ ఆల్మీకి మహర్షికి ఇటువంటి ప్రశ్నయే వచ్చింది. ఎందుకని రాముడి పట్టాభిషేకాన్ని మంధర అడ్డుకోవాలని చూచిందీ? పాఠకులకు ఏమని వివరించాలీ కారణం అని. అయన క్లుప్తంగా ఇలా అన్నారు “మంధరా పాపదర్శినీ” అని. ఆమె బుధ్ధి పాపాన్నే చూస్తుంది అఒని. కాబట్టి ఆమె పాపకార్యాలే చేస్తుంది అని మనకు అర్ధం అవుతున్నది కదా. ఎందుకని మంధర పాపదర్శిని అని అడగలేము. అడిగితే జవాబు ఏమిటీ? అమె స్వభావం అది అని చెప్పాలంతే. ఎందుకంటే స్వభావో దురతిక్రమణీయః అని మనకు తెలుసు. పుట్టుకతో వచ్చిన స్వభావం మారదు. మానవులు అభ్యాసం చేసి సంస్కారాన్ని అలవరచుకొని మార్చుకోవాలి దాన్ని – కొన్ని జన్మలు పట్టవచ్చును. మంచి వాళ్ళైనా చెడ్దవాళ్ళైనా సరే వారి స్వభావం కారణంగానే మంచి చెడు ప్రవర్తనలు చూపుతారు. చిన్నతనంలో చెడు ప్రవర్తన ఎలా చూపుతారూ అంటే మనవాళ్ళు పూర్వజన్మ సంస్కారం అంటారు. రెండుమూడేళ్ళకే సంగీతప్రతిభ చూపి రాగాలనే గుర్తుపట్టే పిల్లలుంటారు. అన్నప్రాశన నాడే ఏదో ఆంటీ ఉంగరం కొట్టేసే పిల్లలూ ఉంటారు. అదంతే నన్నమాట. దుర్యోధనుడు కృష్ణూదితో అన్నాడట. జానాని ధర్మం న చ మే ప్ర్రవృత్తి, జానామ్యధర్మం న చ మే నివృత్తి అని. ఒకరికి తెలియటంతో సరిపోదండి. స్వభావం వారిని సరిగా ప్రవర్తించనీయాలి కదా. అందుచేత స్వభావం కారణంగ కొందరు లోకంలో మంచివారుగా ఉంటున్నారు. స్వభవం కారణంగా కొందరు లోకంలో చెడ్డవారుగా ఉంటున్నారు. అందరూ ఉత్తమసంస్కారం దిశగానే ప్రయాణం చేస్తున్నారు. కాని అందరూ వివిధదశల్లో ఉండటం చేత మంచివారూ చెడ్డవారూ ఎప్పుడూ లోకంలో ఉంటున్నారు.
Liked by