తుమ్మూరి రాంమోహన్ రావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;తుమ్మూరి రాంమోహన్ రావు

కవితాన్యాయపతి శ్రీనివాస్ గారి సమీక్ష చదువుతుంటే పెద్దన గారి పద్యపాదం జ్ఞప్తికి వచ్చింది ‘ ఒప్పుతప్పరయురసజ్ఞులూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్ దొరకిన గాని’ అలాగే మరో వాక్యం విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్ ‘ కూడా. ప్రతి మనిొషికి బాల్యం ఊహాలోకానికి తెరచిన తలుపు. ఏ ముద్రలు లేని పసి మనసుల మీద తాను చూచే ప్రతి కొత్త దృశ్యము ముద్రలుగా నిలుస్తుంది. పెరిగి పెద్దయిన తరువాత నాటి స్మృతుల తలపోత మధురాతి మధురం . కవులు కాని వారికి అవి జ్ఞాపికలుగా ఉంటే కవులు వాటిని పదచిత్రాలుగా ,దృశ్య చిత్రాలుగా పదిల పరచి వాటిని పది మందికి పంచి వారి స్మృతులను తట్టిలేపుతారు. అలాంటి ఒక రసహృదయ సారస్వత విశారదుని కలం నుండి వెలువడిన జ్యోతిర్మయి రోదసిలో మీరు విహరించి మీ అనుభవాన్ని పంచడం ఎందరినో ఆ రోదసిలోకి వెళ్లాలనే కోరిక కలిగించడంలో కృతకృత్యమైంది. వీరభద్రుడు గారికీ , మీకూ ప్రచురించిన ఈమాట వారికి అభినందనలు.


02 June 2026 2:20 PM