భానోదయం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
తెరమీద హీరోయిజం చూపించేవారినే యువత ఫాలో అవుతారు. పుష్ప పాత్రను ఎందరో చిన్నారులు,యువత తమకు తాము పుష్పాల ఊహించుకుని రీల్స్ చేస్తున్నారు. ఈ పాత్ర సమాజంలో ఒక బలమైన ముద్ర వేసింది. కారణం మంచి కంటే చెడుకే ప్రాధాన్యత ఇస్తారు జనాలు.. మంచి సినిమా పాత్రలు అంతగా జనాలను ఆకర్షించవు. పైగా ఇలాంటి సినిమాలకు జాతీయ అవార్డు ఇచ్చారు. దీన్ని ఎలా అర్థం చెసుకుంటారంటే స్మగ్లింగ్ అనేది తప్పు కాదు అనుకుంటారు..
కేవలం అరెస్టు చేసి 4గంటలు జైలులో ఉంటేనే చాలామందికి భావోద్వేగాలు పొంగిపోతున్నాయి. ఓ మహిళ చనిపోతే కనీసం సానుభూతి లేదు వీళ్ళకి. సామాన్యుల ప్రాణాలకు విలువ లేదు ..
అసలు ఏముంది సెలబ్రీటీలలో అంతలా ఎగబడతారు జనాలు నాకు అర్థం కాదు. వాళ్ళు మనలాంటి మనుషులే కదా..
ఎవరి జీవితానికి వారే బాధ్యత వహించాలి నిజమే. అలాంటి చోటుకు మహిళలు,పిల్లలు వెళ్ళడం తప్పే కానీ .. ఒక జనాదరణ కలిగిన వ్యక్తి రోడ్ మీదకో, ప్రజల మధ్యకి వచ్చినప్పుడు ఆలోచించాలి.. జై ఎగబడతారు వారికి ఏమైనా జరిగితే అని ఆలోచించాలి..
మనదేశంలో జనాలకు బాధ్యత లేదు. రూల్స్ పాటించరు అది అందరికి తెలిసిన విషయమే. ఇది తెలిసి సెలెబ్రెటీలు రోడ్లమీదకు వచ్చి షో చేయకూడదు. వారిని చూడడానికి జనాలు పెద్ద ఎత్తున వస్తారు తొక్కిసలాట జరుగుతుంది అని తెలిసి కూడా రావడం వారి బాధ్యతరాహిత్యానికి నిదర్శనం..
అంతేగా మరీ.. కోట్ల రూపాయలు ఉన్నోళ్ళే పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కు పది రూపాయలకంటే ఒక్క రూపాయి ఎక్కువ పెట్టి కొనం అన్నప్పుడు సామాన్య జనం 100 రూ. టికెట్ 1000 పెట్టి ఎందుకు కొనాలి..
10రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కి 10రూపాయలే పెట్టి కొనాలి 100రూపాయలు కాదు .. 100రూ టికెట్ 1000రూ అవసరమా...
ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అంతే చూడకపోతే చాలా నష్టపోతారు జీవితంలో..
ఆత్మవిశ్వాసాన్ని పెంచే మాటలు చెప్పారు. ఎవ్వరిమీద ఆధారపడనప్పుడే మనం ధైర్యంగా ఉంటాం...
మార్వాడీలు ఒకరికొకరు సాయం చేస్తూ వాళ్ళు పైకి వస్తారు. మనం వాళ్ళలో ఎవరైనా కష్టాల్లో ఉంటే హేలన చేస్తారు.