భారతి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
శ్రీ గారు,
కుబ్జ క్రిందటి జన్మలో శూర్పణఖ అని అక్కడక్కడ వినడమో, చడవడమో జరిగింది కానీ, ప్రామాణికంగా ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదండి.
ఇక, రామాయణంలో శూర్పణఖ ను విశ్లేషిస్తే, ఆమె మనసులో భావాలు, మాటలు, చేతలు అన్నీ వక్రంగా ఉండేవి. మనసులో భావం వేరు (తన భర్తను అన్న రావణుడు కావాలనే చంపేడని తలచి, ఆ ప్రతీకారంతో అన్నను చంపే శక్తివంతునికై ఎంతోకాలంగా ఎదురుచూస్తుండగా, ఒకసారి రాముణ్ణి చూసిందని, అతని ప్రతిభ తెలుకుని, అన్నను సంహరించే శక్తి రామునికే ఉందని భావించి, రాముడు దగ్గరకు వచ్చిందని చెప్తుంటారు కొందరు), ఆపై ఆమె మాటలు వేరు, చేతలు వేరు కాబట్టి, ఈ జన్మలో ఆ మూడు వంకరలుతో వికృతంగా పుట్టిందని, అందుకే త్రివక్ర అని పిలిచేవారని, కుబ్జం అంటే మరుగుజ్జు కాబట్టి కుబ్జ అని అనేవారని చెప్తుంటారు. ఈ జన్మలో కృష్ణుడు అనుగ్రహించి, ఆ మూడు వంకరలు తీసేసినట్లు చెప్తుంటారు.
జీవితాన్ని సార్థకం చేసుకున్నారు.
తృప్తికర జీవనం.
మీరు మాలాంటివారికి మార్గదర్శకులు 🙏
అజ్ఞాత గారు, పైన ప్రచురించిన వ్యాఖ్యనే కాస్త సాగదీస్తూ, అటూఇటూ మార్చి మార్చి ఆరు వ్యాఖ్యలు, మీ వ్యాఖ్యలు ప్రచురించడం లేదని మరో నాలుగు వ్యాఖ్యలు...
ఇన్ని కామెంట్స్ అవసరం లేదండి. వెంటనే మీకు సమాధానం క్లుప్తంగా చెప్దామనుకుంటే, వీలు కాదు...ఎందుకంటే మీరు సాగదీస్తూ అడిగిన వాటికి కాస్త వివరణగా చెప్పాలి. వీలు వెంబడి చెప్తాను. నా వ్యక్తిగత పనుల వలన తీరిక ఉండడం లేదు. కాబట్టి వేచి ఉండండి.
మీ కారణంగా అజ్ఞాతలుగా ఇక ఎవరూ వ్యాఖ్యానించకుండా తగు సవరణ చేయాల్సివచ్చింది.
వేదాలను కావ్యాలను ఇతిహాసాలను ఔపాసన పట్టి లోకజ్ఞానం సముపార్జించిన యోగి to పెద్దలమాట చద్దిమూట లాంటిది ... ఎంత చక్కటి భావ వ్యక్తీకరణ ... లెస్సగా చెప్పారు వనజగారు.
శర్మగారు బ్లాగ్ పుస్తకం గురించి మీరు చెప్పిన మాటల్లో అతిశయోక్తి లేదు. వారి రచనలో ఆ ఘనత ఉంది.
మీ ముందుమాట / స్పందన బహు బాగుంది. అభినందనలు వనజగారు.
నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ...
జన్మదిన శుభాకాంక్షలు నిఖిల్ చంద్రా.
వనజగారు మీ ఇరువరి నడుమ ప్రేమాభిమానాలు సదా ఇలానే నిలిచి ఉండాలని ఆశిస్తున్నాను (ఒకరోజు ఆలస్యంగా చెప్తున్నా)