మాధవి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Sir, your attempts to decentralize the education system and bring in meaningful community participation were truly visionary, but what is really important is how you tried to translate those ideas into practice through the school complex structure as facilitator and by strengthening the management capacity of headmasters through specialised training.
“పిల్లలు ఆశించిన నైపుణ్యాల్ని సాధిస్తున్నారా లేదా అన్నది తెలుసుకోవలసిన అవసరం డిప్యూటీ ఇనస్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కన్నా ఎక్కువగా పిల్లల తల్లిదండ్రులకే ఉంది”
అన్న ఆలోచనతో మాసాంత వేడుకలను నిర్వహించడం, పాఠశాల తన పనితీరు, పిల్లల హాజరు, అభ్యసన ఫలితాలను గ్రామ సమాజం ముందుంచడం ద్వారా community participationను social accountabilityగా మార్చే ప్రయత్నం నిజంగా గొప్పది.
It really feels like a one-of-a-kind practice. ఎక్కడా ఇలాంటి practice వున్నట్లు వినలేదు.
I sincerely hope these initiatives continued and that the schools and communities were able to reap their benefits. 🙏🏽
పార్వతీపురం, కర్నూలు, ఉత్నూరులో మీ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు పాడేరులో మీరు చేపట్టిన కార్యక్రమాల్లో ఎలా రూపుదిద్దుకున్నాయో చదువుతుంటే మీ ప్రయాణంలో ప్రతి మజిలీ తర్వాతి మజిలీకి ఎలా దారి చూపించింది తెలుస్తుంది Sir.
It also shows the evolution of your thought process through this journey, and your constant effort to find ways of creating lasting and meaningful change in the lives of tribal communities through education. 🙏🏽
“మీరు పక్కకు తప్పుకోగానే కుంటుపడే ప్రయత్నాలను, అవి ఎంత ఉన్నతమైనప్పటికీ, ఎందుకు చేపట్టాలి?” అనే మీ self questioning, దాని నుంచి మీరు అన్వేషించిన solutions, Watershed developmentలో మీరు నేర్చుకున్న అనుభవాలను educationకి అనుగుణంగా adapt చేసిన విధానం. School mapping, catchment areas, school complexes నుంచి ప్రతి పాఠశాల తన ప్రణాళికను రూపొందించుకోవడం, అందులో గ్రామ సమాజాన్ని భాగస్వామిగా చేయడం వరకు, ఒక రంగంలో నేర్చుకున్న principlesను మరో రంగంలోకి తీసుకువస్తూనే, రెండింటి మధ్య ఉన్న fundamental differencesను కూడా గుర్తించి ముందుకు వెళ్లడం చాలా valuable insight.
హట్టగూడ ఉదాహరణలో Community participationతో మొదలైన ఒక కార్యక్రమం, కాలక్రమంలో స్వయం పోషకంగా మారి, literacyకే పరిమితం కాకుండా మరెన్నో అంశాలను కలుపుకుని ఒక సమగ్ర విద్యా కార్యక్రమంగా ఎదగడం చాలా చాలా inspiring. Gustafson గారు తన నిర్ణయాలను communityపై impose చేయకుండా, నిర్ణయాధికారాన్ని వారికే వదిలేయడం నిజమైన community ownership అంటే ఏమిటో చూపించింది.🙏🏽
A complete lesson in what true community participation really means, giving people a voice and ownership in the decisions that affect their own lives.
A very deep and thought-provoking post, Sir. 🙏🏽🙏🏽🙏🏽
Watershed development projects గురించి వినడమే కానీ, అసలు అవి ఎలా పనిచేస్తాయి, వాటి వెనుక ఉన్న ఆలోచన ఏమిటో details తెలియదు. Now I understand how these are community-led projects, supported and facilitated by the government, as part of the decentralisation and people’s participation that our visionaries had long been talking about.
And indirectly, ఈ ఆలోచనలు “మాబడి” వంటి ప్రయోగాలకు ఎలా దారి తీశాయో తెలిసింది.
ఇరవై మంది పిల్లలు లేకపోతే ప్రభుత్వ పాఠశాలే సాధ్యం కాని పరిస్థితిలో, తమ గ్రామంలో చదవడం, రాయడం వచ్చిన యువకుడిని లేదా యువతిని ఎంచుకుని, ప్రతి పిల్లవాడికి నెలకు ఐదు రూపాయలు చొప్పున చెల్లించి, సంస్థ కూడా దానికి అనుగుణంగా తన వంతు ఇవ్వడం గిరిజనులు తమ పిల్లల కోసం తమ బడిని తామే ఏర్పాటుచేసుకోవడం, వారు నగదుగా ఇవ్వలేని చోట చింతపండు రూపంలో తమ matching contribution ఇవ్వడం చాలా touchingగా అనిపించింది.
“సమాజానికి దూరంగా ఉన్న సనాతన ఆదిమగిరిజన సమాజాల్లో కూడా విద్య పట్ల ఆసక్తి తక్కినవారితో సమానంగా, ఇంకా చెప్పాలంటే ఒక పాలు ఎక్కువే ఉన్నదని”
మీరు చెప్పింది ఎంత నిజమో అన్పించింది.
“మాబడులు” ప్రభుత్వ ఏకోపాధ్యాయ పాఠశాలల కంటే ఎక్కువ క్రియాశీలకంగా పనిచేయడం కూడా చాలా significant observation, Sir.
ఇక “వెలుగుబాట” పాఠశాలకు వెళ్లకుండా పెరిగి పెద్దయిన బాలురకు కొంత చదువు, కొంత వృత్తి శిక్షణ ఇవ్వాలనే ప్రయత్నం చాలా మంచిది.
1972 నుంచి సాగిన మీ విద్యా ప్రయాణాన్ని వెనక్కి చూసుకుంటూ, మీ ప్రతి మలుపునీ అప్పటి national and international developmentsతో link చేసి చూపించడం, మీరు ఒక isolated journey చేయలేదు, educationలో ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఒక larger journeyలో మీ వంతు ప్రయాణాన్ని మీరు కూడా సాగిస్తూ వచ్చారనే realization చాలా beautifulగా ఉంది.
Very valuable lessons and insights in this post, Sir.
🙏🏽
పాడేరు గిరిజనుల geography, climate, health, ఆహార భద్రత సమస్యలు, access కష్టమైన కొండలు, అడవుల్లోని వారి జనావాసాలు, పేదరికం వంటి realities ని స్పష్టంగా చూపించారు.
“ అయిదారుగురు పిల్లలతో ఎక్కడో కొండల మీద… ఆదిమగిరిజన సమూహాలకు విద్యనెట్లా ఇవ్వాలో విద్యా ప్రణాళికావేత్తల దగ్గర సమాధానం లేదు.”
This says it all about the challenges of providing education there.
Got a good context of Paderu, Sir. This place feels like an entirely different world with its own realities and challenges.
ఇక్కడి మీ మజిలీలో మీ అనుభవాలు, మీరు చేపట్టిన కార్యక్రమాల గురించి చదవడానికి రేపటి పోస్ట్ కోసం ఎదురుచూస్తున్నాము, Sir. 🙏🏽
“సామర్థ్యం దానికదే విలువ కాదు. అది తిరిగి సంకల్పం మీదనే ఆధారపడుతుంది.”
“ఉపాధ్యాయుడికి సామర్థ్యం కొరవ అయినందువల్ల కాక, అతని మనసును తట్టిలేపనందువల్ల మాత్రమే పాఠశాలలు నిస్తేజంగా ఉన్నాయని నాకు బోధపడింది.”
ఉపాధ్యాయ సంఘాలు చేసిన ధర్నాలను mere resistance to change గా మాత్రమే చూడకుండా దాని వెనుక వున్న insecurity, self-respect, trust వంటి అంశాలను గమనించి, అర్ధం చేసుకుని వారి సమస్యలను వినడానికి తాలూకా కేంద్రాలలో ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి
వారు మనోబలం తో ముందుకు సాగడానికి మీరు చేసిన ప్రయత్నాలు shows what a true leader is like, Sir!!
“రెండు సందర్భాల్లోనూ నాదేమీ లేదు. నేను సాక్షిని, నిమిత్తమాత్రుణ్ణి.”
ఒకప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించినవారే, తర్వాత మిమ్మల్ని గౌరవించారు.
కానీ ఆ రెండింటినీ personal తీసుకోకుండా, వాటి వెనుక ఉన్న human nature ని అర్థం చేసుకుని, మీ పాత్రను “సాక్షి, నిమిత్తమాత్రుడు” గా మాత్రమే చూడగలగడం possible only for an evolved person!
🙇🏻♀️🙏🏽
తెలుగు భాష పరిణామాన్ని శాసనభాష, సాహిత్యభాష, ఆధునిక భాష, ప్రపంచ భాష అనే నాలుగు దశల్లో విశ్లేషించిన విధానం చాలా interesting and informative గా వుంది.
శాసన భాష నుండి సాహిత్య భాషగా తెలుగు ఎందుకు, ఎలా పరిణామం చెందిందనే Socio-political reasonsని వివరించిన విధానం,
ఆధునిక కాలంలో భాష modernization వల్ల అక్షరాస్యత పెరగడం, విజ్ఞాన వ్యాప్తికి మార్గం ఏర్పడటం, ఈ దిశగా కృషి చేసిన మహానుభావులను తలుచుకోవడం,
ఇక ప్రపంచ భాషగా ఎదగాలంటే తెలుగు నుంచి ఇతర భాషల్లోకి, ఇతర భాషల నుంచి తెలుగులోకి అనువాదాలు, knowledge exchange, మరింత విస్తరించాల్సిన అవసరాన్ని గురించిన చర్చ చాలా ఆలోచింపజేసింది సర్.
A very important conversation!!
Thank you, Sir. 🙏🏽