మాలతి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

వనజవనమాలి;మాలతి

వనజగారూ,
ఏనుగు అంబారీ కథ చదివేను.
నేను 46ఏళ్ళగా ఈదేశంలో ఉన్నా సమాజంలో ఎవరితోనూ కలవలేదు కనక నాకు చాలా విషయాలు తెలీవు. నేను వచ్చినకొత్తలో ఇక్కడ డాలర్లంటే బోలెడు రూ. అని అనుకుంటారనుకున్నాను కానీ అది ఇంకా మారలేదని మీకథ చూసేకే అర్థమయింది. కూటికి పేదయితే కులానికి పేదా అన్న సామెతని మీరు ప్రత్యేకమైన పద్ధతిలో వాడడం నాకు నచ్చింది. అలాగే "మీనాన్నకి ఆమెపై ఎందుకంత జాలి"లాటివి కూడా సూక్ష్మంగా ఆలోచిస్తే తప్ప తోచవు. మీరు బాగానే పసి కట్టినట్టున్నారు మనిషితత్వం. నిజానికి మీరు రాసిన ఒకొక సంఘటన విడిగా మరో మంచి కథ కాగలదు. ఒక నవలకి సరిపడా సరుకుంది ఈ కథలో.
మంచికథ. బహుమతి గెలుచుకోగలకథ. మరొకసారి అభినందనలు.

11 March 2019 12:34 AM

మా వంటా-వార్పు;మాలతి

నేను మెంతికూర ఎప్పుడూ వాడలేదు కానీ అలసందగింజలతో ఇలాగే చేస్తాను. బాగుంటుంది

14 September 2018 6:08 PM

రాగం .. భూపాలం;మాలతి

రుద్ర త్వమేవాహాన్నీ శ్రీ శ్రీ మహాప్రస్తానాన్నీ అందులో ఏంవుందీ తెలీకముందు ఆ కవితా ప్రవాహాన్ని ప్రాసల్ని పదబంధాల్ని పెద్దగా చదివేసి సంతోషపడేవాళ్లం .- :)) బాగా చెప్పేరండీ. అప్పట్లో తెలుగు మనభాషమ్మా, మనం తప్పకుండా నేర్చుకోవాలి అని పని గట్టుకు చెప్పవలసి వచ్చేది కాదు.

23 April 2013 11:47 PM

రాగం .. భూపాలం;మాలతి

సత్యవతిగారూ, నా ఎగస్ట్రా వ్యాఖ్యలు తీయమంటే మీరు తియ్యలేదు. ఈలోపునే నేను మళ్ళీ వచ్చేసి పూర్తిగా చదివేను. మీ అనుభవాలు చూస్తుంటే నాకు ఈర్ష్యగా ఉంది. నాక్కూడా ఇలా రాయాలని ఉంది....

21 May 2012 8:39 PM

రాగం .. భూపాలం;మాలతి

This comment has been removed by a blog administrator.

20 May 2012 7:08 AM

రాగం .. భూపాలం;మాలతి

This comment has been removed by a blog administrator.

20 May 2012 7:08 AM

రాగం .. భూపాలం;మాలతి

This comment has been removed by a blog administrator.

20 May 2012 7:08 AM