Sodhini

రామారావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

బైపీసీ అంటే కప్పలు కోయడం అని ఒక అపోహ ఉండేది — అందుకని సగం మంది మానేయడం ఎరుగుదును. ఇక హాస్పిటల్ పెట్టటానికి డబ్బులు అవసరం అనే మాట నాకు కూడా చెప్పారు. నేను అంత దూరం ఆలోచించలేదు కానీ వేరే కారణాలవల్ల ఎంపీసీ తీసుకున్నాను. సీఈసీ తీసుకుందామా అని ఆలోచించాను కానీ ధైర్యం చాల్లేదు.

మాకు నన్నే సాహెబు అని డాక్టరు (గుంటూరులో కంపౌండర్ — ఆ పదానికి ఒక చరిత్ర ఉంది!) ఉండేవాడు. చిన్నతనంలో ముందు మందు కన్నా ధైర్యం ముఖ్యం కాబోసు, అది మాత్రం బాగా ఇచ్చేవాడు, ఇంజెక్షనుతో బాటు. ఇప్పుడు అనిపిస్తుంది తనకి తెలిసిన వైద్యం చాలా తక్కువని! కానీ, అది చాలు!

ఆ రోజుల్లో వాళ్ళని తలుచుకుంటే నాకు బాగా కనిపించేదేమిటంటే, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. నాతో మా నాన్న ఒక మాట అనేవాడు, నలుగురూ బాగుంటే మనమూ బాగుంటాము అని! జీరో సమ్ గేమ్ లాగ చూస్తున్న ఈరోజుల్లో అప్పటి వాళ్ళ విశిష్టత అప్పుడప్పుడూ గుర్తుకు వస్తుంది.

ఈ పాటను “సిగరి” పెండ్లికూతుర అంటూ పాడి తితిదే
వారి చానల్ లో వింటే ఈ సిగరి సిగరి అంటే ఏమిటో అనుకున్నా ! సిగ్గరి అన్న మాట !

In the name of tunes lyrics go for toss!