పూజ్యులు శరభయ్య గారి ప్రసంగాన్ని ఈ విధంగా వ్యాసరూపంగా మార్చి మరికొందరు పాఠకులకి అందుబాటులోకి తెచ్చినందుకు చాలా సంతోషం.
అయితే చిన్న సవరణలు. పై వ్యాసంలో, ‘చిరుసాన పట్టించి చికిలి చేయించిన ‘ పద్యం గురించి శరభయ్యగారు ప్రస్తావించినప్పుడు, ఆ సీసపద్యంలోని మొదటి పంక్తిని మాత్రమే పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ పద్యంలోని ఎత్తుగీతి గురించిన ప్రశంస పై వ్యాసంలో ఉన్నది శరభయ్యగారి ప్రసంగంలో లేదు. అలానే, చివరలో ఆయన తనపైన కూడా శ్రీనాథుడి ప్రభావం గురించి ప్రస్తావిస్తూ తాను రాసిన రెండు పద్యాల్ని ప్రస్తావించారు. కానీ పై వ్యాసంలో మొదటి పద్యం ఆయన పద్యం బదులు విశ్వనాథ పద్యం ప్రస్తావనకొచ్చింది. ఈ రెండూ మూల ప్రసంగ వ్యాసంలో లేవని పాఠకులకి తెలియచేస్తున్నాను.