వారణాసి నాగలక్ష్మి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
థాంక్యూ రాధికా. మీ స్పందనకి జవాబివ్వలేదని ఇప్పుడే గుర్తించాను.
థాంక్యూ మణీ! కృష్ణని నేను నాన్నగారిలో చూసుకోలేదు. నాన్నగారు అలాగే ఉండేవారు. అయితే ఒక మూడు నాలుగు గంటల్లో చదివేసే నవల కాదు కదా జీవితం. ఆయన్ని యాభై సంవత్సరాలు దగ్గరగా గమనించాను.చాలామంది కూతుర్లకి తండ్రే హీరో నిజమే గాని ఒక కూతురిగా కాకుండా ఆయనని ఒక పరిశీలకురాలి దృష్టితో చూసి రాసిన వాక్యాలవి!!
శ్రీనగర్ కాలనీ లో మా ఇంటి దగ్గరలో ఒక painting స్కూలు నడిపేవారు పాండు గారు,రవి గారు .తర్వాత ఆయన మొదటి వన్ మాన్ షో లో ఒక painting నా ద్వారా మంచి ధరకు(అప్పట్లో) అమ్ముడయిందని, మిగిలిన అత్యంత హృద్యమైన అందమైన కళాఖండాలలో ఏదైనా ఒక దాన్ని నన్ను తీసుకోమని అడిగారు. ఎంతో కష్టపడి చిత్రించిన వాటిలోంచి అలా ఒకటి తీసేసుకోలేనని అన్నాను.తరువాత చాలా కాలానికి ఒక framing షాప్ లో ఆయన బొమ్మలు కనిపించి ఆ శైలి వెంటనే గుర్తుపట్టి, పాండు గారి నంబర్ అడిగి తీసుకుని ఫోన్ చేశా. అప్పటికి ఒక ఎటాక్ వచ్చిందని చెప్పి 'రవే బతికించాడు మేడం.కొంచెం వుంటే పోయేవాడినే ' అన్నారు పకపకా నవ్వుతూ.
' అప్పుడు బొమ్మ ఇస్తే తీసుకోనన్నారు.ఇప్పుడు లక్షల్లో నడుస్తోంది.సంవత్సరం దాకా బుక్కైపోయా! '' అన్నారు.'ఎక్కువ స్త్రెస్స్ మంచిది కాదు.please take care ' అంటే , 'మనకట్టాంటి జాగ్రత్తలు కుదిరేవి కాదులెండి మేడం ' అని నవ్వేసిన పాండు గారు లేరని ఈమధ్యనే తెలిసింది.'సందేహంతో సంకోచం తో గీతలు గీయకూడదు మేడం!గీసే గీత బలంగా, ఖచ్చితంగా ఉండా'లనే పాండు గారింక గీతలే గీయరంటే చాలా బాధగా ఉంది.