“నాగరికత” కాదు, “అజ్ఞానం” కాదు శ్యామలరావు గారూ … ఒళ్లు పొగరు, పక్కవాళ్లంటే లెక్క చెయ్యక పోవడం. కాకపోతే ఏమిటండీ రాత్రి పదకొండు తరువాత కూడా ఐటెం పాటలు, తెల్లవారు ఝామునే భక్తి గీతాలు రైళ్లల్లో అతి సాధారణమైపోయింది. కనీసం ఇయర్ ఫోన్స్ వాడదామనే ఇంగితం కూడా లేని నిర్లక్ష్యం.
అసలు రైల్లోనూ, బస్సులోనూ దీన్ని నిషేధించమనీ, ఇయర్ ఫోన్స్ లేకుండా వాడద్దనీ, ఈ నిషేధాన్ని అమలు చేసే బాధ్యత కండక్టర్ కు ఇవ్వమనీ - రైల్వే వారికీ, RTC వారికీ గతంలో వ్రాశాను. జవాబే లేదు.
మరొకటి గమనించారా, మామూలుగా మాట్లాడడానికి కూడా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం చాలా చాలా ఎక్కువై పోయింది. సెల్ ని చెవి దగ్గర పెట్టుకోవడం నచ్చడం లేదేమో, లేదా చెయ్యి నొప్పి పుడుతుందనేమో స్పీకర్ లో మాట్లాడేస్తున్నారు. ఎక్కడికి పోతోంది ఈ సమాజం?