విన్నకోట నరసింహారావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
అంతే అంతే గుహుడు మాటల్లోని ఆంతర్యం.
దాన్ని మీరు బహు చక్కగా వివరించారు 🙏.
👏👏
మీలో చాలా talent ఉందండి 👌. మీరు దాన్ని మరింత వెలుగులోకి తీసుకురావాలి 👍.
మీకు, మీ కుటుంబానికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు 🎋.
-విన్నకోట నరసింహారావు
Like
అదొక్కటే మార్గంలా ఉంది, అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే 🤣🤣.
——————-
కార్పె’రెట్ట’లూ జిందాబాద్ 😡.
విన్నకోట నరసింహారావు
Like
వాళ్ళు తినరేమో అని ఎలా అనుకోగలం, Annin (10/12/2023 23:38) గారూ?
వాళ్ళేదో క్రికెట్ బాగా ఆడతారన్నంత మాత్రాన నిజ జీవితంలో వాళ్ళనేమీ ఉన్నతంగా ఊహించుకోనవసరం లేదని నా అభిప్రాయం. ఎవరి బలహీనతలు వారికుంటాయి. డబ్బులిస్తారంటే ఏ ఉత్పత్తికయినా మోడల్ గా చెయ్యడానికి రెడీ ఏమో అనిపించక మానదు ఈ so called సెలెబ్రిటీల తీరు చూస్తుంటే.
“కన్యాశుల్కం” నాటకంలో రామప్ప పంతులు మధురవాణి తో “ఆ … గుంటడి వెకాస్యాలు నిజమనుకుంటావేమిటి?” అంటాడు చూశారా. ఈ సోకాల్డ్ సెలెబ్రిటీల మాటల విషయంలో కూడా అదే గుర్తు పెట్టుకోవడం ఉత్తమం.
“కృత్రిమ” పదం గురించి భాస్కర్ ఊలపల్లి గారి అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తాను. కృత్రిమ, కృతక పదాలు నిఘంటువులో కనిపిస్తున్నాయి గానీ కృ తి మ అనే పదం నిఘంటువులో కనబడడం లేదు. ఆ పదం ఇప్పటికే వాడుకభాషలోకి వచ్చేసిందనీ అనిపించడం లేదు.
అనువాదం బాగుంది, మూర్తి గారూ. మీ ఈ బ్లాగ్ లింక్ రవిశంకర్ కు పంపించాను (రవిశంకర్ మా ఆఖరి తమ్ముడు).
రవిశంకర్ ఇతర రచనలు కొన్నిటిని కూడా మీరు ఇక్కడ ప్రచురించినట్లు మీ బ్లాగ్ చూస్తే తెలుస్తోంది.
సాహిత్య అకాడమి వారు “ప్రవాసీ మంచ్” అనే కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ నెల 21న (21-06-2020) వారు అన్లైన్ లో జరిపిన తెలుగు కార్యక్రమంలో ప్రవాసులు రవిశంకర్ విన్నకోట, మానస చామర్తి, కిరణ్మయి యలమంచిలి (“నిషిగంధ”) తమ తమ కవితలు చదివారు. ఆ విడియోకు లింక్ ఈ క్రింద ఇస్తున్నాను. ఇంతకు ముందే చూసుండక పోతే ఇప్పుడు చూడవచ్చు.
మెచ్చుకోండి
చాలా వివరణాత్మకమైన మీ వ్యాసం, దాని మీద “కష్టేఫలి” శర్మ గారి మరిన్ని వివరాలతో కూడిన వ్యాఖ్య …. ఆసక్తికరంగా ఉన్నాయి.
పైన “శ్రీ చౌడేశ్వరిమాత ఆవిర్భావ చరిత్ర…. ” అన్న పేరాలో “విన్నకోట సీమ” అన్నారు. దీన్ని గురించిన మరిన్ని వివరాలేమన్నా దొరుకుతాయా కాశ్యప్ గారూ? థాంక్స్.
కి స్పందనగా.
అంతేనంటారా? అంతేలెండి, “ఏమున్నదక్కో, ఏమున్నదక్కా” (ఏమున్నది + అక్కా) అని ఓ సినిమా పాట లో అంటాడు లెండి, అలాగన్నమాట 🙁 !
మెచ్చుకోండి
// “ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మవారి చలవండి 😦
ఇప్పుడు కనపట్టం లేదండి.” //
————————————-
విదేశీహస్తం అన్నమాట 👋.
మెచ్చుకోండి
మీ మాట వినిపించి చాలా రోజులైంది. అంతా సవ్యంగానే ఉంది కదా శర్మ గారు?
మెచ్చుకోండి
మీ మరొక బ్లాగ్ “కష్టేఫలే” “మాలిక” లో కనిపించదేమి, శర్మ గారూ ? ఇదివరలో కనిపించేదే 🤔!!
మెచ్చుకోండి
మారు వడ్డిస్తారా (బంగారపు రేకులు)?☺
మెచ్చుకోండి
రాం గారూ, ఇటువంటి ఫంక్షన్లేమిటి, సినిమా వ్యక్తులు కొంతమంది పోయినప్పుడు కూడా మన నటమహారాజులు పరామర్శకు వెళ్ళినట్లు అరుదుగా కనిపిస్తుంది. ఆఫీస్ లో సహోద్యోగి పోతే వెళ్ళి పలకరిస్తారు. సినిమా ఫీల్డ్ లో కూడా సహనటులు, రచయితలు, గాయకులు వగైరా అంటే సహోద్యోగులలాంటి వారే కదా. ఏవిటో, మాయా ప్రపంచంలో అంతా మాయేనేమో.