వేణు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

తెలుగు పరిశోధన;వేణు

Unknown: మీ వ్యాఖ్యలో కోట్ చేసిన పద్యం... రాసినవారు జాషువా. ఉమ్మడి ఏపీలో గతంలో 5/6/7 తరగతుల్లో ‘భారత వీరుడు’ అనే పాఠ్యభాగంలో చదివిన పద్యం.

‘సంగర సీమ నీకు దొలి సాయకమైన..’ అని మొదలవుతుంది.
..‘ఇనజా నను గ్రమ్మర నేయుమన్న ఛీ, యెంగిలి బాణమేయననవే రణవీరుడ వీవ యర్కజా’

27 March 2026 2:53 PM

వేణువు;వేణు

అది పేపర్ కటింగ్ కదా? మీరు పీసీలో డెస్క్ టాప్ పై డౌన్ లోడ్ చేసుకుని view జూమ్ చేసుకుని చదవొచ్చు. ఈ వ్యాసం పూర్తి పాఠం రంగనాయకమ్మ గారి పుస్తకంలో ఉంది.

27 November 2023 5:51 PM

వేణువు;వేణు

విశ్వప్రసాద్ గారి మూడు నవలలు.. మాయలాడి, జోకర్, జానీవాకర్ ఇప్పుడు పునర్ముద్రణ జరిగి మార్కెట్లో ఉన్నాయి. పల్లవీ పబ్లికేషన్స్ పంపిణీ చేస్తోంది.

30 August 2021 12:15 PM

వేణువు;వేణు

gvskarthik10ః ఈ సినిమా తెలుగులో straight గా తీసినది. కమల్ స్వయంగా సంభాషణలు చెప్పారు. తొలి చిత్రం మరో చరిత్ర నుంచే తను తెలుగులో సంభాషణలు చెప్తూ వస్తున్నారు. డబ్బింగ్ చేసిన సినిమాలకు బాలు ఎక్కువ చెప్పారు. ఒక్క సతీ లీలావతికి మనో చెప్పారు. <br />

16 March 2021 6:50 PM

మారుతీయం;వేణు

అక్కినేని నాగేశ్వరరావు గారి వ్యక్తిత్వ స్వభావాలను వివరిస్తూ మీరు రాసిన నివాళి బాగుంది; అర్థవంతంగా ఉంది.

27 January 2014 9:52 AM

Comments for కథనం;వేణు

‘నవీనమ్’- పేరు చాలా బాగుందండీ. పాఠకులు వ్యాఖ్యలు రాయటానికి వీలుగా కొత్తగా సెటింగ్స్ మార్చారనుకుంటాను.

సినీ హీరోలు ఎన్ని రకాల కోణాల్లో అందంగా కనపడతారో మీరు రాసింది ఆసక్తికరంగా ఉంది. ముక్కు విషయంలో ఎన్టీఆర్, ఇందిరాగాంధీలదీ ఒక తరహా అయితే; కేసీఆర్ ది మరొక తరహా అంటారా?

నెలకో పోస్టు రాసే నా బ్లాగుపై మీ ప్రశంసలకు సంతోషం కలుగుతోంది. దానిలో మిళితమైన మీ వాత్సల్యానికి కూడా!

Like


27 May 2013 8:35 PM

Naveenam;వేణు

‘నవీనమ్’- పేరు చాలా బాగుందండీ. పాఠకులు వ్యాఖ్యలు రాయటానికి వీలుగా కొత్తగా సెటింగ్స్ మార్చారనుకుంటాను.

సినీ హీరోలు ఎన్ని రకాల కోణాల్లో అందంగా కనపడతారో మీరు రాసింది ఆసక్తికరంగా ఉంది. ముక్కు విషయంలో ఎన్టీఆర్, ఇందిరాగాంధీలదీ ఒక తరహా అయితే; కేసీఆర్ ది మరొక తరహా అంటారా?

నెలకో పోస్టు రాసే నా బ్లాగుపై మీ ప్రశంసలకు సంతోషం కలుగుతోంది. దానిలో మిళితమైన మీ వాత్సల్యానికి కూడా!

27 May 2013 8:05 PM

పుట్టుమచ్చ;వేణు

పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథలపై చక్కని విశ్లేషణ. చాలాకాలం క్రితం అజంతా.. పెద్దిభొట్ల సాహిత్యం గురించి రాసిన వ్యాసం గుర్తొచ్చింది!

14 December 2012 4:12 PM

64 కళలు డాట్కాం;వేణు

అడవి బాపిరాజు గారి బహుముఖ కళాప్రతిభ గురించి చాలా విశేషాలు తెలిశాయి. రచయిత వెంకటరమణ గారికి అభినందనలు! ‘ఉప్పొంగిపోయింది గోదావరి’ గేయాన్ని కూడా ప్రస్తావించివుంటే బాగుండేదనిపించింది.

07 July 2012 8:45 AM

నరసరావుపేట్రియాట్స్;వేణు

కోటప్పకొండ తిరునాళ్ళ విశేషాల గురించి మీరు రాసిన సచిత్ర వ్యాసం బాగుంది. ప్రభల పూర్తి పేరు ‘ప్రభ బళ్ళు’ అనుకుంటాను.

‘‘ ఎటువంటి పరిస్తితుల్లోనూ వెనుదిరిగి చూడకుండా వెళ్ళాలని..’’ చెప్పే గాథ పేర్ల మార్పులతో ఇతర స్థలపురాణాల్లో కూడా వినపడుతుంటుంది.

మీ వ్యాసం కారణంగా మురళీధరరావు గారి వ్యాఖ్య ద్వారా- 1750 నాటి కొప్పరాజు నరసింహకవి తిరునాళ్ళపై రాసిన పద్యం చదవగలిగాను. నాటి సంరంభాన్ని నరసింహకవి చక్కగా అక్షరాల్లో పొదిగారు!

24 February 2012 8:15 PM

చందమామలు;వేణు

ఇలా పాత చందమామలను అందించటం బాగుంది. 1961 నుంచి చందమామ సంచికలు ulib.org లో కొన్ని నెలలవి మాత్రమే దొరుకుతున్నాయి.

1977, 1980, 1985 సంవత్సరాల సంచికలైతే ఒక్కటి కూడా లభ్యమవ్వటం లేదు. వాటిని మీరు అందించగలిగితే చందమామ అభిమానులు ఎంతో సంతోషిస్తారు.

30 March 2009 3:44 PM