శర్మ దంతుర్తి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;శర్మ దంతుర్తి

ఆసక్తిగా సాగుతోంది కధనం. అయితే నండూరి వారి దగ్గిర నుండి మిగతావారు అందరూ కూడా “కృష్ణ బిలం, కృష్ణ వస్తువు” అనే వాడారని గుర్తు. పుస్తకాలలో కూడా అలాగే చదివినట్టు గుర్తు. “నల్ల వస్తువు” అనడం ఎందుకో ఎబ్బెట్టుగా ఉంది (అనకూడదని కాదు).

వ్యాసం చివర్లో చెప్పిన యువకుడు ఎవరో అత్యంత సులభంగా తెలిసిపోతోంది (“పేటెంట్ పరీక్షకుడైన ఓ యువకుడు”) 🙂

సినిమా థియేటర్‌లో సెకనుకు 24 విడివిడి ఫోటో రీళ్లను

హాబిట్ సినిమా(లు), అవతార్ సినిమాలకి పీటర్ జాక్సన్, కామెరాన్-లు 24 కంటే ఎక్కువ రేట్‌తో తీసారని అంటారు.

సంపాదకులకి – ఇక్కడ టైప్ చేస్తున్నప్పుడు “జేంస్” అని వస్తోంది కామెరాన్ మొదటి పేరు. లేఖిని లో ఉన్న సదుపాయం ఇక్కడ లేనట్టుంది.


10 July 2026 3:48 AM

Comments for Sirimalle;శర్మ దంతుర్తి

భలే ఉన్నాయండి పద్యాలు. అయితే చివర్లో ఫలశృతి అంత నప్పలేదు. “జిహ్వచాపల్యముక్తిని జెంది” ఇదే అయితే ఇంక దోశెలు తినడం ఎలా? ఒక్కో దోశె తింటూంటే జిహ్వ చాపల్యం ఎక్కువవ్వాలి. ఏమంటారు?

ఆ మధ్య ఫేస్ బుక్కులో కొంత చర్చ జరిగింది. రకరకాల పదాలు సృష్టించడం. అందులో ఒకాయన “ఫిర్ దౌసి” అంటే ఒక దోసె తిని రెండోది కావాలి అని అడిగేవాడు అన్నారు. అలాగే మనం “ఏకాదసి” అంటే చంద్రమానంలో ఉపవాసం చేసి పదకొండు దోసెలు తినేవాడు అని చెప్పుకోవచ్చంటారా? 🙂


06 July 2026 2:38 AM