శ్యామలీయం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
లోగడ ఒక బస్సు ప్రమాద సంఘటన జరిగాక ఇలాగే హడావుడిగా బస్సులు తనిఖీలు సీజులు చూసాం. ఏమి ఒరిగింది? చెత్తబస్సుల ప్రమాదాలు జరుగుతున్నాయి. ముందు ముందు కూడా జరుగుతాయి. తనిఖీలు వట్టి తమాషాలు. అది బస్సుకంపెనీలకూ తెలుసు అధికారులూ తెలుసు. మనకు కూడా తెలుసు.
చాలా ఆశ్చర్యానందాలు కలిగించిందీ ఐతిహ్యం. తెలియపరచి నందుకు ధన్యవాదాలు. అవును నమ్మినవారిని దైవం విడవడు.
అధికవిద్యావంతులను లోకం అప్రయోజకులుగా లెక్క వేస్తున్నది - విద్యాహీనులే కులధనజనబలాలతో పెత్తనం చేస్తూ ఉంటే అని శతకకారుడి తాత్పర్యం.
ఈరోజుల్లో అధికవిద్యావంతులు మరొక చిచ్చు తెలివితో జనాన్ని మోసం చేయటానికి తమ విద్యను వాడుతున్నారు అదే ప్రయోజకత్వం అని నమ్ముతూ. డబ్బు ఎలా వచ్చినా డబ్బే. సంపాదించడమే ప్రయోజకత్వం. నీతి అంటారా అప్రయోజకులు చెప్పే ఒక సాకు అన్నమాట.
భువనవిజయం అనేది రాయలవారి సాహిత్యపీఠం కాని సంగీతపీఠం కాదండి.
ఇది రాయలవారి కుమారుడు చిన్నతనంలోనే మరణించటంతో మూగబోయింది. ఆ సంఘటన తరువాత రాయలవారు విరక్తిలో కూరుకుపోయి సాహిత్య గోష్ఠియే కాదు పాలనావ్యవహారాల పట్లనే విముక్తులయ్యారు.
చాలా దశాబ్ధాల క్రిందట చీకటివెలుగులు అన్న సినిమా చూసాను మిత్రులతో కలిసి. సగం చూసి ఇంటర్వెల్ సమయంలో అమ్మయ్య ఇక చీకటి పార్టు ఐపోయిందిలే వెలుగుపార్టు మొదలు రెండవభాగంలో అనుకున్నాం. తరువాత అర్ధమైనది ఏమిటంటే మేము చూసిన మొదటిభాగమే వెలుగుభాగం అని! కొన్ని సినిమాలంతే మనని హింసించటానికే వస్తాయి!
తెలియక కాదండి
స్వరసవాహీ విదుషోపి తథారూఢాభినివేశః
ప్రాణిసహజమైన ఈమరణం గురించిన నిర్వేదం విద్యావంతులకూ సహజమే. కాని వారివారి ఆధ్యాత్మిక హసాధనానుసారంగా న్యూనాతిరిక్తాలుగా ఉంటుంది. నాకు కూడా ఈ నిర్వేదం ఒక passing cloud అవుతుంది. దానికి కొంచెం సమయం కావాలి. అంతే.
అందరూ చదివి ఆలోచించి పదిమందికీ పంచవలసిన మంచి వ్యాసం!!
వీటికంటే Pramukh IME మంచి సదుపాయం. ఒకేసారి అనేక భారతీయ భాషలు అందుబాటులోకి వస్తాయి. చూడండి https://www.pramukhime.com/
అంత స్వాతిశయం బాగోదు. ఈ వ్యాసం కన్నడ లిపిలో కన్నడ భాషలో కన్నడ బ్లాగులో ఉంటే బాగుంటుంది. తెలుగులిపిలో తెలుగుభాషలో వ్రాసి తెలుగు బ్లాగులో అచ్చు వేసారు. సరే, ఈ వ్యాసంలో కన్నడ అన్నమాట స్థొనంలో తెలుగు అని ఉంచినా సరిగానే ఉంటుంది. బహుశా కన్నడ బదులు తెలుగే కాక వేరే భాష పేరును కూడా వాడవచ్చునేమో. ఈ వ్యాసంలో భాషా దురభిమానం తొంగిచూస్తోందని అనుమానం కలుగుతోంది.
ఒకసారి ఆలోచించండి. బ్లాగు టపాల లోని విషయాలమీద జరిగిన చర్చల కన్నా టపాకు ఏమాత్రం సంబంధం లేని విషయాలను లాగి నిందాలాపాలతో ఆవేశకావేషాలతో రంకెలు వేస్తూ చేసిన వ్యర్ధ చర్చలే తొంభైశాతం ఉంటే ఆ చర్చల వలన బ్లాగులకు ఏమి ప్రయోజనం? చదువరులకు ఏమి ప్రయోజనం? కేవలం పనిలేని కాలక్షేపం రాయుళ్ళ వలన బ్లాగు లోకం చెడింది! ఇక్కడ బ్లాగర్ల బాధ్యతా రాహిత్యం కూడా మిక్కుటంగా ఉంది. వాళ్ళూ మోడరేషన్ చేసి చెత్త వ్యాఖ్యలను నిరాకరించకపోవటం ఈదరిద్రానికి ముఖ్య కారణం. ఇప్పుడు ఎంతవగచీ ఏమీ లాభం లేదు కదా. చెత్త బ్లాగులూ చెత్త వ్యాఖ్యలు రాజ్యం చేసే చోట పాఠకులు ఆ చెత్త కోసం రారండి.
శ్యామలీయం బ్లాగు ప్రస్తుతం ప్రైవేటు బ్లాగు. వీలు వెంబడి పబ్లిక్ చేయాలి. కొన్ని కారణాలవలన నాజీవితం అల్లకల్లోలంగా ఉంది. అందుకని కొన్ని వ్యాసంగాలు కష్టంగా ఉన్నాయి.
కొందరు ఒక వ్యాఖ్యనే వంద చోట్ల అతికిస్తూ ఉంటారు. అవి వ్యాఖ్యలు పేజీని ఆక్రమించి వేస్తాయి. అందుచేత ఒక వ్యాఖ్య కాపీని మాత్రమే ప్రచురించితే చాలును.
మరొకటి.
4. చేట భారతం వ్యాఖ్యలను గురించి. వ్యాఖ్య ప్రదర్శనకు నిడివి పరిమితి విధించటం.
మంచి మార్పులు!
మరి కొన్ని మార్పులు వీలైతే పరిశీలించండి
1. ఒక టపాకు సంబంధించి పరిమిత సంఖ్యలోనే వ్యాఖ్యలు చూపటం.
2. ఒక వ్యాఖ్యాత నుండి పరిమితసంఖ్యలోనే వ్యాఖ్యలు చూపటం.
3.పునరుక్తి వ్యాఖ్యలను పరిహరింఛటం.
మరొక్క విషయం. మీరు అనుకుంటున్నట్లుగా ఈశ్లోకం ద్రౌపది చెప్పిన మాటలలోనిది కాదు. ద్రైపదిని సమర్ధిస్తూ భీమసేనుడు మాట్లాడిన తరువాత అతడితో ధర్మరాజు అన్నమాటలలోనిది ఈశ్లోకం.
సహసా విదధీత. . . .
ఈ శ్లోకానికి ఎమెస్కోవారు ప్రచురించిన పుస్తకంలో డా. కె.వి. సుందరాచార్యులు గారు వ్రాసినది అందిస్తున్నాను.
ప్రతిపదార్ధం. సహసా = ఆలోచించకుండా అకస్మాత్తుగా, క్రియాం = కార్యాన్ని, న విదధీత = చేయరాదు, అవివేకః = ఆలోచన లేకుండా చేయటం, పరమాపదాం = గొప్ప ఆపదలకు, పదం = స్థానం (కారణం) అవుతుంది, హి = ఎందువల్ల నంటే, గుణలుభ్ధాః = శౌర్యవీర్యాది గుణాలను ఆశించేవి, సంపదః = ఐశ్వర్యాదులు, స్వయం = తమంతతామే, వృణుతే = పొందుతున్నవి.
తాత్పర్యం. ఒకపని చేయదలచి నప్పుడు దాని లాభాలాభాలు ఆలోచించుకొని చేయాలి. ఆలోచించకుండా చేసేవారు దుఃఖాన్ని పశ్చాత్తాపాన్ని కూడా పొందుతారు. ఆలోచించి పని చేసినవారు ఎప్పుడు సుఖాన్నే పొందుతారు. వారికి కష్ట మెప్పుడూ రాదు. ఆలోచన లేకపోవటం దుఃఖానికి మూలకారణం. సంపదలెప్పుడూ ఆలోచించి పనిచేసే వారినే పొందుతాయి.