సాయి బ్రహ్మానందం గొర్తి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
హనుమంతరావు గారికి:
మీరు సూచించిన అసంబద్ధత గురించి, నా వివరణ.
వేలూరి గారిని ఇంటర్వ్యూ శ్రీనివాస్ గారూ, నేనూ చేసాము. వీడియో ఇంటర్వ్యూ చెయ్యాలన్నది మా ప్రణాలిక. వీడియో కెమేరా మొరాయించింది. అందువలన సెల్ ఫోనులో రికార్డు చేసాము.
కొన్ని ప్రశ్నలు శ్రీనివాస్ అడిగితే, మరికొన్ని నేను అడిగాను. మామూలు పత్రికల్లో ఇంటర్వ్యూల్లాగా, ప్రశ్నలడిగేవారి పేర్లు పెట్టలేదు.
ఇక్కడ ఎవరు ప్రశ్న అడిగారన్నది ముఖ్యం కాదు. ప్రశ్న ఏవిటన్నదే ముఖ్యం.
శ్రీశ్రీ అమెరికా వచ్చారా? అన్నది శ్రీనివాస్ గారు అడిగితే, తదుపరి ప్రశ్న నేను అడిగింది. శ్రీశ్రీ అమెరికా ప్రయాణం గురించి నాకు వివరం తెలుసు; అదీ వేలూరి గారి ద్వారానే! ఇది సవరించమని ఈమాటకి తెలియ పరుస్తాము.
సంజీవ్ దేవుకి రంగులు తెలీయవని చెప్పాను–అన్న మాట ఆ ఎగ్జిబిషన్ సమయంలో మాటల మధ్య అన్నారు. దానిమీద అక్కడ చర్చ జరిగుండకపోవచ్చు. అందుకే అదొక్క వాక్యం వేలూరి చెప్పారు. మేమూ దాన్ని పొడిగించలేదు. అంతే.
చిత్రలేఖనం వచ్చిన అందరికీ–ముఖ్యంగా పెయింటర్స్ (Water Colors or Oils) అందరికీ రంగుల ఎంపికపై అవగాహన వుండాలని లేదు. చిత్రకళలో రంగుల ఎంపికన్నది వేరే పెద్ద టాపిక్. వేలూరి గారు Modern Art Criticism మీద అమెరికాలో కోర్సులు చేసారు. ఒక పెయింటింగ్ ఎందుకు గొప్పదీ, ఎందుక్కాదూ అన్న అంశంపై గంటల కొద్దీ మాట్లాడగలరు–ఆయన పెయింటింగ్స్ వేయకపోయినా.
ఒకానొక సందర్భంలో –బాపు గారికీ కలర్స్ ఎంపిక సరిగా వుండదని నేనే అన్నాను ఆయనతోనే, డైరెక్టుగా. ఆయన పగలబడి నవ్వి–నేను గీతాకారుణ్ణి; కలర్‌కారుణ్ణి కాదంటూ భుజం తట్టారు.
నేను అలా అన్నానని ఆయన నాపై కోపగించుకోలేదు. బొమ్మల గురించి నీకేం తెలుసూ అని నన్ను తిట్టలేదు.
ప్రతీ ఆర్టిస్టుకూ కొన్ని ప్రత్యేకతలుంటాయి. కొన్ని అంశాల్లో పట్టింపు వుండదు. సరిగ్గా సంజీవ్‌దేవు గారి విషయంలో కూడా వేలూరి గారి మాటలివే. ఆయన రంగుల ఎంపిక అద్భుతంగా వుండదు. అద్భుతంగా గీతలుంటాయి. అందులో తక్కువ చేసిందీ, కించపరిచిందీ ఏమీ లేదు. కొంతమంది కవిత్వమూ, కథలూ రెండూ రాస్తారు. మీ కథలు బావుంటాయి, కవిత్వం కన్నా–అంటే కవిత్వం రాదన్నట్లు, తక్కువ చేసినట్లు భావించడం పొరపాటు.
ఈ క్రింది వాక్యం పెట్టమని ఈమాట వారిని అడుగుతాను.
“తామర కొలనులో మందారం (Hibiscus on the Lake)”
మా ఇంటర్వ్యూలో అసంబద్ధతలు సూచించినందుకు ధన్యవాదాలు.
వేలూరి గారి అరవయ్యేళ్ళ అమెరికా జీవితంలో ఇంకా చాలా ఆశ్చర్యకరమైన, గమ్మత్తైన అంశాలు ఖచ్చితంగా ఉండే వుంటాయి (నాకు తెలుసు). ఆయనే రాయాలి లేదా మాట్లాడాలి.
మా పరిధిలో మేము ప్రశ్నలడిగాం–అంతే.
ఏవైనా తప్పులు దొర్లితే మా అవగాహనా లోపమే.
ఈ సారికి మమ్మల్ని ఒగ్గేయండి 🙂