సార్ మీరు, ఎన్ గుగీ వాథియాంగో లాంటి గొప్ప రచయితను 1996 లోనే ఇంటర్వ్యూ చేసిన తీరు అడిగిన ప్రశ్నలు చాలా లోతైన విషయాలను వెలికితీసినట్లు అనిపించింది, కెన్యా ప్రజలు వివక్షకు గురైన సంఘటనలు, బ్రిటిష్ వారు కెన్యావారిని చేసిన ఆర్ధిక దోపిడీ గురించి గుగీ వివరించిన తీరు చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఇంకా కెన్యా ప్రజలకు పూర్తి స్థాయిలో స్వాతంత్ర్యం లభించలేదు అని అనిపించింది. ఆ దేశ ప్రజలు ఎన్ని రకాలుగా హింసించబడుతున్నారో నల్ల-తెల్ల జాతీయుల మధ్య ఉన్న వ్యత్యాసం ఎలా ఉంటుందో చెప్పిన తీరు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. వివక్ష అణువు అణువు అన్ని దేశాలలో ఉన్నట్లు ఈ ఇంటర్వ్యూ ద్వారా బాగా సుస్పష్టంగా తెలుస్తుంది. ఈ ఇంటర్వ్యూని మాలాంటి పాఠకులకు అందించినందులకు మా గురువుగారైన సతీష్ చందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు !!