Dr. Siddenky తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for కొలిమి;Dr. Siddenky

In reply to .

కృతజ్ఞతలు సార్


04 June 2026 8:45 AM

Comments for కొలిమి;Dr. Siddenky

మాదిగల ఆత్మగతానుగతమైన అనుభవాన్ని అక్షరీకరిస్తూ రాసిన చిత్రం ప్రసాద్ కథ ‘పల్లేరు కాయలు.’ బాంచ గామడు మీకు నీతులు జెప్తుండా అనుకోకుండ్రి. ఎర్ర పాపిగాడు పంచాయతీ నాడు మాట వరసకు నోరుజారితే చెప్పుతో కొట్టి ఎట్ల చనిపోయిందో కేసు లేదు. పటేల్ బిడ్డకి ఏదో ఉందని ఎల్లిగాని సంపి కరెంట్ మీదికి ఎదురాయించిండ్రు. మీ మాట కాదని మొగునికి సంసారం చేసే ఆడిదేవతయ్యా ఊర్లె? లంజలేని ఊరు గుంజలేని పందిరి ఉండవ్ దొరా. అనిగిమనిగి ఉండమని మీరు. అట్లెట్ల కుదురుద్దని మేము. ఏదైనా కచ్చర్ల తెంపుకుందాం అని ప్రశ్నించిన ఆత్మవిశ్వాసమే…

ముళ్ళు ఆకు మీద పడ్డది. చినిగిన ఆకు లోకానికి కనబడ్డది. నింద మోసిన నిర్భాగ్యురాలి జీవితమే పిట్టల శ్రీనివాస్ ‘వెలి’ కథ. తాగుబోతు తండ్రి పెద్దులు. తల్లి జచ్చిన బిడ్డ జానకమ్మ. పెద్దులును వెతకడానికి సహాయపడ్డ ఎంకన్న అంటే జానకమ్మ ఇష్టమైంది. ధర్మారెడ్డి గెలుపు కోసం చీఫ్ లిక్కర్ అమ్మి జైలు పాలయిన కొడుకు మీద రందితో ఎంకన్న తల్లిదండ్రులు కాలం చేశారు. కొన్నాళ్లకు విడుదలయ్యాడు. అన్నం వండుకొని ఎంకనికి సద్ది తెస్తుంది జానకమ్మ. వెంకన్న దగ్గరికి వచ్చినపుడు బిగుతైన జాకెట్, ఎత్తయిన ఒంపు సొంపులు చూసిన ధర్మారెడ్డి కొడుకు విక్రం రెడ్డికి జానకమ్మ మీద మనసు పడ్డది.. ఒకరోజు ప్రత్యర్ధుల్ని చంపాలని పథకం వేసి సోయి తప్పేలా తాగించాడు. ఎప్పటిలా సద్ది తెచ్చిన జానకమ్మను విక్రమ్ రెడ్డి బలాత్కారం చేసి అనుభవించాడు. తల్వార్ జూపించి “ఎవ్వలకైనా చెప్పితే నీవు ఉండవు. నీ అయ్యుండడు.” అని నోరు మూయించాడు. కడుపులో బడ్డ నలుసు పెరుగుతూనే ఉంది. “ఏదో మోసం జరిగింది. నా బిడ్డ అలాంటిది కాదు” అని కులం వారితో చెప్పిన పెద్దలు మాటలు ఎవరూ లెక్క చేయలేదు. ఎంకన్న నే కడుపుకు కారణమని పుకారెళ్ళింది. అరెస్టై జైల్లోకి వెళ్లిన ఎంకన్నకు విషయం తెలిసి బాధపడ్డాడు. జైలునుంచి కేసుకు తీసుకపోయేటప్పుడు పరిగెత్తే లారీ కిందపడి చనిపోయాడు. జానకమ్మ ఎనిమిది నెలల గర్భిణి. కులం నుంచి వెలివేశారు. రందితో పెద్దులు చనిపోయాడు. కొడుకును బడిలో చేర్పించింది జానకమ్మ. బడిలో జరిగిన అవమానాన్ని జానకమ్మకు కొడుకు చెప్పగా అదే రోజు రాత్రి ఏదో మందు తాగి చచ్చిపోయింది. “నడుమంత్రపు లంజ. ఎవనికాన్నో ఈన్నికన్నది. గిప్పుడు శరం వచ్చింది” అని గుసగుసలాడిన్రు. కొడుకు ఎవరు పిలిచినా ఎవరు రాలేదు. ఒక మూల నుంచి గుడిసె అంటుకున్నది. గీ పాడు లోకంలో ఇముడలేక అగ్గి పవేషం చేసి.. గీ లోకాన్ని తనే ‘ఎలేసి’ ఇన్ని దినాలు తను దిగమింగుకున్న నిజాన్ని తనెంటే తీసుకుపోయి మసి బొగ్గలే మిగిలిన తల్లిదిక్కు చూసుకుంటా నిలబడ్డడు. లోకం పోకడ తెలవని పశిపోరడు. చేయని తప్పుకు శిక్షను అనుభవించిన జానకమ్మ కొడుకు కోసం బతికిన జానకమ్మ. నిజం చెప్పలేక చచ్చిపోయింది. నిజాలు దాచుకొని కాలగర్భంలో కలిసిన ఎంతోమంది జానకమ్మలకు ఇది ఉదాహరణ.

పై రెండు కథలను కూడా చదువ గలరు


17 May 2026 11:31 AM

Comments for Satish Chandar;Dr. Siddenky

In reply to .

Super analysis Sir


22 March 2025 8:32 PM