G K S Raja తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
పుస్తకాలపై ఉన్న శ్రద్ధ, ఆసక్తి మాత్రమే కాకుండా ప్రేమను తెలియచేసింది మీ ఇంటర్వ్యూ. ముఖ్యంగా ఆఖరి ప్రశ్నకు సమాధానం పుస్తకాల ప్రయోజనాన్ని చాటింది. కాలక్షేపానికి కాకుండా విషయ పరిజ్ఞానాన్ని పొందడానికి. అంతకంటే కూడా మూఢనమ్మకాలను వదిలి పెట్టేందుకు పుస్తకాల పఠనం ఉపయోగపడుతుంది అనే విషయాన్ని అందరూ గ్రహించాలి.
కొద్దో గొప్పో పుస్తకపఠనం పై ఆసక్తి ఉన్నవాళ్లకు మీ వ్యాసం మరింత ఉత్తేజాన్ని, స్ఫూర్తిని ఇస్తాయి. బద్ధకాన్ని, అలసత్వాన్ని వదిలించి, మంచి పుస్తకాలకై అన్వేషింపచేస్తుంది. ధన్యవాదాలు వేణు గారూ!
మత ఛాందసవాదులు నమ్మే పుక్కిటి పురాణాలలో కూడా కొన్ని సందర్భాలలో యజ్ఞ యాగాదులు నిరర్ధకమని చెప్పడాన్ని ఉదహరించడం, ద్వంద ప్రమాణం అవ్వదు అశోక్ చౌదరి గారూ! జనం సొమ్ముతో లౌకిక రాజ్యాంగం ప్రకారం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రులు ఇటువంటి యాగాలు చేస్తూ పోతే ప్రశ్నించే ఆలోచనైనా కలగడానికి ఇలాంటి వ్యాసాలు ఉపకరిస్తాయి.
రాజా.
శ్రీనివాస్ గారూ! చక్కగా విశదీకరించారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మీ కృషి అభినందనీయం. ఇంకా చెయ్యవలసిన చాలా ఉంది.
రాజా.
అబ్బా ప్రసూన గారూ! ముందు మీ వెబ్ పేజీ కలర్ ను లైట్ చెయ్యండి. చదవడం నాకు చాలా కష్టంగా ఉంది. అర్జెంటుగా చదవాల్సిన సంగతులు చాలా ఉన్నట్టున్నాయి మీ బ్లాగులో.
రాజా.
అబ్బ! మీది భలే అభిరుచి! ఎందుకంటే ఇవన్నీ నా దగ్గర ఉన్న పుస్తకాలే! ఒక్క శ్రీపాద వారిదీ తప్ప.
రాజా.
Father's day was yesterday 19th I think. For a relevant article see--
gksraja.blogspot.com