Harathi Vageeshan తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;Harathi Vageeshan

వలస వాదము , (దానికి ప్రతి గా ,దాని ప్రభావం తో పుటిన సాంస్కృతిక) జాతీయత ఆధునికత , అనే మూడు కలిసి ఆధునిక హిందూ అనే ఒక మెగా మతం పుట్టింది అని చాలా ఓపికగా ఈ వ్యాసం వివరించే ప్రయత్నం చేసింది .
పర్షియన్ లు అరబ్బులు ఒక దిక్కును, ప్రాంతాని చూపే పదం గా ,తరువాతి కాలం లో ఒక రాజకీయ పాలనాపర పద్యం గా హిందూస్తాన్ అన్న పదాన్ని బ్రిటిష్ వలస పాలన స్థిరీకరణ ముందు వరకు ఉపయోగం లో ఉన్న వాస్తవాన్ని వ్యాసం గుర్తుకు తెస్తున్నది .

ఏక రూప మతం లేక పోవడం ఈ దేశపు సమస్య , పుట్టుక పునాది కులాల( వర్ణ -జాతి ) విఘటన తో మరణ యాతన ,నిరంతర ఓటమిని చూసిన ,చూస్తున్న ఈ దేశానికి ఒక ఏక రూప మతం అవసరం అని అందరూ ఆధునికులు భావించారు . వారిలో అందరికీ హిందూ అన్న పద్యం మీద ఏకాభిప్రాయం లేదు . రామ్ మోహన్ రాయ్ తన సమాజాన్ని ఉపనిషద్ ఆధార బ్రహ్మ సమాజం అన్నారు ,సౌరాష్ట్ర బ్రహ్మణా పండితుడు దయానంద సరస్వతి తన సమాజాన్ని ఆర్య సమాజం అన్నారు , వివేకానంద ,ఆయన సమర్తకులు నవ్య అద్వైత వేదాంతం ద్వారా కొత్త మతం పుట్టించాలి అనుకున్నారు వారు కూడా హిందూ అనే పదాన్ని పోర్టయి గా మత అర్థం లో వాడ లేక పోయినారు . అరబింద ఘోష్ సనాతన వైదిక మూలాలు ,జ్ఞాన మీమాంస కలసిన మతం ఉండలి అనుకన్నారు . చ్చివారగా హిందూ మహాసభ ,సావర్కర్ లు ఏక రూప హిందూ మత నిర్మాణాన్ని ఒక రాజకీయ ప్రజక్ట్ గా ముందుకు తెచ్చినరు . ఆర్ ఎస్ ఎస్ ఆ పనినే ఇప్పటికీ చేస్తూ ఉన్నది .

బాబా సాహెబ్ కు కూడా ఈదేశానికి మానవీయ ,ధృఢ ,నైతిక కేంద్ర ఏక రోప మతం లేదు అనే ఆందోళన తపన ఉంది . మొదలు ఏదేశానికి ఒక ఏకరూప మతం ఉండింది అది బౌద్ధం అది బ్రహ్యమన సమాసి పోగొట్ట బడి దెబ్బతిని ,వర్ణ జాతి విభజన తో అమానుషం గా దేశం నాశనం అయింది ,అనుకని తిరిగి బౌద్ధ ధర్మ పురుద్ధరం ద్వారా , కుల యంత్రాలు లేని నవ బౌద్ధ ను నిర్మించాలి అని అనుకున్నారు . వేదాలకు తిరిగి వెళ్ళండి అనే ఆర్య సంజయం వారు , అఖండ హిందూ మతం ఒకటి పుట్టించాలి అనే రాజకీయ సాంస్కృతిక హిందుత్వ వాదులు ,అంబేద్కర్ వాదులు ఒకే రకం అయిన ఆందోళన తో ప్రారభ్యం అవడం ఆశ్చర్య కారం కాదు . అది వలస ఆధునికత ప్రతిఫలనం . వ్యాసం ఈ విషయాన్ని ఉపాపత్తులతో సమర్థించింది అనుకూతున్నాను

యంత్ర సంబంధ ,పెట్టుబడి ప్రధాన ,భారీ స్థాయిఉత్పత్తి తెచ్చిన వలస వాదం దానితో వచ్చిన ప్రొటెస్టెంట్ ఇతర క్రైస్తవ మత ఔన్నత్య ధోరణులు , ఆ ఆధునికత లోకి నడిచిన దేశీయ మేధో ప్రపంచాన్ని హిందూ మత సృష్టి లోకి నడిపినవి అన్న విషయం అధ్యయనం చేయాల్సిన విషయం .

ఇంత ఏక రూప మత సరుస్టి ప్రయత్నం జరుగుతున్న ఈదేశం లో ఆచార ,సంప్రదాయ , ఉపాసనా బహుళతలు నేటికీ ఉండటం ఒక వైచిత్రి . బ్రాహ్మణ కుల జీవన కేంద్రం గా సంస్కృత లిఖిత సాహిత్య ఆధారాల పునాదిగా పాశ్చాత్య పండితులు ,అట్టి పండితులను అనుసరించిన దేశీయ మేధావులు పుట్టించిన రాజకీయ సాంస్కృతి క పదం గా హిందూ మతం అని అనిపిస్తూ ఉంది వ్యాసం జాగ్రత్త గా చదివితే . ఇది ఆలోచనాత్మకం ,వివేచనాత్మకం .


07 June 2025 7:44 PM

ఈమాట;Harathi Vageeshan

భారతీయ హేతు దృష్టికి సమన్వయ లక్షణం, ద్వంద్వత — అందునా వ్యతిరేక ద్వంద్వతను పక్కన పెట్టే లక్షణం ఉంది అని నిరూపణ చేసే ప్రయత్నం వ్యాసంలో ప్రధాన అంశం.

కేవలం చార్వాక, బౌద్ధ చింతనలు మాత్రమే ఆధునిక యూరోపియన్ హేతు దృష్టికి దగ్గరివి. అవి కాని చింతనలు అన్నీ ఆధునికతకు, అంటే హేతు దృష్టికి దూరం అయినవి అనే ప్రచారంలో తర్కపద్ధతిని ఈ వ్యాసం సహేతుకంగా ప్రశ్నించింది.

వర్ణ-జాతి వ్యవస్థ అనేది పుట్టుక పునాది, ఉచ్చ నీచ సామాజిక సాంస్కృతిక వ్యవస్థగా మారిన స్థితి ఈ దేశపు పూర్తి వాస్తవం అనీ. ఈ దేశంలో బౌద్ధము, చార్వాకాలు తప్ప మరే తాత్విక భవనాలు ఈ సామాజిక సాంస్కృతిక వ్యవస్థను వ్యతిరేకించలేదు కనక అవి అన్నీ కూడా హేతువు తో సంబంధం లేనివి (వెస్ట్ సైన్స్ దృష్టి) అనే ఒక అతి సులభ సామాజిక శాస్త్ర సూత్రీకరణ మీద కూడా ఈ వ్యాసం ప్రశ్నలు లేవనెత్తినది.

వర్ణ-కుల వ్యవస్థ పుట్టుక పునాది గా మారిపోవడం, దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల దీర్ఘ చరిత్రను లోతుగా చూస్తే, శుద్ధ హేతు వాదం తో సంబంధం లేని భక్తి వాదులు, అద్వైత వాదులు కూడా పుట్టుకపునాది వివక్ష దృష్టి మీద యుద్ధం చేశారు అని తెలుస్తుంది. కేవలం చార్వాక, బౌద్ధాలు మాత్రమే హేతు వాద చింతనలు తప్ప, ఈశ్వర(దైవ) సంబంధం, ప్రకృతి పురుషుల ఏకతను ప్రతిపాదించే సాంఖ్యం, బ్రహ్మ భావనను పక్కకు పెట్టిన పూర్వ మీమాంసకుల స్వతసిద్ధ వాదాన్ని, ఈ దేశంలోని ప్రభావశీల ఆధునిక వెస్ట్రన్ కర్టీజియన్ సైన్స్ దృక్పథ వాదులు గుర్తించలేదని అనే ప్రతిపాదన కూడా వ్యాసం చేసింది.

అయితే వ్యాసకర్త రచనా పద్ధతి కొంచం గెంతులు వేస్తూ సాగుతున్నట్టు ఉంటుంది. అది రచనా పర సమస్య అనుకుంటాను. క్వాంటమ్ భౌతిక శాస్త్రము, అది దానికన్నా ముందు ఉండే భౌతిక శాస్త్రంతో ఎట్లా విభేదిస్తుంది అనే వివరణ కొంచం ఉంటే వ్యాసానికి అది మరింత పదును ఇచ్చేది అనిపిస్తుంది.

వ్యాసం రాసిన మనిషి బ్రహ్మణ కులస్తుడు, అతని కోరిక బ్రాహ్మణ తత్వ చింతనను సమర్థించడం మాత్రమే అనే తీరు విమర్శలు ఈ వ్యాసం మీద వస్తాయి. కానీ అవి పెద్దగా హేతుబద్ధం కావు — అవి కేవలం భావజాల ప్రేరిత వాదాలు.

భారతీయ చింతనా జగత్తులో పదార్థ దృష్టి, హేతు దృష్టి ఉండిన తీరును చూపే ఒకానొక ప్రయత్నంగా ఈ వ్యాసాన్ని చూడాలి. ఆ ప్రతిపాదనలోని గుణదోషాలను విచారించాలి.

హేతు చింతన అంటే ఏమిటి? అనే మౌలిక ప్రశ్నను మరొకసారి ఈ వ్యాసం చర్చలోకి తెచ్చింది. ఇది బాగా ఆలోచింపజేసే వ్యాసం.


04 June 2025 2:58 PM