Kumara Varma తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for Vasanthamegham;Kumara Varma

పరుగు నవల అంతరంగాన్ని పట్టించింది మీ పరిచయం. ఇందులో ఈ మాట నీళ్లు తగ్గిన మొక్కలా ఆప్యాయత తగ్గిన బంధాలు నెమ్మదిగా పొడిబారిపోతాయి గుండెకు కరుక్కుమని తగిలింది. మనుషులు మధ్యలో ఎండిపోతున్న మానవ సంబంధాలకు ముఖ్య కారణం పరుగు వంటి జీవితం. ఆ జీవితం వైపు మనల్ని నెట్టి వేస్తున్నది అసమ అభివృద్ధి నమూనాతో సాగుతున్న కార్పొరేట్ దళారీ పెట్టుబడి. ఇది కదా కారణం. మనిషిని మనిషిగా కాక సరుకుగా పనిముట్టుగా చూసే పెట్టుబడి వ్యవస్థలో ఉన్నాం. ఇది మారకుండా ఈ పరుగు జీవితం మారదు. అభినందనలు ఉదయ్. చాలా లోతైన విశ్లేషణ మంచి వాక్యం నిర్మాణంతో అందించారు. 💐


02 December 2025 9:44 AM