Manasa Chamarthi తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Chaalaa chaalaa baagundandi, thanks for writing this 🙏🙏
HI Jyotirmayi garoo..very happy to hear from you...(feels like a nice continuation to the call over the weekend with all blogger friends) - please keep in touch
and thank you again !
- Lots of love,
Manasa
వేణూ గారూ...Thank you sooo much!
:)) అయ్యో..ఇంతా-అంతా టెన్షనా అసలు...:))
Thank you so much for the wishes, Murali gaaroo..! నిజం...ఇది రాస్తూ ఆ రోజుల గురించి తల్చుకుంటుంటే ఇట్లాంటి స్నేహాలే లేకపోతే జీవితం ఎంత నిస్సారంగా ఉండేదో కదా అనిపించింది.
ఉత్సాహమూ, భరోసా - నిజం. ఈ రెండూ కలిసి ఉండే తావులు స్వర్గాలు.
ఇది చదివే ఇక కుదురుగా ఉండలేకపోయాను...రెహ్మాన్...థాంక్యూ సో మచ్! సౌమ్యా కి కూడా..
సారంగలో మిస్ అయ్యానే!
మొదటిసారి చదువుతున్నంతసేపూ స్పష్టంగా అర్థం కాలేదు, ఆఖరు పాదంతో అందం తెలిసింది.
"ఈ చీకటి నీటిగుంతలో
ఏ చిన్నారి విడిచిన కాగితపు పడవలో ఈ తారలు" క్యాబాత్! చాలా బాగుందిది.
"విసిరేసిన పులి విస్తట్లో" - చీకటి ఉండద్దూ మధ్యలో?!మిగిలిన వాక్యాలూ చూడండోసారి..చుక్కల పుల్లలూ, జాబిలి ముద్దా అన్నారు.
కొట్టుకుపోయిన కొత్త తార్రోడ్డు పాదం బాగుంది, చక్కగా కుదిరింది. "కుంభకోణం" పాదం కాసింత అసంతృప్తిగానే ఉంది. మళ్ళీ చదివితే ఇంకేదైనా భావం తడుతుందేమో చూడాలి.
అభినందనలూ, ధన్యవాదాలు.
బోనగిరి గారూ, శ్రీకాంత్‌గారూ..ఇద్దరికీ కృతజ్ఞతలు..నాకు తెలియదీ విషయం :)
ఎంత మంచి ట్రిప్ నిజంగా! చాలా బాగా వ్రాశారు మీరు. మా నాన్నగారితో కలిసి చాలా కాలం క్రితం ఇదే వరుసలో పంచారామాలన్నీ తిరిగి వచ్చిన నాటి విశేషాలన్నీ నాకూ గుర్తొచ్చాయి.
పంచారామాల్లో గునుపూడి వ్రాశారు..భీమవరం వ్రాయలేదు..భీమవరం ఉండాలి కదా? నే పొరబడ్డానా?
సముద్రం గురించి భలేగా వ్రాశారండీ..ఎన్ని వర్ణనలు చదివినా నిజాయితీగా ఉన్నదున్నట్టుగా వ్రాసిన ప్రతీ వర్ణనా నాకు ముచ్చటగానే ఉంటుంది. మళ్ళీ ఓసారి అలల తడి పాదాల కంటిచుకున్నట్టు...చిత్రమైన అనుభూతి. ఓపిగ్గా వివరంగా వ్రాస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
పచ్చని పల్లెల అందాలన్నీ ఒక్కమాటలో చెప్పేశారండి. ఆహ్లదకరమైన వర్ణ. చదువుతుంటే గోదారి గాలి తగిలినట్టైంది. బిక్కవోలు పేరే వినలేదు నేనెప్పుడూ, ఇప్పుడే వినడం. ఈసారి అటుగా వెళితే చూసే ప్రయత్నం చేస్తాను.
గణపయ్య ఎంత బొద్దుగా ఉంటే అంత అందం --:)))I agree, He is the cutest God ever :D
పంచారామాల్లో రెండు చూసినట్టున్నారే! పిఠాపురంలో అమ్మవారి గుడి కదూ? గొల్లలమామిదాడ తీశేశానన్నారు. అసలక్కడ ఏముంటుంది? ఏవైనా గుడులా? లెదంటే ఊరు బాగుంటుందా?
:)))))))))))))))))))))))))
This laugh is not just for the laugh but for the message you have put for this comment box!
Boy, you are awesome. and I am only glad that I am senior :p (at college)
Good luck for your literary career.
నాకు ఇష్టమైన సుశీల గారి వందల పాటల్లో ఇదీ ఒకటి. పాట గురించి మీ వ్యాఖ్యానం వెదికి, దొరక్క చాలా నిరాశపడిపోయాను. రాయాల్సింది కదా!
ఈ సైట్‌లో మేము చూడాలనుకునేది కేవలం సాహిత్యం మాత్రమే కాదు, దానికి సంబంధించిన కొన్ని మంచి వివరాలో, లేదా...అది మీలో కలుగజేసిన స్పందనో....
ghantasala gaari meeda chadavdam happy gaa anipinchindi..inkonni songs add chesi undalsindi...inkaa ekkuvaga ee post ni enjoy cheyyagalige vallam