NARASIMHA RAO ADDEPALLI తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for కొలిమి;NARASIMHA RAO ADDEPALLI

కొలిమి లో మీ వ్యాసం చదివాను.దళిత సాహిత్య చరిత్ర ను వెలికి తీసే మీ ప్రయత్నం అభినందనీయం. అయితే.. యే భావజాలానికి అయినా కొత్త పదజాలం పుట్టుకొస్తుంది. వాటి తో పాటు పాత పదాల అర్థాలను వివరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాగే చారిత్రక పరిణామాలను విశ్లేశించే బాధ్యత కూడా ఏర్పడుతుందని మీకు తెలుసు.ఆ విషయం లో మీరు ఉన్నత ప్రమాణాలు పాటించేందుకు సకల ప్రయత్నాలు చేయాలని, అలా చేసినప్పుడు మీ వ్యాసాలు మరింత ప్రామాణికత సంతరిం చుకుంటాయి అనీ మీకు తెలుసు.భావోద్వేగాలు, భావజాలాల కంటే పరిశోధనే మీకు పనికి వచ్చే పనిముట్టు కాగలుగుతుంది. ఇప్పటికే ఆ ప్రయాణం లో ఉన్న మీరు మరింత ముందుకు సాగగలరనే విశ్వాసా న్ని మీ వ్యాసాలు కలిగిస్తున్నాయి.


11 May 2026 4:02 AM