Parvateesamvepa తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
చాలా సంతోషం అండీ.. శ్రీ పట్వర్ధన్ గారి శతావధాని మునకు తప్పక వస్తానండీ.అనేక అభినందనలండీ.ధన్యవాదములు.వందనములండీ శ్రీ చింతా.రామకృష్ణారావు గారూ
బహువిధ ఛందములలో మీ భవ్యమైన పద్య రచనలకు శతకం రచనలకూ,చిత్ర,బంధ పద్య కవనాలలో అతులిత పాండితీ ప్రకర్షలకూ మీకు అనేకానేక అభినందనలండీ శ్రీ చింతా.రామకృష్ణారావు గారూ.
వందనములండీ.
కలియుగారంభకాలానికి అనగా జనమేజయుని కాలానికి అఖండ భారతములో గల భాగములు చాలా వరకూ బర్మా,నేపాల్,భూటాన్ లు భారత దేశంలోని భాగాలు అని బాగా వివరించారండీ.
త్రివిష్ఠపపురం అనగా నేటి టిబెట్టు ఆవిర్భావాన్ని బాగా వివరించేరు. అతను ఒక కురు వంశజరాజని తెలిపేరు.
అలాగే 15వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యానికి టిబెట్టు సామంత రాజ్యమగుటను తెలిపేరు.
మానససరోవరము,కైలాసము వంటి పేరుగల త్రివిష్టపము మన భారతదేశానికి చెందినది కాదనుకుంటే హాస్యాస్పదమని బాగా వివరించారు.
ఆంగ్లేయుల పాలనలో 1824నుండి 1937 వరకూ
బర్మా
ఆంగ్లేయుల పాలనలో
భారత్ లో భాగమే.
బర్మా వైశాల్యము,వారు కట్టే పన్ను శాతమును బాగా వివరించారు.
బర్మా విడిపోవుటచే భారత దేశం యెంతో భూమిని కోల్పోయిన వివరాలందించేరు.బ్రిటిష్ వారే బర్మాను భారత్ నుండి విడదీసేరు. అప్పటి బాడా నేతలెవరూ దీనిని ప్రతిఘటించలేదు. నిజానికి బర్మా పౌరులలో అత్యధికకులు యీ విభజనకు వ్యతిరేకమని 1932 లో జరిగిన అభిప్రాయ సేకరణ ఎన్నికలలో ANTISEPARATION LEAGUE 47 స్థానాలు గెలువగా, SEPARATION LEAGUE 29 స్థానాలను మాత్రమే గెలుచుకొని డం
గురించి బాగా వివరించారు.
బర్మాకు ఆంధ్రులకు గల అనుబంధం గురించి కూడా బాగా తెలిపేరు.
ఒకప్పుడు బ్రహ్మదేశమను నామము గలదే తర్వాత బర్మా గా మారింది.
బుద్ధునికి పూర్వము 700 సంవత్సరాలకు ముందే ఆంధ్రులు వ్యాపారం కోసం బర్మా వెళ్ళేవారు అని వివరించారు.చివరికి 1937లో బర్మా భారత్ నుండి విడగొట్ట బడిందని తెలిపారు.
అలాగే సింహళము ఒకప్పుడు హిందూ సామ్రాజ్యంలోని భాగమనీ
అక్కడ తెలుగు వారు బాగా యెక్కువగా ఉండేవారనీ వివరించేరు.
మొదటి తెలుగు వ్యాకరణం వ్రాసినది రావణుడే అని ఉన్న ఐతిహ్యం గురించి తెలిపేరు.
ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
సిరిమావో భండారు నాయికే,
విక్రమ్ సింఘేమొదలగు వారు తెలుగు వారేనని చెప్పి ఆశ్చర్యం కలిగించేరు.
మలేషియాలో.. అధికంగా ఉండే శ్రీ గంధమును చెట్లపైనుండి వచ్చే గారినే మలయానిలమంటారని చెప్పి ఆశ్చర్యం కలిగించేరు.
మాల్దీవులు గురించి చాలా బాగా వివరించారు..
12వ శతాబ్దంలో బౌద్ధ దేశమైన మాల్దీవులను ముస్లిం ముష్కరులు ఆక్రమించిన వైనం తెలిపారు.
1796లోబ్రిటిష్ వారు దానిని ఆక్రమించి 1965లో స్వాతంత్ర్యం యివ్వడం గురించి వివరించారు.
ఆనాటి అఖండ భారత వైశాల్యం
27,48,115 చ.మైళ్ళు అనీ,
నేటి భారతంలో ఉన్న భూమి
13,00,000 చ.మైళ్ళు అనీ
బంగ్లాదేశ్,మయన్మార్, శ్రీ లంక, మాల్దీవులు, పాకిస్థాన్ బాంగ్లా కలిపినది,ఆఫ్ఘానిస్థాన్,నేపాల్,
భూటాన్,త్రివిష్టుప్ లు మనదేశనుంచి విడగొట్ట బడటం వల్ల ఆ 13,00,000 చదరపు మైళ్ళు
మాత్రమే మిగిలిందనీ
అంటే దాదాపు 14,48,115 చదరపు మైళ్ళు భూమి మన అఖండభారత్ నుండి విడగొట్టబడి మనదేశం నష్ట పోయిందని లెక్కలతో పక్కాగా నిరూపించారు.
అమోఘమైన వివరాలను అందించే రండీ రామమోహన రావు గారూ.
ఇప్పటికీ యధేచ్చగా జరుగుతున్న
మీతో మార్పిడులను గురించి, వాల్మీకి మహర్షి పేరును ఓ సినిమాలో విలన్ కి పేరుగా పెట్టడం గురించి తెలిపేరు. తమిళనాడు లో హైందవ వ్యతిరేక ద్రవిడ ఉద్యమం గురించి చాలా సత్యాలను తెలిపారు.
మన దేశానికి జరిగిన అన్యాయాలను,జరిపిన వారి గురించి యెంతో సవివరంగా చాలా పెద్ద వ్యాసాన్ని రచించే రండీ
రామ మోహన రావు గారూ.
మీరు ఎంతో శ్రమపడి రచించేరో...ఊహకందని విషయం. మన దేశం చరిత్రను గురించి మీరు కలుగ జేస్తున్న జాగృతి యెంతో ప్రత్యేకమైనది.చాలా విశిష్టత గలది.
మీకు మీరే సాటి.. మీ అద్భుతమైన దేశభక్తికీ,సహృదయతకూ
వేవేల అభినందనలండీ రామ మోహన రావు గారూ.
వందనములండీ 🌹🙏🙏🙏🌹
హరి అను పదమునకు గల బహువిధ అర్ధములను ఆధారముగా గొప్ప శబ్ద చమత్కృతులతో
మీరు చేసిన రమణీయమైన స్త్రీ వర్ణన చాలా చాలా మనోహరమైనదండీ రామ మోహన రావు గారూ... మీకు అనేకానేక అభినందనలండీ 🌹🌹🙏