Pavan Kumar Reddy Rendeddula తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
స్టేజ్ మీద ఒకరో ఇద్దరో ఉంటారేమో అప్పుడు బోనగిరి గారు.
కనీసం మీరైనా మెచ్చుకొని కవి భీభత్స తో సత్కరించినందుకు ధన్యవాదాలు శర్మ గారు.
అవునండి లలిత గారు, ఏడాదిన్నర్ర అయిపోయింది ఇటు వైపు వచ్చి. కొన్ని టార్గెట్స్ రీచ్ అయ్యేంతవరకు ఈ బ్లాగింగ్ పక్కన పెట్టానండి. మళ్ళీ కొత్త టార్గెట్స్ పెట్టుకునే వరకు బ్లాగింగ్ దాడి కొనసాగించడమే.

చదివి ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు.
గత 6 నెలల సమాచారాన్ని గత పదేళ్ళ సమాచారంతో మిక్స్ చేయడం వచ్చిన తిప్పలివి జిలేబి గారూ.
IT ఫీల్డ్ కదండీ ఎప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్ తలకెత్తుకోవాల్సి వస్తుందో తెలీదు, ఈ సంవత్సరం ఒక దిక్కు మాలిన ప్రాజెక్ట్ లో పడటం వల్ల పది నిమిషాలు కూడా తీరిక చిక్కట్లేదు పైగా IT ఫీల్డ్ లో up to date ఉండాలి, లేదంటే చెల్లని నాణెం లా మిగిలిపోతాం కాబట్టి కాస్త ఫోకస్ అటు వైపు పెట్టడం కూడా ఈ విరామానికి కారణం మేష్టారు.

యూట్యూబ్ పుణ్యమా అని కృష్ణ గారి సినిమాలు ఓ 250 పైగానే చూశాను, నాకు తెలిసి వారి
డబల్ నమస్కారం, ఇద్దరు తాతలు కాబట్టి
బాగుంది మీ ఆవేదన శ్యామలీయం గారు.

ముసలి హీరోల సినిమాలు థియేటర్ కి వెళ్ళి చూడటం మానేశాను. క్రికెట్/స్పోర్ట్స్ చూడటం మానేసి పదేళ్ళు దాటిపోయింది, ఆడటం బెస్ట్ అని తెలుసుకున్నా చూసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే. ఇక రాజకీయాలకు ఆమడ దూరం.
ఈరయ్య గురించి రాయడానికేమీ లేదిక కాంత్ గారూ, దుకాణం సర్దేసుకోవాల్సిన సమయం దగ్గర పడింది. నాకు తెలిసి ఈరయ్య క్రేజ్ బాబయ్య కంటే తగ్గినట్లే అనిపిస్తోంది గత రెండు సినిమాలు చూస్తే.
ఇది మా చీరయ్య కి కూడా వర్తిస్తుంది కాంత్ గారు.
అంతా మీ అభిమానం మేష్టారు.

స్కూల్ సమ్మర్ హాలిడేస్ కదా, ఒక పది రోజుల ట్రిప్ వెళ్లివచ్చాం అలా ఒక రెండు రాష్ట్రాలు చుట్టొద్దామని. ఇక మిగిలిన రోజులు పిల్లలతో టెన్నిస్, స్మిమ్మింగ్ అంటూ బిజీ బిజీ గా గడిచిపోతున్నాయి.

అదీ మన మాస్ కున్న పవర్ అని మన హీరోలు మీసం మెలేస్తారుగా ఈ విషయాలని చూపి
అందుకేగా వాళ్ళ బ్లడ్డూ బ్రీడ్ వేరనేది బోనగిరి గారు
చాలా మంచి పోస్ట్ రాశారు. 'దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి' అనేది నాకు ఇష్టమైన పాటల్లో ఒకటి.
మరో మంచి పోస్ట్ మీ నుంచి గోపి గారు.
కంగ్రాట్స్ హనుమంత రావు గారు. మరిన్ని సంవత్సరాలు రాస్తూ ఉంటారని ఆశిస్తున్నాను
రెడ్డి గారు అనో, పవన్ అనో, ఒరేయ్ అనో పిలిచినా పర్లేదండి. మీ ఫ్రెండ్ నే అనుకోండి.
బాగున్నాయ్ శ్రీ గారూ, మీ చిన్నప్పటి గడ్డివామి విశేషాలు. మంత్రాల విషయం లో మీరన్నది అక్షరాలా నిజం.