Raja Mukhtavaram తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఈమాట స్టాండర్డ్స్ బాగా తగ్గుతున్నాయి , ఓ రెండు మూడు నెల్ల క్రితం దాకా ఎడిటోరియల్స్ చాలా సూటిగా వివరణాత్మకంగా ఉండేవి . ఇప్పుడు పాంప్లెట్ సాహిత్యంలా వుంది . ఈ మాట ఒక్కటే కొంచెం చదివించదగ్గ పత్రిక అని ఒక ఓదార్పు ఉండేది . అది నెమ్మదిగా నశిస్తోంది .
ఈ కథ మరీ ప్రత్యేకంగా అక్కడక్కడా తీసుకొచ్చి రాసిన వాక్యాల బొంత లాగావుంది .
– “అతను’ అనేది వట్టి గొడవ ఆపేవాడు మాత్రమే కాదు. ఎవరో ఒకరి అవమానాన్ని ఒక్క క్షణం ఆపేవాడు కూడా.” ఏమిటండీ ఈ వాక్య నిర్మాణం . రచయిత సంగతి సరే, ఇంకెవ్వరూ కథ ఎలా రాసారో చూడరా . ఎలా రాస్తే అలా వేసేసుకుంటారా?
– “సార్త్రే వాక్యం గుర్తొచ్చింది, – మనం చేసిన చర్యలే మనం.” మధ్యలో సార్త్రే ఎందుకు? ఇలాంటి ఏమాత్రం పసలేని కథలో కొటేషన్స్ పెట్టి చదివేవాణ్ణి ఇంప్రెస్ చెయ్యాలన్న ప్రయత్నంలా వుంది .
అసలు ఏంటండీ ఆ అనువాదం , ‘We are Our Actions’ అన్నదానికి చేసిన అనువాదం అనుకుంటా .
మనమేమిటో మన చేతలు చెప్తాయి – అని రాయొచ్చుగా.
మన తెలుగు అనువాదకులు చేసే అనువాదాల కంటే ఘోరంగా వుంది రచయిత గారి అనువాదం . ఇంతకంటే చెప్పగలిగింది ఏమీ లేదు .
దయచేసి – మీరు పత్రిక పాఠకుల కోసం నడుపుతున్నారని గమనించ ప్రార్థన.