Raja chandra తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
మేము కాశీ కి ఈ సంవత్సరం మార్చి లో మరియు మే నెలల్లో వెళ్ళాం. ఒక సారి కాశీ నుండి గంగ నీళ్ళు తీసుకు వచ్చి రామేశ్వరం లో శివయ్యకు అభిషేకం చేసి అక్కడి నుండి ఇసుక తీసుకొని వెళ్లి మళ్ళీ కాశీ లో గంగ లో కలిపి సంపూర్ణ కాశీ యాత్ర చేశాం.
కాశీ లో మేము రెండు సార్లు మంగళ హారతి లో మరియు ఒక సారి సప్త ఋషి హారతి లో పాల్గొన్నాం. ఇవి ఒక నెల ముందు గానే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం. మంగళ హారతి ఉదయం 3 నుండి 4 గంటల వరకు ఉంటుంది. స్పర్శ దర్శనం లభిస్తుంది. సప్త ఋషి హారతి సాయంత్రం 0645 PM నుండి 0815 PM వరకు ఉంటుంది. స్పర్శ దర్శనం ఉండదు. అయితే మంగళ హారతి కి టిక్కెట్లు ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు. జనం చాలా ఉంటుంది. మార్చి లో వెళ్ళినప్పుడు 30 మాత్రమే ఇచ్చారు. మే లో 90 ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఎక్కువే ఇస్తున్నట్లు ఉన్నారు. స్పర్శ దర్శనం కావాలి అంటే మంగళ హారతి బుక్ చేసుకోండి. ప్రశాంతంగా ఉండాలి, స్వామి వారి కి దగ్గర లో ఉండి హారతి లో పాల్గొనాలి అంటే సప్త ఋషి హారతి బుక్ చేసుకోండి. కేవలం 5 టిక్కెట్ లు మాత్రమే ఆన్లైన్ లో విడుదల చేస్తారు. కాబట్టి జనం తక్కువ ఉంటారు. ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వారి తో పాటు ప్రోటోకాల్ ద్వారా టికెట్స్ పొందిన వారు కూడా ఉంటారు. రాత్రి sringara హారతి కూడా బుక్ చేసుకున్నాం కానీ వెళ్ళడం వీలు కాలేదు. హారతి timings.
0300AM to 0400 AM మంగళ హారతి.
1115 to 1220 Mid day Bhog Aarti
0645 PM to 0815 PM సప్త ఋషి హారతి
0900 PM to 1015 PM sringar/ Bhog Aarti
మంగళ హారతి టికెట్ లు నెల రోజుల ముందు అర్ధ రాత్రి 12 గంటలకు విడుదల చేస్తారు. మిగతా టికెట్స్ నెల రోజుల ముందు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. టైమింగ్స్. మారవచ్చు. Website check చేసుకోండి.
Website. shrikashivishwanth.org
G SHANKAR GOUD
Hyderabad
రాజా చంద్ర గారు శుభోదయం
మేము కుటుంబ సభ్యులం గోకర్ణ ట్రిప్ వెళ్ళాం. మీరు మన app లో post చేసిన విధంగా హుబ్లీ నుండి ట్రిప్ ప్లాన్ చేసి వెళ్ళాం. హైదారాబాద్ నుండి 3.10.2025 సాయంత్రం 0350 కి హుబ్లీ ట్రైన్ ఎక్కాం. హుబ్లీ లో ఉదయం 6 గంటలకు దిగాం. అక్కడి నుండి కారు లో వెళ్ళాం. ముందుగానే కారు 5 రోజులకు బుక్ చేసుకున్నాం. గోకర్ణ లో ఓం ఇంటర్నేషనల్ హోటల్ లో 2 రూమ్స్ తీసుకున్నాం. MakeMyTrip లో 7600 పడింది ఒక రోజు కు రెండు రూమ్లకు. హోటల్ చాలా బావుంది. ఉడిపి లో మా డిపార్ట్మెంట్ inspection quarters 3 రోజులకు బుక్ చేసుకున్నాం. మేము గోకర్ణ, iduganji గణపతి ఆలయం, మురుడేశ్వర ఆలయం, మూకాంబిక ఆలయం, ఉడిపి శ్రీ కృష్ణ ఆలయం, ధర్మస్థల మంజునాథ ఆలయం, కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం, శృంగేరి శారదా మాత దర్శనం అలాగే Honavar back వాటర్స్ లో mangrove forests, jog falls కూడా వెళ్ళాం. గోకర్ణ మరియు ఉడిపి లో బీచెస్ చూసాం. ట్రిప్ చాలా బాగా జరిగింది. 8.10.2025 నాడు రాత్రి హుబ్లీ నుండి sampark క్రాంతి train 0825బయలు దేరి హైదారాబాద్ 9.10.2025 ఉదయం 800 గంటలకు చేరుకున్నాం.
మా కారు డ్రైవర్ చాలా మంచి వాడు. చాలా ఓపికగా అన్నీ చూపించాడు. మీరు యాప్ లో పోస్ట్ చేసిన దానికంటే కొంచెం మార్చి నాకు ఒక ట్రిప్ ప్లాన్ ఇచ్చాడు. దానిని పోస్ట్ చేస్తున్నాను. వేరే వాళ్ళకు ఉపయోగ పడుతుంది. మేము ముందుగ బుక్ చేసుకున్న ప్లాన్ ప్రకారం వెళ్ళడం వలన horanadu అన్నపూర్ణ అమ్మ వారి దర్శనం చేసుకోలేక పోయాం. అతని ప్లాన్ ప్రకారం అయితే అయ్యేది. కానీ మాకు ఉడిపి లో 3 రోజులు రూమ్ బుక్ అయి ఉండటం వలన మా ప్లాన్ ప్రకారం వెళ్ళాం.
అతను ఇచ్చిన టూర్ ప్లాన్
Hubli-sringeri-horanadu-dharmasthala-durgaparameshwari kattil-udupi- kollur-murudeshwar-idagunji-honavar-jog falls-gokarna- vibhuti falls-yana caves- gante Ganesh yellappura- Hubli
ధన్యవాదాలు
G SHANKAR GOUD Hyderabad 🙏🙏