Shailendra Dasari తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;Shailendra Dasari

ఒక మనిషి జీవితంలో అత్యంత మధురమైనది బాల్యం. పట్నాలలోకన్నా పల్లెటూళ్ళల్లో బాల్యం మరింత మధురంగా ఉంటుంది. దాన్ని రచయిత ఆవిష్కరించిన తీరు ఎంతో ప్రశంసనీయం. ఇతివృత్తం ఒక పల్లెటూరిలోని చిన్నపిల్లల ఆటపాటలే అయినా ఆ వినోదంలో అంతర్లీనంగా ఉన్న విషాదాన్ని రచయిత స్పృశించిన తీరు చాలా హృద్యంగా ఉంది. అలాగే పల్లెలలో అగుపించే వర్ణవివక్ష, దుర్భరమైన పేదరికం – ఈ రెంటినీ అధిగమించి సాగే నిష్కల్మష బాల్యస్నేహాలు రచయిత కళ్లకు కట్టినట్టుగా వర్ణించారు. గూనోడి జీవితం అర్ధంతరంగా ముగియటం పెనువిషాదమే కాదు; అదొక కఠోర సత్యం. ఒక మంచి కథ అందించిన సంపాదకవర్గానికి, రచయిత మునిగోపాల్ గారికి అభినందనలు.


11 January 2026 3:22 PM

ఈమాట;Shailendra Dasari

శ్రీనివాస త్రయానికి స్వాగతం.వారిలో ఇద్దరు శ్రీ ల తో నాకు ప్రత్యక్ష పరిచయం ఉంది.


11 January 2026 2:39 PM

ఈమాట;Shailendra Dasari

సంపాదకీయం చాలా సూటిగా, నిర్ద్వంద్వంగా ఉంది. చారిత్రక శాస్త్రజ్ఞులకు, మేధావులకు ఒక హెచ్చరిక లాంటి సూచన, సరైన సందర్భంలో. అభినందనలు.


11 January 2026 2:32 PM