Sri[dharAni]tha తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
అక్షరాలు చాలు వర్ణమాల నుండి తుంచి
అలవోకగా భావాల దారం పై అల్లుకుని
సునాయాసంగా కావ్యమాలికను పేర్చి
అనునిత్యం ఆబాలగోపాలం అలరించి
దాదాపుగా నెల రెండు దాటే గదా
కుషలమా అని అడగ మాట రాక
మౌనంగా అక్షరాల పూలతోనే పలకగా
పద్మ గారు క్షేమమనే తలుచును గాక
~శ్రీత ధరణి
ఆవేదన అంచున ఉన్నా చెదరనీయకు చిరునవ్వు
ఆవేశాన్ని ఆలోచనతో అణగద్రొక్కు
రేపటి రోజు సదా దైవాధీనమే
నేటి రోజు సైతం కాలక్రమమే
ఏడిస్తే తిరిగి రావేవి దూరం ఐనవి
కనురెప్పల అలికిడికి చెదిరిపోవు ఆశలనేవి
అయ్యెవి ఔతూనే ఉంటాయి
కాదనటానికి మన ప్రమేయం ఎంత మాత్రం
రాగద్వేషాల నడుమ ఉక్కిరి బిక్కిరి జీవితాన
గందరగోళమైన మనసు సంద్రాన అలలు చాన
తెప్ప ఒడ్డు చేరే దాక పయనం
ఎదురు చూస్తున్న నయనం
~శ్రీత ధరణి
బ్రతుకే మూణ్ణాల్ల ముచ్చట.. బాల్యం తెలియకుండ ఎగిరిపోయే.. యవ్వనం ఆస్వాదించే లోపే ఎగిరిపోయే.. వృద్ధాప్యం ఏ క్షణాన మిణుక్కు మంటుందో ఏ క్షణాన తుస్సు మంటుందో తెలియని వైనం.. మరి మిగిలింది వయస్కం ఆయస్కాంతం తొలినాళ్ళలో నీరసం మలినాళ్ళలో.. కొద్దో గొప్పో మిగిలిన కాలం పిల్ల జెల్లతో బరువు బాధ్యతలతో పితలాటకం
~శ్రీ~
మానసిక ప్రశాంతత అది బంధం తోనే
ధనం కేవలం జీవితానికి ఆలంబన
ఆయువు అంతంత మాత్రమే
చావు సమీపించాక ఆరడుగుల స్థలం
రెప్ప పాటు కాలం నవ్వులందులోనే
హాస్య రసం తో పాటు వైవిద్యం
ఔనా ఆచార్య.. వైజాగాపటం తో నా అనుబంధం ముప్పై రెండేళ్ళు.. బాల్యం, కౌమార్యం అంతా కంచరపాలెం, ఏడుమెట్ల మర్రిపాలెం, రామ్మూర్తి పంతులు పేట, శ్రీవిజఙయనగర్ లలో, ఆపై నా పుట్టూరు (నేను పుట్టిన ఊరు) ఒకే ఒక రాయి అనగ ఏకశిలనగరం అనబడే ఓరుగల్లు లో నక్కలగుట్ట, సుబేదారి, అదాలత్, హంటర్ రోడ్ నలుదిక్కులైన హనుమకొండ.
ఎవరో అనట్టు భారతీయ వైజ్ఞానిక సంపత్తినే కొద్దోగొప్పో విదేశియులు అపటి కాలంలో తస్కరించో సానపెట్టో, ఋజువు చెసో క్రెడిట్ మాత్రం వారికే దక్కేలా చెసి ఉంటారా.. మీ టపా బాగుంది. కణ మహర్షి, చరక, సుశ్రుత, ఆర్యభట్ట, భాస్కర, రమన్, కురియన్ వర్ఘీస్, సుందర్ లాల్ బహుగుణ, సలీమలి, సత్యేంద్రనాథ్ బోస్, జగదీష్ చంద్ర బోస్ ఇత్యాది.
చాలా చక్కగా శెలవిచ్చారు, బులుసు ఆచార్య.. మీ మాటలు ఎపుడూ శిరోధార్యమే..