Vanitavanivedika.blogspot.com తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఒకే తల్లితండ్రులకు పుట్టిన అన్నదమ్ములకు ఒకే తల్లితండ్రులకు పుట్టిన అక్కచెల్లెళ్లను ఇచ్చి వివాహం చేయరాదని శాస్త్రంలో చెప్పారో లేదో నాకు తెలియదు గానీ, ఇలా చేయరాదని లోక నానుడి ఉంది. పెద్దలు దీనిని ఒప్పుకోరు.
ఇక రామాయణంలో ఈ వివాహ విషయం పరిశీలిస్తే - జనకుడు తనకి లభించిన కూతురు సీతను, దశరధుడు కౌసల్యల సంతానమైన రాముడికి,
తన సంతానమైన ఊర్మిళను సుమిత్రకు పుట్టిన లక్ష్మణుడికి,
తమ్ముడు కూతుళ్లు అయిన మాండవిని కైక కొడుకు భరతుడికి, శ్రుతకీర్తిని సుమిత్ర కొడుకు అయిన శత్రుఘ్నుడుకు ఇచ్చి వివాహం చేశారు.
గమనించండి, ఇక్కడ ఒకే తల్లితండ్రులకు పుట్టినవారిని ఒకే తల్లితండ్రులకు పుట్టినటువంటి పిల్లల్ని ఇవ్వలేదు. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీరు అన్నదమ్ములైనా వారి తల్లులు వేరు. తల్లులు తేడా వలన జనక మహారాజు తన కూతురును, తమ్ముడు బిడ్డలను ఆ అన్నదమ్ములకు ఇచ్చి వివాహం చేసెను. ఇక్కడ లోక విరుద్ధమైన పని ఏదీ లేదు, ఉండదు.