నేను సీఎం పదవి కి సిద్ధం అని చెప్పడం ఏంటి ??? ఇదేం స్పీచ్ . కె ఏ పాల్ స్పీచ్ అయినా వినగలను కానీ పవన్ స్పీచ్ వినలేను , ఎదో disconnection , డిటాచ్మెంట్ ఉంటుంది, తనకి తానూ ఒక దేవ దూత , రక్షకుడు , నీతి నిజాయితీ లు అణువణువునా నింపుకున్న ఒక నాయకుడు అని తన ప్రగాఢ విశ్వాసం , నమ్మకం . తన బిహేవియర్ లో "నేను కాబట్టి ", "నేను మాత్రమే " లాంటి ఆధిక్యత కనిపిస్తుంది నాకు , సినిమాలలో కూడా ఆ డైలాగు లు ఉంటాయి . ఎదో పీఠాధిపతి లా ఉంటుంది ప్రవర్తన ఒక్కోసారి .
ఎదో పర్సనల్ ప్రాబ్లెమ్ ఉంది జగన్ తో , ( ప్రజా రాజ్యం పోవడానికి వాళ్ళే కారణం అని తన కోపం ఏమో ). ఒక్కసారి కూడా కుర్చీ ఎక్కని జగన్ ని విమర్శించి, బాబు ని సపోర్ట్ చేయడం ఏంటో అర్ధం కాలేదు . నేను ఎదో జగన్ అభిమాని అనుకుంటారేమో కాదు, జగన్ పార్టీ కాదు అని బాబు అకౌంట్ లోకి తోయద్దు, బాబు ఫ్యాన్ కూడా కాదు , ఒకటే కులం అయినా పవన్ ఫ్యాన్ అస్సలు కాదు .
నిజాయితీ పరుడే , అందులో సందేహం లేదు , కానీ అదొక్కటే సరిపోదు , 8 వ తరగతి చదివిన లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు చేసే రాజకీయం కూడా చేయడం లేదు . మేధావితనం ఉంటె అది సలహాదారు లా పని చేయడానికి ఉపయోగపడుతుంది , రాజకీయం చేయాలంటే వేరే తెలివి తేటలు ఉండాలి .
ఎప్పుడు ఒక్కడే తిరుగుతాడు , ఎదో సినిమాటిక్ స్టైల్ లో చేస్తుంటాడు, కెమెరా కి ఇచ్చే స్టిల్స్ కూడా కృత్రిమంగా ఉంటాయి .
రాజకీయాలలో అయితే ఉంటాడు , కానీ ఎమ్మెల్యే అవ్వోచ్చేమో ఇంకో రెండు మూడు సార్లు ట్రై చేస్తే, సీఎం చాలా కష్టం .
ఇంకొకరి తో కలిసి adjust అవ్వడం, ట్రావెల్ చేయడం తనకి చాలా కష్టం ( స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ అంటూ ఎవరి పేర్లు వినలేదు , 3 టైమ్స్ marriages , ఆ రష్యన్ వైఫ్ తో కూడా విడాకులు అని రూమర్ ) తన మాట నెగ్గే environment లోనే తను బ్రతక్కగలడు .
చూద్దాం