noreply@blogger.com (వెంకట రాజారావు . లక్కాకుల) తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

నవ రస(జ్ఞ) భరితం;noreply@blogger.com (వెంకట రాజారావు . లక్కాకుల)

వ్యాసం బెంతేన్ హృదయ గతమై హాయి గూర్చెన్ రసఙ్ఞా !
వ్రాసెన్ కావ్యంబు రసధునులన్ పార్చి , కావ్యాత్మ ధీ సం
కాసం బొందన్ , మధురముగ శ్రీ కాళిదాసుండు , భావా
వాసంబుల్ ఇర్వురను నిలిచెన్ వాక్కులో , యుక్తిలోనున్ .

26 March 2025 12:27 PM

నవ రస(జ్ఞ) భరితం;noreply@blogger.com (వెంకట రాజారావు . లక్కాకుల)

కనగ కశ్మీరు చిలకమ్మ కళలు , మాకు
నవరసజ్ఞభరితమయ్యె , కవుల భావు
కతలు చదువ , నింత ఘనత గల తలమ్ము
గలదె ? కశ్మీరు గాక , భూతలము నందు .

23 March 2025 8:05 AM

మరోనేను....;noreply@blogger.com (వెంకట రాజారావు . లక్కాకుల)

బుధ్ధి వక్రించి చెడువైపు బోవు చుండ
స్వఛ్ఛతల వైపు పయనించ సాధ్య మగున ?
మనిషి ద్వేషాన్ని దాటి ప్రేమను వరించ
వట్టి మాటలు _ కవిత శభాష్ నవీన !

01 December 2015 10:08 PM

గోదారి;noreply@blogger.com (వెంకట రాజారావు . లక్కాకుల)

నిజమే . ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనస్సు కలుక్కు మంటుంది . లోకం నుండి మనం వేరై లోకాన్ని నిందిస్తుంటాం . మనమూ ఈ సమాజంలోని వాళ్ళమే . ఎవరికి వారు తమ కుటుంబాలలో ఇలాంటి ఘోరాలు నివారించ గలిగితే సమాజాన్ని నిందించ వలసిన అవసరమే రాదు కదా . వయసు మళ్ళిన తల్లి దండ్రులను పోషించాలంటే పెద్ద మనస్సు చేసుకొని భర్తలకు భార్యలు తోడ్పాటు నందించ వలసి ఉంటుందని గుర్తించాలి . అదంతా తమ బాధ్యత కాదనుకోవడం వల్లనే చిక్కంతా .

28 December 2013 12:25 PM