sarma తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

కష్టేఫలి;sarma

విన్నకోట నరసింహా రావు3 July 2025 at 08:33
నిజం సారూ! మీదంతా పాసిటివ్ తింకింగ్ కదా! కాలం అలాలేదు కదా!! ఏది ఏమైనా(సవ్యం ఐనా,అపసవ్యం ఐనా) మన పని జరిగితీరాలి, అంతే,అని నేటి కాలం అర్ధం సార్!

03 July 2025 9:34 AM

కష్టేఫలి;sarma

విన్నకోట నరసింహా రావు1 July 2025 at 11:36
డెభ్భై ఏళ్ళకితం పదహారేళ్ళ వయసులో Ehere the mind is without fear and the head is held high, where knowledge is free.... చదువుకున్నా! ఏం అర్ధమయింది? వయసుతో ఆలోచన పెరిగింది,మనసు పరిపక్వం చెందుతూ వచ్చింది,కొత్త కొత్త అర్ధాలు స్ఫురిస్తాయి.
చిన్నపుడు శతకాలు బట్టీ వేయించారు,ఏం అర్ధమయింది? కాలంతో వయసు పెరిగి జీవితంలో ఆ శతకాల పద్యాలు అర్ధమయ్యాయి. జీవితంలో వివిధ రకాల మనుషులు తారస పడితే,వివిధ రకాల పరిస్థితులలో ఉంటే జీవిత సత్యాలు బోధపడ్డాయి.
అందుకే వయసొస్తే గాని సొగసులు అర్ధం కావు 🤣

02 July 2025 9:06 AM

కష్టేఫలి;sarma

Rao S Lakkaraju1 July 2025 at 05:56
మీ ప్రభుత దొడ్డదండి. మాకూ తాతముల్లె పథకం రావచ్చేమోనండి🤣

తల్లి,తండ్రుల శవాలు కాటికిపోకుండానే ఆస్థులకోసం దెబ్బలాడుకుంటూ అంత్యక్రియల కర్చు ఎవరు పెట్టుకోవాలని కొట్లాడుకుంటున్న అన్నదమ్ములు,అక్క చెల్లెళ్ళు ఉన్న సమాజజంలోనే ఉన్నామండి,అంచేత ఇంకా తాతముల్లె అవసరమే అనుకుంటానండి,నేను.

01 July 2025 9:20 AM

కష్టేఫలి;sarma

Rao S Lakkaraju29 June 2025 at 08:57
ఏదేశమందైన
ఏ గేహమందైన
ఇదేకదాకత
ఎఱుకయే కదా సుమతీ 🤣

30 June 2025 9:06 AM

కష్టేఫలి;sarma


srinivasrjy28 June 2025 at 15:20
నిజమేకానండి,సమయానికి గుర్తురావు. అవసరానికి గుర్తురాని కర్ణుని అస్త్రాలలా 🤣 మళ్ళీ,మళ్ళీ చెప్పుకున్నా సరే!

28 June 2025 5:07 PM

కష్టేఫలి;sarma

bonagiri27 June 2025 at 22:11
అలా అంటారా?
ఐతే శశి థరూర్ తనగురించే చెప్పేరనుకుంటా! పిచ్చుక కాంగ్రెస్ నుంచి ఎగిరిపోతోందనమాట!
అయ్యో! కాంగ్రెసూ!! రాహుల్ బాబా! తరవాతెగిరిపోయే పిచుక చిదంబరమా?

28 June 2025 9:21 AM

కష్టేఫలి;sarma

bonagiri26 June 2025 at 19:22
నిజమేగానండి చిన్న అనుమానం.

చీనావాళ్ళంటే ఉడతలు,మిడతలు,ఉసుళ్ళను కూడా తింటారటగదండీ! మరి పాక్ వాళ్ళకేమండి? స్వతంత్రం వచ్చేదాకా వాళ్ళూ మనలోవాళ్ళే కదండీ! మేము వేరు,మా సంస్కృతి వేరంటారు ఓసారి, మరోసారి మొహంజదారో మా దగ్గరే ఉంది, ఆ సంస్కృతి మాదంటారు. ఆ సంస్కృతి మనదికూడా అంటారుటండి, మరి మనం ఉడతల్ని,మిడతల్ని,ఉసుళ్ళని తినంగా! అలాగే పిచుకలలాటివాటినీ తినం మరి పాక్ గగనతలంలో కెళితే ఎందుకండి కాల్చేయడం? చీనావాళ్ళతో దోస్తీ పెరిగి ఇవి తినడం నేర్చుకున్నారంటారా?

27 June 2025 9:18 AM

తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!;sarma

ఆగ్రిగేటర్ లో మార్పులు చేర్పులు కూర్పులు సూవించగల సమర్థుడను కాను, కాని ఒక మాట చెప్పాలనిపించింది. మార్పులను ఆహ్వానిస్తాను,మంచికోసమేనని అనుకుంటాను. ఫలితం కాలమే నిర్ణయిస్తుంది. ఏమైనా వ్యాఖ్య చేసేవారికి కొంచమైనా ఇంగితం ఉంటే ఈ సమస్యలే రావు కదా! 🤣

ఎంతచదువు చదివి ఎన్ని నేర్చినగాని
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాలగడుగ పోవునా మలినంబు?
విశ్వదాభిరామ వినుర వేమ!

23 June 2025 3:39 PM

కష్టేఫలి;sarma

Zilebi19 June 2025 at 21:11
దేశం గొప్పతనాన్ని చెప్పుకోవడం డబ్బా కొట్టుకోవడంగా భావించే వారిది దేశ ద్రోహులదే చరిత్ర. భారత దేశంలో వీరి జనాభాయే ఎక్కువ. దేశం లోని వాక్సిన్ గురించిన గొప్ప మరొకసారి కాదు ఎన్నిసార్లైనా చెబుతాను. సందేహం లేదు.

23 June 2025 9:45 AM

కష్టేఫలి;sarma

శ్రీ శ్రీనివాస్ జీ,శ్రీ శ్యామలీయం గారు.
ఇప్పటి వరకు మన ముగ్గురు మధ్యనే చర్చ జరుతోంది గనక మీ ఇద్దరి కామెంట్లకు సమాధానంగా:-

ఇప్పుడు బ్లాగుల్లో రాసేవారూ లేరు చూసేవారూ లేరు అన్నది పూర్తిగా నిజమైపోతూ ఉంది. ఇంకా బ్లాగుల్ని పట్టుకు వేలాదుతున్న కొన్ని జీవులు అలానే ఉన్నాయి. నెమ్మదిగా ఒక్కొకటీ జారిపోతాయి,కాలంతో. కొత్తగా వచ్చేవారు మాత్రం ఉండరని కచ్చితంగా చెప్పచ్చు. కొంత కాలానికి బ్లాగులా? అని అడిగే రోజూ వస్తుంది.🤣

బ్లాగుల్లో కామెంట్లు అన్నది, నేను చూసినంత వైవిధ్యం ఈ పదునాల్గు సంవత్సరాలలో, మరొకరు చూసి ఉంటారనుకోను. రకరకాల పీడ ముఖాల్ని చూసాను. నేను చచ్చిపోలేదని ఏడ్చినవారిని చూసాను. నా భార్య చనిపోతే ఆనందపడి చంకలు గుద్దుకున్న నీచుల్ని చూసాను. నా బ్లాగును దాని ద్వారా నన్ను అభిమానించిన ఎంతో మందినీ చూసాను. నన్ను వ్యక్తిగతంగా కలవాలని తహతహలాడిన వారిని చూసాను,కలిసి ఆనందం పంచుకున్నవారినీ చూసాను. ఐతే కామెంట్లు ఉత్సాహాన్నీ ఇస్తాయి,నిరుత్సాహ పరుస్తాయి. కామెంట్లు అక్కర లేదనుకున్నవారు మొదటిలోనే కామెంట్ బాక్స్ తీసేస్తే బెడద లేదు. ఇది పిచ్చి కుదిరితే పెళ్ళికుదురుతుందన్న సామెత లాటిది. కామెంట్లు అవసరమే! నన్ను నాబ్లాగును అమితంగా ద్వేషించిన వారిని చూసి తొట్రు పడ్డానేమో తప్పించి బ్లాగులనుంచి పోలేదు. కాలంతో చెల్లిపోతాను, అదెప్పుడూ, అది నాచేతిలో లేదు.

ఇది గతజల సేతు బంధనం. వేధించే, విషం చిమ్మే కామెంటర్లను మిగతా బ్లాగులవారు మెచ్చుకోవడం, కొంతమందైనా ఇది తప్పని చెప్పకపోవడం జరిగిన దురదృష్టం. అప్పుడపుడు ఒకరిద్దరు ఇటువంటివి ఖండించినా ఎక్కువ మంది కాకపోవడంతోను,అటువంటివారు చెలరేగిపోయారు. రేపు మనలనీ ఇలా వేధించవచ్చనే భయంతోనూ, కుల ద్వేషంతోనూ నోరు విప్పలేదు, ఇది సత్యం,సత్యం,సత్యం. కుల ద్వేషం బ్లాగుల్లో పూర్తిగా రాజ్యమేలిందన్నదే నిజం.

ఇక ఆగ్రిగేటర్లు ప్రాంభించిన వారంతా భాషమీద అభిమానంతో చేసిన సేవ తప్పించి మరొకటి కాదు. వీటి నిర్వహణకు సొమ్ములూ అవసరమే, కాలమూ వెచ్చించక తప్పదు,కొద్దిగానో,గొప్పగానో! దానిని కొంతేని పూడ్చుకోడానికి అద్వర్టైస్మెంట్లు అవసరమని చాలా కాలం కితమే నొక్కి చెప్పాను. అది చాలా కాలం తరవాత శ్రీనివాస్ అమలు పరచారు.

చివరగా తెనుగు బ్లాగులకి శోధిని మాత్రమే అగ్రిగేటర్ నిలిచింది. ఒక్కమాట చెప్పి విరమిస్తాను. ఎందుకో ఎక్కువమంది శోధినిని ఉపయోగించరు, ఇందులోనూ రాజకీయం ఉందనుకుంటాను.🤣

19 June 2025 5:21 PM

nmraobandi;sarma

ఏం చెప్పను. పప్పు వాసనకే కలుగులో ఎలకలు బయటికొస్తున్నాయి. ముద్దపప్పు వేరు, కలగలపు పప్పు వేరు. ఏదైతేనేం గాని ముద్దపప్పుకి ఆవకాయ,వెన్న అనుపానాలు. కలగలపు పప్పుకి చల్లమిరపకాయలు,గుమ్మడి వడియాలు అనుపానం. 🤣

16 June 2025 10:03 AM

nmraobandi;sarma

ఉండి ఉండి కమ్మహా ఉందని పప్పుమీద పడ్డావేం మిత్రమా!
వర్కింగ్ నోట్సని ఏదో రాసినట్టుంది అర్ధం కాలేదండీ!

15 June 2025 5:01 PM

స్మరణ;sarma

శ్రీ మాత్రేనమః
కుంటుతూ బండి నడుస్తోందమ్మా!
అంతా అమ్మ దయ!
ధన్యవాదాలు

13 June 2025 10:02 AM

స్మరణ;sarma

భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితాయైనమః
టపా బాగుంది
శ్రీమాతాయైనమః

12 June 2025 9:11 AM

అనుపల్లవి;sarma

విషాద కాలే సఖా త్వమేవ
భయాంధకారే ప్రభా త్వమేవ

మొత్తం కీర్తన అద్భుతం. నాకు సంగీతం గురించి తెలియదు. చెవికింపుగా సోకితే ఆనందిచడం వరకే, ఇది కూడా ఒకప్పటి మాటే! 'కవి" లో సగం

22 February 2025 9:58 AM

బోల్డన్ని కబుర్లు...;sarma

లలితమ్మాయ్!
కాకినాడలో ఉన్నరోజుల్లో ఒక ఇంట్లో అద్దెకున్నా! ఆ ఇంటి ఓనరమ్మ చూడని సినిమా లేదు. సినిమాచూసివచ్చి ఆమె సినిమాలో అన్ని డిపార్ట్మెంట్లు ఎలా పని చేసేయోవి వివరించేది, అనర్గళంగా. నాటికాలం లో నేటిలా మాధ్యమాలుండి ఉంటే ఆమెకు తప్పక అవార్డ్ వచ్చి ఉండేదని నా నమ్మిక. బాగోలేదనే సినిమా ఆమె మరో సారి మరో సారి చూసేది. బాగో లేదన్నారుగా మళ్ళీ ఎందుకు చూస్తారంటే, వాడు డబ్బులు పెట్టుబడిపెట్టి సినిమా తీసాడు. ఎక్కడ తగలేసుకున్నాడో చూడద్దండీ అనేది.వీరే కదా సినిమాకి మహరాజ పోషకులు. నీ సినిమాకత విన్నాకా అది గుర్తొచ్చింది,మరేం లేదు సుమా!
నీవు రాసే సినిమా రివ్యూ లు చదువుతాను. పి.హెచ్ డ్ తీసిస్ రాసినట్టుంటాయి. నేటి కట్ పేస్టులకంటే చాలా మేలు కదా! పి.హెచ్ డికి ప్రయత్నించచ్చు. ఉబోస మాత్రమే. ఎండుకంటే దీనికో కత ఉంది, నా ఇరవైల వయసులోది. ఒక తెలుగు మాస్టారు ఎప్పుడూ డిటెక్టివ్ సాహిత్యం,కొవ్వలి,జంపన ఇలా ఈ సాహిత్యమే చదువుతూ ఉండేవాడు. ఎప్పుడూ ఇదే పుస్తకం ఒకటి చేత ఉండేది. ఒక సారి అడిగా తెగించి, దీనిమీద రిసెర్చ్ చేస్తున్నా ప్.హెచ్. డి కి అన్నారు. ఔరా! అని అశ్చర్యపోయా.
నీ ఛావా సినిమా రివ్యూ థీసిస్ లా ఉంది. ఎక్కువ చెప్పేనా!
విజయోస్తు!

21 February 2025 10:07 AM

బోల్డన్ని కబుర్లు...;sarma

లలితమ్మాయ్
సంధులు సమాసాలు అంటున్నావు,కొత్తగా. రామాయణం ఎత్తి కట్టేసావా? అడిగానని అనుకోవద్దు,చెప్పకుండ దాటేయద్దు

06 February 2025 9:28 AM

అమృతమథనం;sarma

ఓ పుస్తకంగా అచ్చేయిస్తే పుట్టబోయే రాజకీయపార్టీలలోకి చేరబోయేవారికి ఒక మార్గదర్శి అవుతుంది. __/\__

01 November 2023 9:28 AM

అమృతమథనం;sarma

చాలా రోజుల్నుంచి విడవక చదువుతున్నా! మీ డయరీలా అనిపించింది. పేరాలు విడదీయకపోడం తో విషయంలోంచి విషయంలోకి దొర్లిపోతుంటే గందరగోళంగా ఉంది, మొదట్లో, అలవాటైపోయింది లెండి.

07 July 2023 10:43 AM