siva తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
మీ అనువదం బాగుంది.... మంటో గారి ఇతర రచనలను మీరు తెనుగిస్తే తెలుగు వారికి దేశవిభజన సమయంలో పరిస్ఠితులు తెలియపరిచిన వారు అవుతారు. మీరు అనువాదం చెస్తారని అసిస్తూ.....
రవికాంత్
@ కొయిలాడ బాబు గారూ..
మీ ప్రోత్సాహానికి, అభిమానానికి ధన్యవాదాలు!! మీరు సూచించినట్లు ఇంకా ఎక్కువ శ్రధ్ధ తీసుకుని వ్రాయటానికి ప్రయత్నిస్తాను
- శివ
కావ్యాంజలి గారూ & శ్లోకా శాస్త్రి గారు..
అన్ని పోస్టులు ఓపికగా చదివినందుకు ధన్యవాదాలు! మీకు వీలున్నంతలో మీరు కూడా ఇలా కంపోస్టు చెయ్యటం మొదలుపెట్టండి. చాలా మంది అపోహపడుతున్నట్లు ఇది కష్టమైన పని ఏమీ కాదు. అదీ కాక ఇది మనందరి బాధ్యత కూడా.
ఎవరో పెద్దలు చెప్పినట్లు పెద్ద పెద్ద సమస్యలకి అంతేసి పెద్ద పరిష్కారాలు ఉండవు. చిన్న చిన్నవి, ప్రతి ఒక్కరు చెయ్యగలిగినవే నిజమైన మార్పుని తీసుకొస్తాయి!
శైల బాల గారూ..
ధన్యవాదాలు! ముఖ్యమైన టపా ఒకటి ఈ "చెత్త పని" సిరీస్‌కి ముగింపుగా వ్రాయాలనుకుంటున్నాను..అది కూడా చదివి మీ అభిప్రాయం చెప్పండి
మొవ్వా...బాగా చెప్పావు! చిన్న చిన్న విషయాల్లొనే ఎంతో ఆనందం ఉంది..మనం సరిగ్గా చూడగలిగితే!
శైలబాల గారూ...మీరు చెప్పింది నిజం అయ్యిండొచ్చు! తలచుకుంటే ఇప్పటికీ అది నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది!
వీలైతే ఆ బుక్ గురించి కొంచెం వివరాలు పంపగలరు
శైలబాలగారూ..ధన్యవాదాలు! మనం నమ్మి, ఆచరించి, అనుభవంలోకి వచ్చాక ఇంకొకరికి చెప్పటం నిజంగా వేఱు!!
కిరణ్‌గారూ,
చాలా కాలం నాకు తెలియక, తర్వాత తెలిసీ నిర్య్లక్ష్యంతో ఈ విషయం పట్టించుకోలేదు. ఇప్పటికీ చాలా మందికి చెత్త అంటే తీసికెళ్ళి బయటపడేస్తే పోయేదానికి ఇదంతా మనకెందుకు అనే అభిప్రాయం ఉంది. ఇది మారాలి. మనం ఒక్కరం మారితే ఏం ఉపయోగం అనుకోకుండా, మనం ఒక్కరం మారినా మనల్ని చూసి ఇంకొక్కరైనా మారతారేమో అని ఆలోచించాలి
అందుకే నాకు వీలైనంతలో ఈ విషయం గురించి తేలిగ్గా అర్థం అయ్యేటట్లు చెప్పదల్చుకున్నాను. ఇప్పటికే మా అపార్ట్‌మెంట్స్‌లో అందరికీ దీనిగురించి చెప్పేసి ఏమైనా ఇబ్బంది వస్తే ఉచిత సలహాలు/సర్వీసు ఇవబడును అనికూడా అనౌన్స్ చేసాను :-)
మీ ప్రోత్సాహానికి మళ్ళీ ధన్యవాదాలు! త్వరలో మూడో టపా (ఇంట్లోనే కంపోస్టు చేసుకోవటం) కూడా వ్రాస్తాను
కిరణ్ గారూ..
మీరన్నది నిజం! మునుపటి కంటే ఇప్పుడు కొంచెం నయం. చిన్న టౌన్‌లలో కూడ మెల్లగా తెలిసి వస్తుంది.
అయితే నేను చెప్పదల్చుకుంది కేవలం ప్లాస్టిక్ గురించే కాదు. ఎందుకంటే కేవలం ప్లాస్టిక్ వాడటం నియత్రించుకున్నా చెత్తతో సమస్య తీరిపోదు. సమస్యకి మూలం మన అలవాట్లలో ఉంది. వీలైనంత వివరంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను.
వీలైంత త్వరలో రెండో టపా వ్రాస్తాను - ఒక్కక్క టపా వ్రాయటానికి ఇంతింత సమయం తీసుకుంటున్నాను...ఓర్పు చేసుకుని క్షమించగలరు :-)
గీతాంజలి గారు:
మీ ప్రోత్సాహానికి మనసారా ధన్యవాదాలు!!
ముందు అనుకున్నంతటి కంటే కొంచెం వివరంగా వ్రాద్దామని అనుకోవటం వల్ల కొంచెం ఆలస్యం అవుతోంది. అదీకాక ఇది మనం ఒక అలవాటుగా మార్చుకోవలసిన, నేర్చుకోవలసిన పని కాబట్టి నిజంగా ప్రతి ఒక్కరికి నమ్మకం, ఇష్టం ఏర్పడాలి. అలా ఏర్పడేంత స్పష్టంగా నేను చెప్పగలగాలి. దానికి తోడు రచన అనేది నాకు సహజంగా అబ్బింది కాదు కాబట్టి అక్షరం అక్షరం పేర్చుకోవటానికి కొంచెం సమయం పడుతోంది :-)
శైల బాల గారు:
మీ అభిమానానికి ధన్యవాదాలు! చాలా ముఖ్యమైన విషయం మనం అలక్ష్యం చేస్తున్నామని నా అంతట నేను తెలుసుకోవటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అందుకే ఈ అంశం గురించి కొంచెం వివరంగా వ్రాద్దామనుకుంటున్నాను.
మీకు ప్రకృతి మీద ప్రేమ లేదంటే మాత్రం నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను :-) ఇక్కడ ఒక సూక్షమైన తేడా ఉంది. నిజానికి మీరన్న ప్రేమ, బాధ్యత గురించి విడిగా ఒక టపానే వ్రాయాలి. చాలా కాలం నుంచి మనసులో ఉన్న విషయం ఇలా గుర్తు చేసినందుకు మరొక్క సారి ధన్యవాదాలు. వీలైనంత త్వరలో ఇది కూడా వ్రాస్తాను
శైల బాల గారు: మీరన్నది నిజమే! కొంచెం క్లారిటీ మిస్ అయ్యింది. మనం చిన్నప్పుడు (ఒక 20 ఏళ్ళ ముందు) ఎలా వృధా చేసేవాళ్ళమో చెప్పి, అలా చెయ్యటం వల్ల మన భవిష్యతరాలకూ మనం ఏ మిగులుస్తున్నామో ఆలోచిద్దాం - అన్న ఉద్దేశ్యంతో వ్రాసింది ఈ టపా
శైల బాల గారూ..ప్రతి చిరుప్రాణిలో ఆప్యాయతని, మమకారాన్ని వెతుక్కోవటం బహుశా మీకే చెల్లిందేమో! గడ్డి పువ్వులు పెట్టుకోవటం..ఆ భావనే ఎంత బావుంది కదా - వాటికి కూడ విలువ ఇచ్చినట్లు, మీరేమీ తక్కువ కాదు అని చెప్పినట్లు !!
శైలబాల గారూ..మీ అభిమానానికి ధన్యవాదాలు! నాకు తోచిన చిన్న చిన్న విషయాలు నలుగురితో పంచుకోవాలన్నా తపన, వీలైనంత సూటిగా చెప్పాలన్న ఉద్దేశ్యం తో వ్రాయటం వల్లనేమో కొంచెం క్లుప్తం గా ఉంటాయి. మీ అందరినుంచి నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది..సవినయంగా చెప్తున్నానీమాట!