srinivasrjy తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
తెలుగు భాష అభ్యున్నతికి తోడ్పడుతున్న వెబ్ మ్యాగజైన్ లను కూడా ప్రోత్సహించవల్సిన అవసరం ఎంతైనా ఉంది.. వాటిలో వచ్చే ఆలోచించదగిన వ్యాఖ్యల ద్వారా ఆయా పోస్టులు చదివే అవకాశం ఉంది. వాటి వ్యాఖ్యలను ప్రత్యేక విభాగంగా పరిగణించ వలసిన అవసరం కనపడడం లేదు.
శ్రీనివాస్ (శోధిని)
బలం (అధికార బలం.. ధన బలం..జన బలం) శాశ్వతం కాదని గుర్తుంచుకుంటే సరి
@sarma
సార్ .. తెలుగు బ్లాగులు మళ్ళీ పుంజుకుంటాయి అనేది అసాధ్యం ..
ఇప్పుడు ఆగ్రిగేటర్ లో క్రొత్తగా మార్పులు చేసినా మనలాంటి వారి సౌలభ్యం కోసం మాత్రమే!
ఏదో గడిచినంత కాలం ముందుకు తీసుకు వెళదాం అనే తపనే తప్పితే .. ఏం చేసినా "వృధా ప్రయాస"
శ్యామలీయం గారూ,
నమస్తే .. మీరు చెప్పిన మార్పులు పరిశీలిస్తాను.
3వ పాయింట్ అర్ధం కాలేదు!!
ఇంకో విషయం మీ బ్లాగు "శ్యామలీయం" వీక్షకులకు అందుబాటులో లేని కారణంగా శోధిని నుండి తొలగించబడింది..
"కాని వాటి వ్యాఖ్యల పేజీలు ఎంతో హానికరం."
దీన్ని కాస్త విపులీకరిస్తారా .. ఎవరికి హానికరం ? సదరు బ్లాగర్ కా.. ఆ పోస్టు చూసేవారికా..
మీరన్నట్లు బ్లాగుల్లో అసభ్య వ్యాఖ్యలు వస్తుండవచ్చు .. బ్లాగులు కళతప్పడానికి వ్యాఖ్యల పేజీ కారణం అంటే నేను ఒప్పుకోను.. యూట్యూబ్ లో వీడియోలకు అనేక చెత్త కామంట్లు వస్తుంటాయి.. అయినంత మాత్రాన చానల్ మూసుకోరు కదా.. అయినా సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి కామెంట్లకు విలువ ఇవ్వడం తగ్గించేశారు అనుకుంటున్నాను..
అయితే బ్లాగుల్లోకి చాలామంది వ్యాఖ్యల పేజీ ద్వారానే వెళ్తున్నారు..
శోధినిలో తెలుగు బ్లాగులకు మాత్రమే వ్యాఖ్యల పేజీ ఉంది... దీనికి కారణం ఆదరణ.. అది తొలగించే ఆలోచన లేదు!
ఆగ్రిగేటర్లు నడపాలంటే సమయం అవసరమే లేదు.. అవి వాటంతట అవి పని చేసుకుంటూ పోతాయి.. ఆసక్తి ఉంటే చాలు!!
మనోహర్ గారూ.. మీ బ్లాగుకి కస్టమ్ డొమైన్ సెట్ చేయడం చాలా తేలిక .. వివరాలకు https://www.hostinger.in/tutorials/how-to-point-a-domain-to-blogger
ఒకసారి చూడండి .. కష్టం అనుకుంటే మీ నంబర్ నాకు మెయిల్ చేయండి .. srinivasrjy@gmail.com